Brinjal Side Effects । మీకు ఆ సమస్య ఉంటే.. వంకాయ తినకూడదు!-brinjal has side effects people with these health issues should avoid eating eggplant ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brinjal Side Effects । మీకు ఆ సమస్య ఉంటే.. వంకాయ తినకూడదు!

Brinjal Side Effects । మీకు ఆ సమస్య ఉంటే.. వంకాయ తినకూడదు!

HT Telugu Desk HT Telugu
Nov 23, 2022 09:20 PM IST

Brinjal Side Effects: మీకు వంకాయ కూర అంటే ఇష్టమా? ఇష్టం ఉన్నప్పటికీ వంకాయను అందరూ తినకూడదట. ఎవరెవరు తినకూడదో ఇక్కడ తెలుసుకోండి.

Brinjal Side Effects
Brinjal Side Effects (Unsplash)

ఆ కూరగాయను తింటుంటే.. ఆహా ఏమి రుచి, అనరా మైమరచి. రోజూ తినాలనే మోజు తీరనిది. తాజా కూరగాయల్లో రాజా ఏది అంటే అదే అని చెప్తారు. ఇప్పటికే అర్థమయిపోయుంటుంది కదా ఈ వర్ణన ఏ కూరగాయ గురించో అని. వంకాయ అనుకుంటున్నారా? అవునూ వంకాయే మరి.

వంకాయ కూర చాలా మందికి ఇష్టమైనది. గుత్తి వంకాయ కూర అంటే గొంతు కోసుకుంటారు. టొమాటో వంకాయ కలిపి కూర చేస్తే దాని రుచే వేరు. ఆకుపచ్చ వంకాయలు, ఊదా రంగు వంకాయలు, తెల్ల వంకాయలు, పొడుగు వంకాయలు, పొట్టి వంకాయలు, లావు వంకాయలు ఇలా ఎన్నో రకాల వంకాయలు ఉంటాయి, అన్ని వంకాయలు యమ రుచిగా ఉంటాయి, ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి. అయితే ఇక్కడ మీకో బైగన్ కీ బాత్ చెప్పాలంటే.. ఇంతటి రుచికరమైన వంకాయ కొందరికి మాత్రమే, అందరూ దీనిని తినడానికి వీలు లేదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Brinjal - Eggplant Side Effects - వంకాయతో సైడ్ ఎఫెక్ట్స్, వీరు తినకూడదు

కొన్ని అనారోగ్య సమస్యలు కలిగిన వారు వంకాయను తినకూడదు, ఎందుకంటే వంకాయతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఇది వారికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు.

గర్భధారణ సమయంలో వంకాయను నివారించమని చాలా సందర్భాల్లో వైద్యులు సలహా ఇస్తారు, ఎందుకంటే ఇది సాధారణంగా అమెనోరియా, నెలసరి సమస్యలు కలిగిన వారికి తినమని సిఫారసు చేస్తారు. ఇంకా ఎవరెవరు వంకాయను తినకుండా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు

మీ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానివారు వంకాయ కూరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది.

అలెర్జీలు ఉన్న వ్యక్తులు

మీకు ఏదైనా ఫుడ్ అలెర్జీ ఉన్నట్లయితే, వంకాయను తినవద్దు, ఎందుకంటే దీనిని తినడం వల్ల అలర్జీ సమస్య మరింత తీవ్రమవుతుంది.

కళ్ళలో చికాకు ఉన్న వ్యక్తులు

మీకు మీ కళ్లలో ఏదైనా సమస్య ఉంటే లేదా ఏదైనా మంట, వాపు కనిపిస్తే, అప్పుడు వంకాయను తినకండి.

డిప్రెషన్ ఉన్న వ్యక్తులు

మీరు డిప్రెషన్ మెడిసిన్ తీసుకుంటుంటే లేదా ఆందోళనతో బాధపడుతుంటే వంకాయ తినడం మానుకోండి. ఈ కూరగాయ రోగులలో డిప్రెషన్ మరింత పెంచుతుంది, కౌంటర్ మందుల ప్రభావాలను కూడా తగ్గిస్తుంది.

రక్తహీనత ఉన్న వ్యక్తులు

మీ శరీరంలో రక్తం స్థాయిలు తక్కువగా ఉంటే, మీరు వంకాయలకు దూరంగా ఉండాలి. వంకాయలోని సమ్మేళనాలు శరీరంలో రక్తం వృద్ధికి అడ్డంకిగా పనిచేస్తాయి.

హేమోరాయిడ్ ఉన్న వ్యక్తులు

మీరు పైల్స్‌తో బాధపడుతున్నట్లయితే వంకాయను నివారించండి, ఎందుకంటే ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది.

రాళ్ల సమస్య ఉన్నవారు

మీకు రాళ్లు ఉంటే, వంకాయను అస్సలు తినవద్దు. వంకాయలో ఉండే ఆక్సలేట్ రాళ్ల సమస్యను ఇంకా తీవ్రతరం చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్