Cucumber Combinations। దోసకాయ, టొమాటో కలిపి తింటున్నారా? వన్ సెకండ్.. అలా తినకూడదు!-eating cucumber and tomato together can be bad for you check out worst food combinations ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Eating Cucumber And Tomato Together Can Be Bad For You, Check Out Worst Food Combinations

Cucumber Combinations। దోసకాయ, టొమాటో కలిపి తింటున్నారా? వన్ సెకండ్.. అలా తినకూడదు!

HT Telugu Desk HT Telugu
Apr 26, 2023 03:43 PM IST

Cucumber Combinations: దోసకాయలతో కూడా కలపకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Cucumber Combinations
Cucumber Combinations (unsplash)

Cucumber Combinations: ఎండాకాలంలో దోసకాయలు తినడం చాలా మంచిదని మనందరికీ తెలుసు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఈ దోసకాయలను సలాడ్లు చేసుకుంటాం, వంటకాల్లో వేసుకుంటాం, పచ్చిగా కూడా తినవచ్చు. తద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ దోసకాయలను కొన్నింటితో కలిసి అస్సలు తినకూడదు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాల కలయిక మేలు కంటే కూడా హానికరం కావచ్చు. ఉదాహరణకు చేపలు పెరుగు కలిపి తినరు, అలాగే పాలకూర టొమాటో కూడా కలిపి తినొద్దంటారు. ఇదే రకంగా దోసకాయలతో కూడా కలపకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Cucumber and Tomato Combination - దోసకాయ, టొమాటో కలిపి తినకూడదు

దోసకాయ, టొమాటోలను చాలా వంటకాల్లో వినియోగిస్తారు. కొంతమంది ఈ రెండింటినీ సలాడ్‌లలో కలిపి తింటారు. కానీ ఆరోగ్య పరంగా ఇది సరైన ఫుడ్ కాంబినేషన్ కాదు. వాస్తవానికి, ఈ రెండు జీర్ణమయ్యే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక జీర్ణక్రియ సమయంలో ఆసిడ్ pHని అసమతుల్యంగా చేస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం మొదలైన జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

Cucumber and Radish Combination - దోసకాయ, ముల్లంగి కలయిక

టమోటానికి కలిపేసినట్లే దోసకాయ, ముల్లంగిని కూడా సలాడ్‌లో కలిపి తినేవారున్నారు. అయితే, ఇది కూడా విరుద్ధమైన ఆహార కలయిక. దోసకాయ అలాగే ముల్లంగిలోని పోషకాలు రసాయన చర్య జరిపే అవకాశం ఉంటుంది. దోసకాయలో ఆస్కార్బేట్ ఉంటుంది, ఇది విటమిన్ సిని గ్రహించేలా చేస్తుంది. ముల్లంగిలొ సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దోసకాయ ముల్లంగిని కలిపి తింటే, అది ఈ ప్రక్రియలో ప్రతిస్పంద్రక చర్యను సృష్టిస్తుంది, ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Cucumber with Mil Products- దోసకాయ, పాలు కలయిక

దోసకాయ, పాలు రెండూ వేటికవే తమదైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే పోషకాహారాలు. చాలా మంది పాలు లేదా పాల పదార్థాలతో అనేక రకాలైన పండ్లు, కూరగాయలు కలుపుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నామని భావిస్తారు. కానీ ఇది అన్ని సందర్భాలలో కాదు. దోసకాయలను పాలు లేదా పాల పదార్థాలతో కలిపి తినకూడదు. పాలు భేదిమందులా పనిచేస్తాయి, దోసకాయలు మూత్ర విసర్జక కారకం. ఈ రెండూ కలిపితే వాంతులు, విరేచనాలే. పేగు కదలికలు ఎక్కువగా ఉండవచ్చు, జీర్ణక్రియ ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు.

కాబట్టి మీరు తినేవి ఆరోగ్యకరమైనవే అయినా, వాటిని ఇతర వాటితో కలపడం ద్వారా ప్రయోజనాలకు బదులు ప్రతికూలతలు ఉండవచ్చు. అందువల్ల ఆరోగ్యకరమైన, అనారోగ్యకరమైన ఆహార కలయికలపై అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.

WhatsApp channel

సంబంధిత కథనం