AP Govt Jobs : 997 ఉద్యోగాల భర్తీకి వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలివే
DME AP Recruitment 2024 : ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లోని పలు విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 997 ఖాళీలు ఉన్నాయి. ముఖ్య వివరాలను పూర్తి కథనంలో చూడండి
సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏపీ వైద్యారోగ్య శాఖ ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. డీఎంఈ(డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోని వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఖాళీలను భర్తీ చేయనుంది. అన్ని పోస్టులు కలిపి 997 ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఈ నోటిఫికేషన్ లో చూస్తే సీనియర్ రెసిడెంట్ (క్లినికల్) పోస్టులు 425 ఉండగా… సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్) ఉద్యోగాలు 479 ఉన్నాయి. ఇక సూపర్ స్పెషాలిటీ కింద 93 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 997గా ఉంది.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ ప్రకటన - డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్యారోగ్యశాఖ.
- ఉద్యోగ ఖాళీలు మొత్తం - 997
- భర్తీ చేసే పోస్టులు - సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఉద్యోగాలు.
- అర్హతలు - మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏపీ మెడికల్ కౌన్స్సిల్ లో రిజిస్ట్రర్ అయి ఉండాలి.
- 44 ఏళ్ల లోపు వయసు ఉన్న అభ్యర్థులు అర్హులవుతారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాల్సి ఉంటుంది.
- జీతం - నెలకు రూ.70,000 చెల్లిస్తారు.
- దరఖాస్తు విధానం - ఆన్‌లైన్
- దరఖాస్తు రుసుం - ఓసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి.
- దరఖాస్తుకులకు తుది గడువు - 27 ఆగస్టు 2024.
- అధికారిక వెబ్ సైట్ - https://dme.ap.nic.in/
- ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ - https://dmeaponline.com/
టాపిక్