Neutralize Salt in Food | కూరలో ఉప్పు ఎక్కువైందా? అయితే తప్పేంలేదు, ఇలా తగ్గించవచ్చు!-too much salty dont worry these are the ways to fix over salted food ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Too Much Salty, Dont Worry, These Are The Ways To Fix Over Salted Food

Neutralize Salt in Food | కూరలో ఉప్పు ఎక్కువైందా? అయితే తప్పేంలేదు, ఇలా తగ్గించవచ్చు!

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 04:06 PM IST

Neutralize Excess Salt in Food: ఎంతో కష్టపడి చేసిన మీ ప్రత్యేక వంటకంలో ఉప్పు ఎక్కువైందా? అయితే చింతించకండి, ఈ చిట్కాలతో సులభంగా అధిక ఉప్పును తగ్గించవచ్చు

Neutralize Salt in Food
Neutralize Salt in Food (iStock)

వంట చేయడం కూడా ఒక ఆర్ట్. అందరికీ నచ్చేలా రుచికరమైన వంటలు తయారు చేయడమేమి అంత సులభమైన విషయం కాదు. వంటను కేవలం తినడానికి మాత్రమే చేయరు, ప్రేమను వ్యక్తపరచటానికి కూడా ఇది ఒక మార్గం. మీకు ఇష్టమైన వారి కోసం ఎప్పుడైనా వంట చేయాల్సి వచ్చినప్పుడు, లేదా మీరు ఎంతో కష్టపడి, శ్రమకోర్చి చేసిన వంటలో పొరపాటున ఉప్పు ఎక్కువయింది అనుకోండి, అప్పుడేం చేస్తారు? మీరు పడిన కష్టం అంతా వృధానే అనుకుంటారా? కానీ అలా ఏం జరగదు, కొన్ని మార్గాల ద్వారా రుచిని తీసుకు రావచ్చు.

పప్పులో, కూరల్లో దేనిలో అయినా అన్నీ వేసిన తర్వాత ఉప్పు వేయకపోతే రుచిగా ఉండదు, ఎక్కువ వేసినా కూడా రుచిగా ఉండదు. అందుకే ఉప్పు వేయడానికి ఎప్పుడూ కొలత అనేది చూపించరు, రుచికి తగినంత వేయాలని సూచిస్తారు. రుచికి తగినంత ఉప్పు వేసినపుడే ఏ వంటకానికైనా అద్భుతమైన రుచి వస్తుంది.

Ways to Neutralize Excess Salt in Food

ఉప్పు తక్కువైతే పై నుంచి వేసుకోవచ్చు, ఒకవేళ ఉప్పు ఎక్కువైతే, ఆ ఉప్పును తటస్థీకరించటానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి, అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పాల ఉత్పత్తులను కలపండి

కొన్ని కూరల్లో పాల పదార్థాలను కలుపుకోవచ్చు. ఏదైనా కూరలో ఉప్పు ఎక్కువైనపుడు హెవీ క్రీమ్, హోల్ మిల్క్ లేదా మరొక రకమైన డైరీ ఉత్పత్తిని అందులో కలపవచ్చు. పాలలో కొంత చక్కెర ఉంటుంది, ఇది ఉప్పు రుచిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆల్మండ్ మిల్క్ లేదా కొబ్బరి పాలు వంటి నాన్-డైరీ మిల్క్‌లు కూడా అదే విధంగా పని చేస్తాయి.

నిమ్మరసం కలపండి

మీ వంటకంలో ఉప్పు ఎక్కువైందని భావిస్తే, కొంత సిట్రిక్ యాసిడ్‌ను కలపడం వలన ఉప్పు ఘాడతను తగ్గించవచ్చు. అందుకు నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ మంచి ఎంపికలు, ఎందుకంటే అవి లవణాన్ని తటస్థం చేయడంలో సహాయపడతాయి. టొమాటో సాస్ లేదా టొమాటో పేస్ట్ వంటి టొమాటో ఉత్పత్తులు కూడా పని చేస్తాయి, ఎందుకంటే టమోటాలు ఆమ్లంగా ఉంటాయి. ఈ పద్ధతి ముఖ్యంగా సూప్‌లు, గ్రేవీలలో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

మసాలా దినుసులు వేయండి

డిష్‌కు ఫ్లేవర్ అందించే మసాలా దినుసులు జోడించడం ద్వారా కూడా ఉప్పు తగ్గించటానికి సహాయపడతాయి. సోర్ క్రీం, అవోకాడో, రికోటా చీజ్ వంటివి ఉపయోగించవచ్చు. ఎందుకంటే అవి క్రీమీగా ఉంటాయి, ఉప్పును కొద్దిగా పలుచన చేయడానికి, మీ అంగిలిపై సమాన రుచిని పంపిణీ చేయడానికి సహాయపడతాయి. ఈ పులుసు, చారు, రసం వంటి ఇతర సారూప్య వంటకాలకు ప్రత్యేకంగా ఈ చిట్కా ఉపయోగపడుతుంది.

బంగాళాదుంపలు కలపండి

ఉప్పు ఎక్కువైన కూరల్లో పచ్చి బంగాళా దుంపలు వేయడం మరొక సాధారణ పద్ధతి. ఇది సూప్‌లు, కూరలు ,ఇతర సారూప్య వంటకాల్లో బాగా పనిచేస్తుంది. కేవలం పచ్చి బంగాళాదుంప ముక్కలుగా కోసి, కూరలో వేసి ఉడికించాలి. ఇది ఉడికించినప్పుడు, బంగాళాదుంప అదనపు ఉప్పుతో సహా కొంత ద్రవాన్ని గ్రహిస్తుంది. దీంతో ఉప్పు అనేది తగ్గుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్