Green Peas Side Effects । ఆ సమస్య ఉన్న వారు పచ్చి బఠానీలు తింటే ఆరోగ్యానికి నష్టమే!-know green peas health benefits and side effects of excessive consumption ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Green Peas Health Benefits And Side Effects Of Excessive Consumption

Green Peas Side Effects । ఆ సమస్య ఉన్న వారు పచ్చి బఠానీలు తింటే ఆరోగ్యానికి నష్టమే!

HT Telugu Desk HT Telugu
Jan 19, 2023 09:58 PM IST

Green Peas Side Effects: పచ్చి బఠానీలు ఎంత రుచిగా ఉంటాయో, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయో, అతిగా తింటే దుష్ప్రభావాలు ఉన్నాయి.

Green Peas Side Effects
Green Peas Side Effects (Unsplash)

Green Peas Side Effects: పచ్చి బఠానీలు తినడానికి చాలా రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనాలు చేకూరుస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, E, D, C, K లతో పాటు కోలిన్, పాంటోథెనిక్ యాసిడ్, రిబోఫ్లావిన్ వంటి సమ్మేళనాలు లభిస్తాయి. పచ్చి బఠానీలు కూరగాయలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. వీటి రుచి ఇంకా ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు వీటిని అనేక రకాలుగా స్వీకరిస్తారు. వీటిని కూరగా వండుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, అల్పాహారాల్లో కలుపుకోవచ్చు, చాట్ కూడా తయారు చేసి తింటారు.

అయితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ పచ్చిబఠానీలను అతిగా తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొంతమందికి పచ్చి బఠానీలు అతిగా తినడం వలన కొన్ని రకాల దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

గాయం నయం కావడానికి ఆలస్యం

పచ్చి బఠానీలు 'విటమిన్ కె' కి మంచి మూలం. కానీ శరీరంలో విటమిన్ కె అధికంగా ఉండటం వల్ల అది రక్తాన్ని పలుచన చేయడమే కాకుండా ప్లేట్‌లెట్స్ కూడా తగ్గుతాయి. దీని కారణంగా శరీరంలో ఏదైనా గాయం త్వరగా నయం అవటానికి లేదా కణజాలం ముందస్తు మరమ్మత్తులో ఆటంకం ఏర్పడుతుంది. అంతే కాకుండా, సెన్సిటివ్ పొట్ట ఉన్నవారు, పొట్టలో పుండ్లు, రక్తం గడ్డకట్టడం, థ్రోంబోఫ్లబిటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి బఠానీల వినియోగం హానికరం.

అతిసారం సమస్య

పచ్చి బఠానీల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా పచ్చి బఠానీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, డయేరియా వంటివి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పచ్చి బఠానీలను నేరుగా తినకుండా, బ్రౌన్ రైస్, సోయా వంటి ఉత్పత్తులతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు, బఠానీల దుష్ప్రభావాలను కూడా తగ్గించవచ్చు.

గ్యాస్ సమస్య

గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు పచ్చి బఠానీలను తినకూడదు. నిజానికి పచ్చి బఠానీల్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో ఉండే చక్కెర జీర్ణవ్యవస్థ ద్వారా సులభంగా జీర్ణం కాదు. పచ్చి బఠానీలు ఎక్కువగా తీసుకుంటే తేలికగా జీర్ణం కాకపోవడానికి ఇదే కారణం. దీని వల్ల కడుపులో గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం, అపానవాయువు వంటి సమస్యలు వస్తాయి.

కిడ్నీ సమస్యలు

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు పచ్చి బఠానీలను తీసుకోవడం మానేయాలి. పచ్చి బఠానీల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చి బఠానీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ కారణంగానే కిడ్నీ రోగులకు పరిమితంగా బఠానీలను తినాలని సలహా ఇస్తారు.

అధిక యూరిక్ యాసిడ్

అధిక యూరిక్ యాసిడ్ సమస్య కలిగిన వారు కూడా పచ్చి బఠానీలు తినడం మానుకోవాలి. పచ్చి బఠానీల్లో ప్రొటీన్లు, అమినో యాసిడ్లు, విటమిన్ డి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలను దృఢంగా చేస్తాయి. కానీ పచ్చి బఠానీలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది. ఇది తర్వాత కీళ్లనొప్పులు, గౌట్‌కు దారి తీస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం