జవహర్ నవోదయ విద్యాలయలో 2025-26 విద్యాసంవత్సరానికి 9వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. 9వ తరగతిలో ప్రవేశానికి 2010 మే 1వ తేదీ నుంచి 2012 జులై 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు ప్రస్తుతం 10వ తరగతి చదువుతూ... 2008 జూన్ 1వ తేదీ నుంచి 2010 జులై 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి.
ఆయా జిల్లా పరిధిలోని విద్యార్థులు మాత్రమే నవోదయ విద్యాలయ అడ్మిషన్లు పొందేందుకు అర్హులు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు www. navodaya.gov.in వెబ్‌సైట్‌లో అక్టోబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
దేశంలోని 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో సుమారు 653 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. 2025-26 విద్యాసంవత్సరానికి 9వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ లాటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి, విద్యార్థులు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్టోబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. నవోదయ విద్యాలయ సమితి పరీక్షకు నమోదు చేసుకున్న వారికి మాత్రమే అడ్మిట్ కార్డులను జారీచేస్తారు.
సంబంధిత కథనం