brinjal curry: ఏ మసాలాలు లేకుండా అదిరిపోయే వంకాయ కొత్తిమీర కూర-andhra style coriander brinjal curry recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Andhra Style Coriander Brinjal Curry Recipe

brinjal curry: ఏ మసాలాలు లేకుండా అదిరిపోయే వంకాయ కొత్తిమీర కూర

Koutik Pranaya Sree HT Telugu
Apr 27, 2023 12:03 PM IST

brinjal curry: సులభంగా, తక్కువ మసాలాతో చేసుకునే వంకాయ కొత్తమీర కూర తినడానికి రుచిగా, చేయడానికి సులభంగా ఉంటుంది.

వంకాయ కొత్తిమీర కూర
వంకాయ కొత్తిమీర కూర

వంకాయ వంటి కూర ఇంకోటి లేదంటారు. ఒకే రకమైన కూరను వివిధ ప్రాంతాల్లో విభిన్న రకాలుగా వండుతారు. ఎలాంటి మసాలాలు లేని వంకాయ కొత్తిమీర కూర మాత్రం గోదావరి జిల్లాల్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేస్తారో చూద్దాం. పదంటే పదే నిమిషాల్లో కూర తయారవుతుంది.

కావాల్సిన పదార్థాలు:

అరకిలో- వంకాయలు (పచ్చని పొడుగు వంకాయలు)

ఒక కట్ట - కొత్తిమీర

పచ్చి మిర్చి - 5

జీలకర్ర - 1/2 టీస్పూన్

పసుపు - 1/2 టీస్పూన్

ఉప్పు - తగినంత

నూనె - రెండు టేబుల్ స్పూన్లు

త‌యారు చేసే విధానం:

step 1: వంకాయ‌ల్ని పొడవాటి ముక్కలుగా తరిగి రంగు మారకుండా ఉప్పు వేసిన నీళ్ల‌లో వేయాలి.

step 2: ఇప్పుడు కాడలతో సహా తరిగిన కొత్తిమీర‌, ఉప్పు, ప‌చ్చి మిర్చి, జీలకర్ర క‌లిపి మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి.

step 3: ఒక పాన్‌లో నూనె వేసి కాగిన త‌రువాత వంకాయ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టాలి. ముక్కలు కాస్త మగ్గాక పసుపు, కొన్ని నీళ్లు పోసుకొని మళ్లీ మూత పెట్టుకోవాలి.

step 4: ముక్కలు ఉడికి నీరు ఇంకి పోయాక కొత్తిమీర మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇపుడు వంకాయ ముక్కల్ని స‌న్న‌ని సెగ మీద మ‌గ్గ‌నివ్వాలి. అయిదు నిమిషాల్లో నీరు ఇంకిపోయి కూర సిద్ధం అవుతుంది. ఈ కూర అన్నం, చపాతీలోకి బాగుంటుంది.

 

WhatsApp channel

టాపిక్