Anantapur Crime : ఈ నూనె రాస్తే నొప్పులు మాయం, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ-అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్-anantapur a man stolen golden ornaments from age old people in the ayurveda oils ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur Crime : ఈ నూనె రాస్తే నొప్పులు మాయం, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ-అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

Anantapur Crime : ఈ నూనె రాస్తే నొప్పులు మాయం, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ-అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Oct 05, 2024 06:12 PM IST

Anantapur Crime : అనంతపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆయుర్వేద వైద్యం పేరిట వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ చేస్తున్నాడు. నొప్పులకు ఆయుర్వేదం నూనెలు ఇస్తానంటూ వృద్ధులను నమ్మించి, వారి ఒంటిపై ఉన్న బంగారం తొలగించి నూనె రాస్తాను. ఈ క్రమంలో ఆ బంగారంలో కొంత చోరీ చేస్తున్నాడు.

ఈ నూనె రాస్తే నొప్పి మాయం, అనంతపురంలో కేటుగాడు-వృద్ధులను టార్గెట్ గా చేసుకుని బంగారం చోరీ
ఈ నూనె రాస్తే నొప్పి మాయం, అనంతపురంలో కేటుగాడు-వృద్ధులను టార్గెట్ గా చేసుకుని బంగారం చోరీ

అనంత‌పురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆయుర్వేదం వైద్యం పేరిట ముస‌లి వాళ్లను టార్గెట్ చేసి బంగారు ఆభ‌ర‌ణాలకు దొంగ‌తనం చేశాడు ఓ కేటుగాడు. ఈ అంత‌రాష్ట్ర దొంగ‌ను అనంత‌పురం పోలీసులు ప‌ట్టుకున్నారు. అతడి నుంచి ల‌క్షల విలువ చేసే 62. 7 గ్రాములు బంగారు ఆభ‌ర‌ణాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

క‌ర్ణాట‌కలోని గౌరిబింద‌నూరు తాలూకా న‌గ‌రిగిరి గ్రామానికి చెందిన గంగ‌న్న శివ‌రాజు (32) శ‌రీర నొప్పులకు సంబంధించిన నూనెల వ్యాపారం చేస్తూ ముస‌లివాళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగ‌త‌నాలు చేస్తుండేవాడు. శ్రీ‌స‌త్యసాయి జిల్లా మ‌డ‌క‌శిర‌, అనంతపురం జిల్లా ఇటుక‌ల‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఈ కేటుగాడిపై కేసులు న‌మోదు అయ్యాయి. సెప్టెంబ‌ర్ 30న అనంత‌పురం రూర‌ల్ ఆకుతోట‌ప‌ల్లి గ్రామానికి చెందిన శివ‌రామానాయుడికి ఆయుర్వేద వైద్యం చేస్తాన‌ని ప‌క్షవాతం లేకుండా చేస్తాన‌ని న‌మ్మబ‌లికాడు.

శివ‌రామానాయుడు భార్య రామ‌ల‌క్ష్మిని న‌మ్మించాడు. ఆ కేటుగాడు మాయ మాట‌ల‌ను ఆమె నమ్మింది. దీంతో వారి ఇంట్లో 52 గ్రాముల బంగారు ఆభ‌ర‌ణాలు దొంగ‌లించాడు. 2023 డిసెంబ‌ర్ 28న శ్రీ‌స‌త్యసాయి జిల్లా మ‌డ‌క‌శిర మండ‌లం అక్కంప‌ల్లికి గ్రామానికి చెందిన హ‌నుమ‌క్కతో కేటుగాడు ఆర్డీటీ సంస్థ త‌ర‌పున‌ వ‌చ్చిన‌ట్లుగా ప‌రిచ‌యం చేసుకొని బియ్యం, బ్యాడ‌లు, మంచి నూనె ఉచితంగా ఇప్పిస్తాన‌ని, ఈ ప‌థ‌కం పేద‌వాళ్లకు మాత్రమేనంటూ మాయ‌మాట‌లు చెప్పాడు.

ఫొటో తీసే స‌మ‌యంలో ఒంటిపైన న‌గ‌లు ప‌క్కన పెట్టమ‌ని చెప్పి ఆమె దృష్టి మ‌ర‌ల్చి 12 గ్రాముల బంగారు ఆభ‌ర‌ణాలు తొంగ‌లించాడు. ఈ దొంగ‌త‌నాలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వ‌రుస దొంగ‌త‌నాల‌తో జిల్లాలో సంచ‌ల‌నం అయింది. దీంతో జిల్లా ఎస్పీ ఏం జ‌రుగుతుంద‌ని ఆరా తీశారు. ఈ దొంగ‌త‌నాల‌పై దృష్టి పెట్టాల‌ని డీఎస్పీ, ఇత‌ర సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. దీంతో రంగంలో దిగిన డీఎస్పీ, ఇటుక‌లప‌ల్లి పోలీసులు బృందంగా ఏర్పడి కేటుగాడు గంగ‌న్న శివ‌రాజు కోసం గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు.

పోలీసులు ఎంతో శ్రమించి ఆ కేటుగాడుని ఎట్టకేల‌కు శుక్రవారం అరెస్టు చేశారు. అనంత‌పురం రూర‌ల్ ఉప్పర‌ప‌ల్లి పంచాయ‌తీ పంగ‌ల్ రోడ్డులో అరెస్టు చేసి, అత‌ని నుంచి బంగారు ఆభ‌ర‌ణాలు స్వాధీనం చేసుకున్నట్లు అనంత‌పురం రూర‌ల్ డీఎస్పీ వెంక‌టేశ్వర్లు తెలిపారు. దొంగ‌ను రిమాండ్‌కు త‌ర‌లించామ‌ని, త‌దుప‌రి ప్రక్రియ ప్రకారం చ‌ర్యలు ఉంటాయ‌ని పేర్కొన్నారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner