LIVE UPDATES
Vizianagaram : బంగారం వర్తకులపై తుపాకీ కాల్పులు - కారం చల్లి, ఇనుప రాడ్డుతో దాడి
Andhra Pradesh News Live August 23, 2024: Vizianagaram : బంగారం వర్తకులపై తుపాకీ కాల్పులు - కారం చల్లి, ఇనుప రాడ్డుతో దాడి
23 August 2024, 20:04 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Andhra Pradesh News Live: Vizianagaram : బంగారం వర్తకులపై తుపాకీ కాల్పులు - కారం చల్లి, ఇనుప రాడ్డుతో దాడి
- విజయనగరం జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. బంగారం వర్తకులపై ఇద్దరు దుండగులు తుపాకీ కాల్పులు జరిపారు. కళ్లల్లో కారం చల్లి, ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Andhra Pradesh News Live: Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... కెమెరాలు, రాగి రేకుల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా దక్కించుకోవచ్చు
- Tirumala Updates : శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం.భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలను ఆగస్టు 28వ తేదీన ఈ – వేలం వేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా సిల్వర్ కోటెడ్ రాగి రేకులను కూడా వేలం వేయనుంది.
Andhra Pradesh News Live: Agrigold Land Scam Case : జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు బెయిల్ మంజూరు
- అగ్రి గోల్డ్ భూముల కొనుగోలు కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాజీవ్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Andhra Pradesh News Live: Train Updates : ప్రయాణికులకు అలర్ట్ - విజయవాడ డివిజన్ లో 8 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- ప్రయాణికులకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎనిమిది రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 29 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Andhra Pradesh News Live: NHRC: అచ్యుతాపురం సెజ్ ఘటనపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. సీఎస్, డీజీపీకి నోటీసులు
- NHRC: అచ్యుతాపురం ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ప్రమాదాన్ని సుమోటోగా స్వీకరించింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. వివరణాత్మక నివేదికలో భద్రతా నిబంధనల్లో ఏదైనా నిర్లక్ష్యం ఉంటే స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించింది.
Andhra Pradesh News Live: AP High Court: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బెయిల్ మంజూరు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
- AP High Court: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో ఉన్నత న్యాయస్థానం పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది.
Andhra Pradesh News Live: Jagan at Atchutapuram: అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్.. ప్రభుత్వంపై ఫైర్
- Jagan at Atchutapuram: అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్.. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకుని.. ధైర్యం చెప్పారు. బాధితులకు అందుతున్న వైద్యం.. వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Andhra Pradesh News Live: AP Govt Jobs : 997 ఉద్యోగాల భర్తీకి వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలివే
- DME AP Recruitment 2024 : ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లోని పలు విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 997 ఖాళీలు ఉన్నాయి. ముఖ్య వివరాలను పూర్తి కథనంలో చూడండి
Andhra Pradesh News Live: PawanKalyan: ఊరూరా విజయవంతంగా సాగుతున్న గ్రామ సభలు, రైల్వే కోడూరు సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్
- PawanKalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పండగ వాతావరణంలో గ్రామ సభలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 13,326 పంచాయితీల్లో ఉదయం నుంచీ గ్రామ సభలు విజయవంతంగా నడుస్తున్నాయి.రూ.4,500 కోట్ల విలువైన పనులకు ప్రజలే తీర్మానాలు చేస్తున్నారు.రికార్డు స్థాయిలో ప్రజలు ఉపాధి పనులకు ఆమోదం తెలుపుతున్నారు.
Andhra Pradesh News Live: AP Depuy CM Pawan : నాకు పరిపాలన అనుభవం లేదు, నేర్చుకోవడానికి సిద్ధమే - పవన్ కల్యాణ్
- సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మైసూరావారిపల్లి గ్రామసభలో మాట్లాడిన ఆయన.. సినిమాలకంటే సమాజమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. తనకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
Andhra Pradesh News Live: AP Employees Unions: బదిలీ నుంచి తప్పించు కోడానికి ఉద్యోగుల కొత్త పన్నాగాలు.. ఉద్యోగ సంఘాల పేరిట సిఫార్సులు
- AP Employees Unions: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ నుంచి తప్పించుకోడానికి కొందరు కొత్తకొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నారు.ఉద్యోగ సంఘాలను అడ్డు పెట్టుకుని ఉన్న చోటి నుంచి కదలకుండా ఉండేందుకు పావులు కదుపుతున్నారు. కొందరు ఏ పనిచేయకుండానే ప్రభుత్వ వేతనాలు పొందుతూ కాలక్షేపం చేస్తున్నారు.
Andhra Pradesh News Live: Anantapuram Thief: అనంతపురంలో దొంగతనానికి వెళ్లి...దొరికిపోతానన్న భయంతో పై అంతస్తు నుంచి దూకిన దొంగ
- Anantapuram Thief: అనంతపురంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక దొంగ మూడుంతస్తుల మేడలోని ఒక ఇంటిలోకి దొంగతనానికి వెళ్లాడు. అయితే దొరికిపోతానన్న భయంతో పై అంతస్తు నుంచి దూకాడు. అంతే ఆ దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు.
Andhra Pradesh News Live: Parawada Blast: అనకాపల్లి జిల్లాలో మరో ప్రమాదం.. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో చెలరేగిన మంటలు
- Parawada Blast: అచ్యుతాపురం సెజ్ ఘటన మరవక ముందే.. విశాఖపట్నం జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Andhra Pradesh News Live: In-flight birth: సింగపూర్ విమానంలో పండంటి బిడ్డను ప్రసవించిన విజయవాడ యువతి, చెన్నై ఆస్పత్రికి తరలింపు
- In-flight birth: కాన్పు కోసం సింగపూర్ నుంచి పుట్టింటికి బయల్దేరిన విజయవాడ యువతికి విమానంలో నొప్పులు రావడంతో, అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో వైద్యురాలు పురుడుపోశారు. విమాన ప్రయాణంలో ఆ యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చెన్నై విమానాశ్రయంలో ఫ్లైట్ దిగిన తర్వాత ఆస్పత్రికి తరలించారు.
Andhra Pradesh News Live: Duvvada episode: దువ్వాడకు ఝలక్ ఇచ్చిన జగన్.. టెక్కలి ఇంఛార్జ్‌గా మరో నేతకు బాధ్యతలు
- Duvvada episode: దువ్వాడ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. కుటుంబ వివాదాలతో రొడ్డెక్కిన దువ్వాడకు వైఎస్ జగన్ ఝలక్ ఇచ్చారు. టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్సీపీ బాధ్యతలను వేరే నేతకు అప్పగించారు. ఇటీవల జరుగుతున్న గొడవల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Andhra Pradesh News Live: Vijayawada Sea Planes: విజయవాడ నుంచి అక్టోబర్‌లో సీ ప్లేన్ డెమో సర్వీసులు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వనున్న కేంద్రం
Vijayawada Sea Planes: మరుగున పడిపోయిన విజయవాడ సీ ప్లేన్ సర్వీసులు మళ్లీ ఊపిరి పోసుకుంటున్నాయి. అక్టోబర్‌లో విజయవాడ డెమో సర్వీస్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.సీప్లేన్ కార్యకలాపాలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నట్టు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ ప్రకటించారు.
Andhra Pradesh News Live: Atchutapuram incident: అచ్యుతాపురం ప్రమాదం.. థర్డ్ పార్టీ నివేదిక ఏం చెప్పింది.. టీడీపీ, వైసీపీ ఏమంటున్నాయి?
- Atchutapuram incident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మంది వరకు గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి తాజాగా థర్డ్ పార్టీ నివేదికపై రాజకీయ రచ్చ జరుగుతోంది.
Andhra Pradesh News Live: Ankapalli Pharma Blast: అనకాపల్లిలో మరో ఫార్మా కంపెనీలో పేలుడు, పలువురికి గాయాలు, బాధితుల్ని ఆదుకోవాలని సీఎం ఆదేశం
- Ankapalli Pharma Blast: అనకాపల్లి అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో ఘోర ప్రమాదం మరువక ముందే మరో ఘటన జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో గురువారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. బాధితుల్ని అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌లో తరలించాలని సిఎం ఆదేశించారు.
Andhra Pradesh News Live: Vja Police Suspensions: నందిగామలో చోరీ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ కమిషనర్ వేటు
- Vja Police Suspensions: దొంగ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ సీపీ వేటు వేశారు. అపహరణకు గురైన లక్షలాది రుపాయల్లో ఆరులక్షలు నొక్కేసి మిగిలిన మొత్తాన్ని రికవరీగా చూపించారు. చోరీకి పాల్పడిన నిందితుడు తాను మొత్తం ఇచ్చేశానని మొత్తుకోవడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఐదుగురిపై వేటు పడింది.