Soya Khichdi Recipe । సోయా ఖిచ్డీ.. హాయిగా తినాలనిపించే ఆహారం!
Soya Khichdi Recipe: త్వరత్వరగా, పోషకాలు నిండిన రాత్రి భోజనం చేయాలనుకుంటే సోయా ఖిచ్డీ బెస్ట్. రెసిపీ ఇక్కడ ఉంది, ప్రయత్నించండి.
Soya Khichdi Recipe (unsplash)
Healthy Dinner Recipes: సోయాబీన్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. శాకాహార ప్రోటీన్ వనరులలో ఇవి కూడా ఒకటి. సోయాతో వండిన ఆహారాలు తినడం ద్వారా కండరాలు, ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు, హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD) సహా కొన్ని క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ఈ ఆహారం సహాయపడుతుంది.
Soya Khichdi Recipe కోసం కావలసిన
- 1 కప్పు నానబెట్టిన సోయా బీన్లు
- 1.5 కప్పు నానబెట్టిన బియ్యం
- 2 పచ్చిమిర్చి
- 2 టమోటాలు
- 1 పెద్ద ఉల్లిపాయ
- 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 1/2 టీస్పూన్ పసుపు
- 1 టీస్పూన్ జీరా
- 2-3 tsp తాజా కొత్తిమీర ఆకులు
- 1/2 కప్పు పెరుగు
- 1/4 కప్పు పచ్చి బఠానీలు
- ఉప్పు రుచికి తగినంత
సోయా ఖిచ్డీని ఎలా తయారు చేయాలి
- ముందుగా ఒక పాన్‌లో నీటిని మరిగించండి, అందులో నానబెట్టిన సోయా బీన్స్, బియ్యంతో పాటు టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించండి
- మరొక పాన్‌లో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసి, అందులో జీలకర్ర వేసి వేయించాలి.
- ఆ తర్వాత, తరిగిన ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించాలి.
- అనంతరం ఇందులో వండిన సోయా అన్నంతో పాటు పసుపు, పెరుగు, పచ్చి బఠానీలు రుచికి తగినంత ఉప్పు వేసి కలపండి
- అవసరమైతే కొన్ని నీళ్లు పోసి కనీసం 10 నిమిషాలు ఉడికించండి, కలుపుతూ ఉండండి.
- చివరగా తరిగిన కొత్తిమీరను గార్నిష్ చేయండి.
అంతే, రుచికరమైన సోయా ఖిచ్డీ రెడీ.
సంబంధిత కథనం
టాపిక్