Train Updates : ప్రయాణికులకు అలర్ట్ - విజయవాడ డివిజన్ లో 8 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ప్రయాణికులకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎనిమిది రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 29 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
సాంకేతిక, భద్రతా పనుల దృష్ట్యా సెప్టెంబర్ 2 నుండి 29 వరకు విజయవాడ డివిజన్‌లో ఎనిమిది రైళ్లను రద్దు చేశారు. 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు.
ఎనిమిది రైళ్లు రద్దు:
విజయవాడ డివిజన్ పరిధిలో ఎనిమిది రైళ్లను రద్దు చేశారు. మచిలీపట్నం-విజయవాడ మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07896) రైలు, విజయవాడ-మచిలీపట్నం మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07769) రైలు, నర్సాపూర్-విజయవాడ మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07863) రైలు, విజయవాడ-మచిలీపట్నం డీఎంయూ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07866) రైలును రద్దు చేశారు.
మచిలీపట్నం-విజయవాడ మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07770) రైలు, విజయవాడ-భీమవరం మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07283) రైలు, మచిలీపట్నం-విజయవాడ మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07870) రైలు, విజయవాడ-నర్సాపూర్ మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07861) రైలును సెప్టెంబర్ 2 నుండి 29 వరకు రద్దు చేశారు.
11 రైళ్లు దారి మళ్లింపు:
విజయవాడ డివిజన్ పరిధి 11 రైళ్లను దారి మళ్లించారు. వయా విజయవాడ, గుణదల, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. సెప్టెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో ఎర్నాకుళం-పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22643) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో భావనగర్-కాకినాడ పోర్ట్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12756) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది.
సెప్టెంబర్ 4, 6, 11, 13, 18, 20, 25, 27 తేదీల్లో బెంగళూరు-గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12509) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 2, 4, 6, 7, 11, 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినల్ (ముంబాయి)-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు ఉంటాయి.
సెప్టెంబర్ 2 నుంచి 29 తేదీ వరకు ధన్‌బాద్-అలెప్పి ఎక్స్‌ప్రెస్ (13351) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో టాటా నగర్-యశ్వంత్‌పూర్ స్పెషల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18111) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో జెసీదీ-తాంబరం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12376) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు కొనసాగుతాయి.
సెప్టెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో హతియ-ఎర్నాకుళం ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22837) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు ఉంటాయి. సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో హతియ-బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18637) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 3, 8, 10, 15, 17, 22, 24, 29 తేదీల్లో హతియ-బెంగళూరు సూపర్ ఫాస్ట్ (12835) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు ఉంటాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో టాటానగర్-హతియ వీక్లీ సూపర్ ఫాస్ట్ (12889) రైలు దారి మళ్లించిన మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది.