Depression । డిప్రెషన్‌తో పోరాడే వారికి ఉచిత సలహాలు వద్దు.. ఇలా మాట్లాడాలి!
డిప్రెషన్‌తో పోరాడే వారితో మాట్లాడటం అంత ఈజీ కాదు. అనాలోచితంగా మాట్లాడితే, నిర్లక్షపు సలహాలు ఇస్తే అది బెడిసికొట్టి తీరని నష్టాన్ని మిగిలించవచ్చు. అయితే వారితో సంభాషణలు ఇలా ఉండాలని సైకాలజిస్టులు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, చూడండి.
జీవితంలో సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి. కొన్ని సమస్యలు పదేపదే విసిగించినపుడు, లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైనపుడు ఆ బాధ మనిషిని కుంగదీస్తుంది. డిప్రెషన్ అనేక విధాలుగా మీ మనసును మార్చివేస్తుంది. వాస్తవికతకు దూరంగా ఉన్న అనేక విషయాలను సైతం నమ్మేలా చేస్తుంది. పదేపదే ప్రతికూల ఆలోచనలను కలిగిస్తుంది. దీంతో మంచిని సైతం గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీ నుంచి ఆనందాన్ని దూరం చేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా మీరు అనుభవించకుండా చేస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే జీవితంపై విరక్తిపుడుతుంది. ముందుండే భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండలేరు. క్రమంగా ఆత్మహత్య ఆలోచనలకు దారితీయవచ్చు. కాబట్టి జరగరాని నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి.
డిప్రెషన్ ఎపిసోడిక్ కావచ్చు, శాశ్వతం కాదు. ఎవరైనా డిప్రెషన్ తో పోరాడుతున్నపుడు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వారిని ఓ కంట కనిపెడుతుండాలి. అయితే . డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తికి మద్దతు ఇవ్వడం అంత సులభం కాదు. అనాలోచితమైన నిర్ణయాలు, ఉచిత సలహాలు కొన్నిసార్లు ఎదురుదెబ్బ తీస్తాయి. ఆ వ్యక్తిని మరింత దయనీయంగా మారుస్తాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఈ దశ తాత్కాలికమైనదని, ప్రకాశవంతమైన రోజులు వారి కోసం వేచి ఉన్నాయని మీరు ఒప్పించలేకపోతే, మీరు వారికి చెప్పగలిగే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
డిప్రెషన్‌తో పోరాడుతున్న వ్యక్తితో ఎలా సంభాషించాలో, వారితో ఎలా డీల్ చేయాలో బెంగళూరుకు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ కస్తూరి చెటియా వివరించారు.
డిప్రెషన్‌తో పోరాడే వారితో సంభాషణలు ఈ రకంగా ఉండాలి:
1. మీరు ఎలాంటి బాధను అనుభవిస్తున్నారో పంచుకోవడానికి మీరు భయపడతారని నాకు తెలుసు, కానీ మీరు చెప్పేది వినటానికి మీకోసం నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పదలుచుకున్నాను.
2. నేను ప్రతీసారి మీకు సరైన పరిష్కారాన్ని చెప్పలేకపోవచ్చు, అయితే ఎల్లప్పుడూ మీ అనుభవాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.
3. వచ్చే వారం లేదా నెల ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి బదులుగా ఈరోజుపై దృష్టి పెట్టగలమా అని నేను ఆలోచిస్తున్నాను, ఈ ఒక రోజు మీకు ఎలా అనిపిస్తుంది?
4. ఓకే అయితే నేను మీతో పాటు కొద్దిసేపు కూర్చోవచ్చా? మీకు ఇష్టం లేకుంటే ఎలాంటి ఒత్తిడి చేయను.
5. నేను నిన్ను చూసే విధంగా మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. డిప్రెషన్ కనిపించే విధంగా కాదు.
6. మీరు ఇంతలా డిప్రెషన్‌ను ఎదుర్కొన్నంటున్నందుకు మీ శక్తిని నేను అభినందిస్తున్నాను.
7. మీరు ఇప్పటికిప్పుడే అన్ని పరిష్కరించాల్సిన అవసరం లేదు. కాసేపు విశ్రాంతి తీసుకోండి, ఆపైన ప్రయత్నించండి. ఎంతసేపయినా విశ్రాంతి తీసుకోండి.
8. మీలో ఈ తుఫాను ఎప్పటికీ తగ్గదని నాకు తెలుసు, కానీ తుఫాను ఎక్కువ కాలం నిలవదు కదా, కాబట్టి అది తొలగిపోయే వరకు మనం గట్టిగా ఉండాలి.
సంబంధిత కథనం