AP KGBV Recruitment 2024 : కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు - దరఖాస్తు తేదీలు, ముఖ్య వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో ఖాళీగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి స్వీకరిస్తారు. అక్టోబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి చేసిన అప్లికేషన్లను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇటీవలనే టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ కాగా.. దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. తాజాగా ఖాళీగా ఉన్న 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. వీటిని ఔట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేయనున్నారు.
729 ఖాళీలు…
ఈ నోటిఫికేషన్ లో భాగంగా 729 ఖాళీలను భర్తీ చేస్తారు. టైప్-3 కేజీబీవీల్లో 547 పోస్టులు ఉండగా… టైప్-4 కింద 182 ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టుల వారీగా చూస్తే టైప్ 3 ఎక్కువగా 263 వంటమనిషి పోస్టులు ఉన్నాయి. ఇక వాచ్ ఉమెన్ 95, స్కావెంజర్ 79, స్వీపర్ ఉద్యోగాలు 62 ఉన్నాయి. టైప్ 4లో చూస్తే చౌకీదార్ 58 ఉండగా… హెడ్‌కుక్ 48 ఉన్నాయి. సహాయ వంట మనిషి 76 ఖాళీలు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్లను పూర్తి చేసి… మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. వీటిని అక్టోబర్ 17వ తేదీన జిల్లా కార్యాలయానికి పంపిస్తారు. ఆ తర్వాత మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. తుది మెరిట్ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. వాటిని కూడా పరిశీలించి.. ఫైనల్ ఫలితాలను ప్రకటిస్తారు.
ముఖ్య తేదీలు :
- ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబర్ 7వ తేదీన జిల్లా స్థాయి, మండల స్థాయిలో పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు.
- అక్టోబర్ 7వ తేదీ నుంచే మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలోనే దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్ లైన్ విధానం లేదు.
- అక్టోబర్ 16వ తేదీన మండలాల వారీగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తారు.
- అక్టోబర్ 17వ తేదీన సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కార్యాలయానికి పంపిస్తారు.
- అక్టోబర్ 18వ తేదీన తుది జాబితా సిద్ధం. ఆ తర్వాత జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆమోదం వేస్తుంది. ఇది అక్టోబర్ 21వ తేదీ నాటికి పూర్తి అవుతుంది.
- అక్టోబర్ 22వ తేదీన ఎంపిక జాబితాలను ఇస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీన డ్యూటీకి రిపోర్టింగ్ చేయాలి.
మరోవైపు ఏపీలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో(కేజీబీవీ) ఖాళీలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాంట్రాక్ట్ పద్ధతిలో 604 బోధన సిబ్బంది పోస్టుల, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు అక్టోబర్ 10 ఆఖరి తేదీ. ప్రిన్సిపల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ, పార్ట్ టైం టీచర్స్, వార్డెన్, అకౌంటెంట్ వంటి మొత్తం 604 పోస్టులను భర్తీ చేస్తారు.
అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తును దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు. దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్టోబర్ 10వ తేదీలోపు సమర్పించాలి.