AP Temples : పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, ఆ ఆల‌యాల్లో ధూప‌, దీప‌ నైవేద్యాల సాయం రూ.10 వేలకు పెంపు-ap govt hiked deepa naivedyam honorarium to 10k orders released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Temples : పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, ఆ ఆల‌యాల్లో ధూప‌, దీప‌ నైవేద్యాల సాయం రూ.10 వేలకు పెంపు

AP Temples : పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, ఆ ఆల‌యాల్లో ధూప‌, దీప‌ నైవేద్యాల సాయం రూ.10 వేలకు పెంపు

HT Telugu Desk HT Telugu
Oct 05, 2024 07:51 PM IST

AP Temples : అర్చకులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయం లేని చిన్న ఆల‌యాల‌కు ధూప‌, దీప‌, నైవేద్యాల కోసం ప్రభుత్వ సాయం నెల‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రూ.7,000 అర్చకుడికి, రూ.3,000 ధూప‌, దీప‌, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుంది.

పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, ఆ ఆల‌యాల్లో ధూప‌, దీప‌ నైవేద్యాల సాయం రూ.10 వేలకు పెంపు
పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, ఆ ఆల‌యాల్లో ధూప‌, దీప‌ నైవేద్యాల సాయం రూ.10 వేలకు పెంపు

పండ‌గ వేళ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.రాష్ట్రంలో ఆదాయం లేని చిన్న ఆల‌యాల‌కు ధూప‌, దీప‌, నైవేద్యాల కోసం ప్రభుత్వ సాయం నెల‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేర‌కు రాష్ట్ర దేవ‌దాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి ఎస్‌. స‌త్యనారాయ‌ణ జీవో నెంబ‌ర్ 216 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వం విధించిన‌ నిబంధ‌న‌ల‌తో ప్రభుత్వ సాయానికి చాలా ఆల‌యాలు దూరం అవుతున్నాయి. ఆదాయం లేని చిన్న ఆల‌యాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప‌, దీప‌, నైవేద్యం ప‌థ‌కం (డీడీఎన్ఎస్‌) అమ‌లు చేస్తున్నారు.

గ‌తంలో ఆదాయం లేని చిన్న ఆల‌యానికి రూ.2,500 చొప్పున అందించేవారు. అయితే 2015లో ప్రభుత్వ సాయం రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచారు. అందులో రూ.3,000 అర్చకుడి భృతి కాగా, రూ.2,000 ధూప‌, దీప‌, నైవేద్యానికి వినియోగించేవారు. ఆయా ఆలయాల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రతినెలా అర్చకులకు పడితారం చెల్లించాలి. అయితే ధ‌ర‌లు పెరిగి ఖ‌ర్చులు పెరిగిన నేప‌థ్యంలో ప్రభుత్వ పారితోషికం నెల‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల‌కు పెంచారు. ఇందులో రూ.7,000 అర్చకుడి భృతి కాగా, రూ.3,000 ధూప‌, దీప‌, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుంద‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రతినెలా అర్చకుడి ఖాతాలో అన్‌లైన్ ద్వారా ప్రభుత్వం జ‌మ చేస్తుంది.

దీని కోసం ఏడాదికి రూ.32.40 కోట్ల అదనపు వ్యయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. దీనిని సీజీఎఫ్ (దేవదాయ‌శాఖ‌కు చెందిన స‌ర్వ శ్రేయో నిధి-కామ‌న్ గూడ్ ఫండ్) నుంచి వినియోగించాల‌ని అందులో పేర్కొన్నారు. దీంతో ధూప‌, దీప‌, నైవేద్యం ప‌థ‌కం రాష్ట్రంలో 5,470 ఆలయాల‌కు వ‌ర్తిస్తుంది.

నిబంధ‌న‌ల‌తో ప్రభుత్వ సాయానికి చాలా ఆల‌యాలు దూరం

అయితే ధూప‌, దీప‌, నైవేద్యం ప‌థ‌కం (డీడీఎన్ఎస్‌) ల‌బ్ధికి చాలా ఆల‌యాలు దూరంగా ఉన్నాయి. ప్రభుత్వం విధించిన నిబంధ‌న‌ల‌తో చాలా ఆల‌యాలు ప్రభుత్వ సాయం అంద‌క దూరంగా ఉన్నాయి. ప‌ల్లె ప్రాంతాల్లోని ఆల‌యాల‌కు మాత్రమే దీన్ని వ‌ర్తింప‌జేస్తున్నారు. ఆల‌యానికి భూములు పది ఎక‌రాల‌లోపు ఉండాలి. ధ్వజ‌స్తంభం ఉండాలి. ఇంకా అనేక నిబంధ‌న‌లు ఉన్న కార‌ణంగా చాలా ఆల‌యాలు, అర్చకులు ద‌ర‌ఖాస్తు చేసుకోలేక‌పోతున్నారు. నిబంధ‌న‌లు స‌డ‌లించాల‌ని కోరుతున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో అర్చకుల‌కు వేత‌నాలు పెంచారు. ఇటీవ‌లి జ‌రిగిన దేవదాయ శాఖ స‌మీక్ష స‌మావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప‌లు నిర్ణయాలు తీసుకున్నారు. రూ.50 వేల‌కుపైన ఆదాయం ఉన్న ఆల‌యాల్లో ప్రతినెలా రూ.10 వేలు వేత‌నం పొందే అర్చకుల‌కు ఇక‌పై రూ.15 వేలు ఇవ్వాల‌ని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1,683 మంది అర్చ‌కులు ల‌బ్ధి పొందుతున్నారు. అంతేకాదు వేద విద్య చ‌దువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెల‌కు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి నిర్ణయం కూడా అప్పుడే తీసుకున్నారు.

జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం