Rusk Side Effects | పాలు - టీలతో రస్క్ తింటే రిస్క్ ఎక్కువ, తగ్గిస్తే మంచిది!
Rusk Side Effects- చాలా మంది టీలో లేదా పాలలో బ్రెడ్, బన్, రస్క్ అంటూ తింటుంటారు. అయితే ఇందులో రస్క్ తింటే రిస్క్ ఎక్కువ అంటున్నారు ఆరోగ్య నిపుణులు, ఎందుకో ఇక్కడ తెలుసుకోండి.
చాలా మందికి టీతో పాటుగా ఏదో ఒకటి తినడం అలవాటు. వారు ప్రత్యేకంగా బ్రేక్ ఫాస్ట్ చేయరు పాలు లేదా టీలో ముంచుకొని బ్రెడ్, బిస్కెట్స్, బాంబే ఖారీ లేదా రస్క్ వంటివి తింటుంటారు. అయితే మీకు టీతో పాటు రస్క్ తినడం ఇష్టమా? అయితే మీ ఆరోగ్యానికి అది రిస్క్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం వేళలో లేదా సాయంత్రం పూట ఒక గ్లాస్ టీ, రెండు మూడు రస్క్‌లు తీసుకోవడం చాలా మంది ఇళ్లల్లో కనిపించే ఒక సాధారణ అలవాటు. ఈ సంప్రదాయ కలయిక మీ ఆరోగ్యానికి రహస్యంగా హాని చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రస్క్‌లు అదనపు గ్లూటెన్, ప్రాసెస్ చేసిన పిండి, ఎక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. వీటిలో ఏవీ ఆరోగ్యకరమైనవి కావు.
మీకు తెలుసా, ఒక తాజా నివేదిక ప్రకారం, ఈ రస్క్‌లను తరచుగా కాలం చెల్లిన బ్రెడ్ ముక్కలతో తయారు చేస్తారు. మీరు సాధారణంగా తినే మిల్క్ బ్రెడ్ గడువు దాటితే బూజు పడుతుంది, గట్టిగా తయారవుతుంది. అలాంటి వాటినే మరింత ప్రాసెస్ చేసి ఈస్ట్, చక్కెర, నూనె, పిండి వంటివి కలిపి మీ ప్రియమైన టోస్ట్ తయారు చేసి, కొత్తగా ప్యాక్ చేసి అమ్ముతారు అనేది ఆ నివేదికలో పేర్కొన్న విషయం.
రస్క్ అనేది కేవలం డీహైడ్రేట్ చేసి, అదనపు షుగర్ లోడ్ చేసిన బ్రెడ్ వెర్షన్. సరళంగా చెప్పాలంటే ఎండబెట్టిన బ్రెడ్. అలా ఎండబెట్టిన బ్రెడ్ ముక్కలకు చాలా పదార్థాలు కలిపి రుచిని తీసుకువస్తారు. ఇవి ట్రాన్స్ ఫ్యాట్‌లు, ఫ్లేవర్లు, చక్కెర, గ్లూటెన్‌తో నిండి ఉంటాయి. ఈ సమ్మేళనాలు క్రమంగా జీవక్రియ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
మాయో క్లినిక్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, బ్రెడ్ కంటే రస్క్‌లలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. 100 గ్రాముల రస్క్ బిస్కెట్లలో సుమారు 407 కిలో కేలరీలు కలిగి ఉండవచ్చు. అదే చక్కెర లేని 100 గ్రాముల బ్రెడ్ లలో కేవలం 258-281 కిలో కేలరీలు ఉంటాయి.
Rusk Side Effects- రస్క్ తినడం వలన కలిగే కొన్ని దుష్ప్రభావాలు
రస్క్ ఎక్కువగా తినడం వలన కలిగే కొన్ని దుష్ప్రభావాలు ఇప్పుడు తెలుసుకోండి.
- రస్క్‌లో గణనీయమైన మొత్తంలో చక్కెర ఉంటుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.
- మైదా కలిగి ఉన్న రస్క్ మీ ఆరోగ్యానికి హానికరం, క్రమం తప్పకుండా తింటుంటే అది మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది.
- నాణ్యత లేని రస్క్ తినడం రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
- రస్క్ ఉబ్బరం, అజీర్ణం, పేలవమైన జీర్ణక్రియ, మలబద్ధకం, ఇతర సమస్యలకు కారణమవుతుంది.
- రస్క్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి , దీనిని మిల్క్ లేదా టీతో కలిపినప్పుడు, ఇది ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది, జీవక్రియ ఆరోగ్యాన్ని మార్చుతుంది. అది ఊబకాయం, గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
చివరగా చెప్పేదేమిటంటే, ఇది కేవలం మీకు కొంత అవగాహన కోసం మాత్రమే ఇచ్చిన సమాచారం. ఏదైనా మితంగా తినడం వలన ఎలాంటి నష్టం లేదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, ఫుడ్ పాయిజనింగ్ సంబంధిత లక్షణాలు ఉంటే వైద్యుని సలహా తీసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్