Cucumber Curd Rice Recipe । సమ్మర్ డైట్‌లో కమ్మని లంచ్ రెసిపీ.. దోసకాయ పెరుగు అన్నం!
Cucumber Curd Rice Recipe: ఎండాకాలంలో లంచ్ లోకి ఏది తినాలనిపించడం లేదా? మీ కడుపులో చల్లగా, తేలికగా ఉండే దోసకాయ పెరుగు అన్నం రెసిపీ ఇక్కద ఉంది. ఇది ఒకసారి తిని చూడండి.
Cucumber Curd Rice Recipe (slurrp)
Cool Summer Recipes: ఈ వేసవిలో మధ్యాహ్న భోజనంగా తేలికగా ఉండే అహారాన్ని స్వీకరించాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ రెసిపీ. సమ్మర్ డైట్‌లో కచ్చితంగా పెరుగు, దోసకాయలు వంటి చలువ చేసే ఆహారాలను చేర్చుకోవడం చాలా మంచిది. ఈ రెండూ కలగలిసిన దోసకాయ పెరుగు అన్నం రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఈ వంటకం చేయడానికి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు, సంక్లిష్టమైన దశలు లేవు. తక్కువ పదార్థాలతో కేవలం 10-15 నిమిషాల్లో ఈ వంటకం సిద్ధం అయిపోతుంది. ఇది ఈ వేడి సీజన్ లో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. మీరూ ఓ సారి ప్రయత్నించి చూడండి. ఎలా చేయాలో ఈ కింద సూచనలు అనుసరించండి.
Cucumber Curd Rice Recipe కోసం కావలసినవి
- 1 కప్పు అన్నం
- 1 కప్పు పెరుగు
- 1/2 కప్పు దోసకాయ తురుము
- 1 టేబుల్ స్పూన్ కరివేపాకు
- 1-2 ఎండుమిర్చి
- 2-3 టేబుల్ స్పూన్లు దానిమ్మ గింజలు
- 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ
- 1 స్పూన్ నల్ల మిరియాలు పొడి
- 1 స్పూన్ జీలకర్ర
- 1/2 టీస్పూన్ ఇంగువ
- 1-2 స్పూన్ నెయ్యి
- రుచి ప్రకారం ఉప్పు
- కొద్దిగా కొత్తిమీర తురుము
దోసకాయ పెరుగు అన్నం ఎలా తయారు చేయాలి
- ముందుగా దోసకాయను కడిగి, తురుముకోవాలి. అలాగే ఒక గిన్నెలో పెరుగును బాగా చిలక్కొట్టాలి.
- ఇప్పుడు పెరుగును, దోసకాయ తురుమును రెండూ బాగా కలుపుకోవాలి.
- పెరుగు దోసకాయ మిశ్రమంలో ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.
- ఆపైన వండిన అన్నంలో దోసకాయ పెరుగు మిశ్రమం వేయండి.
- ఇప్పుడు ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి, అందులో జీలకర్ర, ఇంగువ, మిరపకాయలు, కరివేపాకు, వేరుశనగ వేసి 1 నిమిషం పాటు వేయించాలి.
- చివరగా, వేయించుకున్న పోపును అన్నంలో కలిపేయాలి. పైనుంచి దానిమ్మ గింజలు చల్లుకోవాలి. 10-15 నిమిషాల పాటు ఈ అన్నంను చల్లబరచాలి.
అంతే, దోసకాయ పెరుగు అన్నం రెడీ. ఇందులో ఏం కలుపుకోకుండానే తినేయవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్