LIVE UPDATES
Minister Sridhar Babu : ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోంది, కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ (image source from Twitter)
Telangana News Live September 15, 2024: Minister Sridhar Babu : ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోంది, కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
15 September 2024, 21:23 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Telangana News Live: Minister Sridhar Babu : ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోంది, కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
- Minister Sridhar Babu : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ అంతర్గత సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఎవరు తెలివి తేటలు చూపిస్తున్నారో ప్రజలకు ప్రత్యక్షంగా కనబడుతుందన్నారు.
Telangana News Live: Medak News : గణేష్ ఉత్సవాల్లో అపశృతి- ట్రాక్టర్ కడగడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి
- Medak News : మెదక్ జిల్లాలో గణేష్ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం ట్రాక్టర్ కడగడానికి వెళ్లిన యువకుడు చెరువులో కాలు జారీ పడి మృతి చెందాడు. ఈ ఘటన నర్సాపూర్ మండలం అవంఛ గ్రామంలో చోటుచేసుకుంది.
Telangana News Live: Minister Ponnam Prabhakar : బీఆర్ఎస్ తీరు చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతుందనే అనుమానం- మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఊపేక్షించమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తీరు చూస్తే కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటూ కాంగ్రెస్ ను బద్నాం చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు.
Telangana News Live: Hyderabad Metro : హైదరాబాద్ గణేష్ నిమజ్జనం- ఈ నెల 17న అర్ధరాత్రి 2 వరకు మెట్రో సేవలు
- Hyderabad Metro : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రో సేవలు పొడిగించింది. సెప్టెంబర్ 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది.
Telangana News Live: Viral Fever : కంపు కొడుతున్న పల్లెలు.. పట్టించుకోని అధికారులు.. మంచానపడుతున్న ప్రజలు
- Viral Fever : పరిశుభ్రంగా ఉండాల్సిన పల్లెలు కంపు కొడుతున్నాయి. వర్షాలతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాపిస్తున్నాయి. జ్వరాలను అదుపు చేసేందుకు వైద్యశాఖ శిబిరాలు నిర్వహిస్తుంటే వ్యాధులకు కారణమైన అపరిశుభ్రాన్ని పారద్రోలడంపై సంబంధింత శాఖలు దృష్టిసారించడం లేదు.
Telangana News Live: Hyderabad ECIL Trade Apprentice : హైదరాబాద్ ఈసీఐఎల్ లో 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి
- Hyderabad ECIL Trade Apprentice : హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో 437 ట్రేడ్ అప్రెంటిస్ షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన ఐటీఐ అభ్యర్థులు ఈ నెల 29లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ లో అప్రెంటిస్ గా నమోదు చేసుకోవాలి.
Telangana News Live: Revanth Reddy House : సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం
- Revanth Reddy House : సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం రేపింది. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్‌ను సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆ బ్యాగ్ ఎవరు పెట్టారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌లో హైటెన్షన్ కొనసాగుతున్న సమయంలో ఈ బ్యాగ్ హాట్ టాపిక్‌గా మారింది.
Telangana News Live: Ganja Smuggling : అంబులెన్స్‌లో గంజాయి స్మగ్లింగ్.. వీడు పుష్పకే గురువులా ఉన్నాడు కదా!
- Ganja Smuggling : గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. అయినా పోలీసులు మాటు వేసి పట్టుకుంటున్నారు. తాజాగా అంబులెన్స్‌లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ గంజాయి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. అంబులెన్స్‌ను సీజ్ చేశారు.
Telangana News Live: Khairatabad Ganesh : గణపయ్య సాక్షిగా ఇవేం పాడు పనులయ్యా..! పోలీసుల అదుపులో 285 మంది!
- Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి బడా గణపతిని దర్శించుకుంటున్నారు. ఈ సమయంలో కొందరు పోకిరీలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 285 మంది పట్టుబడ్డారు.
Telangana News Live: Medak Crime News : పార్కింగ్ ప్లేస్ లో రెక్కీ, ఆపై చోరీ - 17 బైకులు స్వాధీనం, నిందితుడు అరెస్ట్
- పార్కింగ్ ప్లేస్ లో ఉండే బైకులను చోరీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా అతని వద్ద నుంచి 17 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మెదక్ ఎస్పీ వెల్లడించారు.
Telangana News Live: TG Teacher Transfer : ప్లీజ్ టీచర్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు
- TG Teacher Transfer : ఆదర్శ పాఠశాల్లో పనిచేస్తున్న టీచర్ల కోరిక నెరవేరబోతోంది. దాదాపు మూడువేల మంది టీచర్లు బదిలీ కానున్నారు. ఉద్యోగాల్లో చేరిన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ప్రక్రియ మొదలవుతోంది. అయితే టీచర్లు బదిలీపై వెళ్తుంటే విద్యార్థులు ఏడుస్తున్నారు.
Telangana News Live: Ganesh Immersion 2024 : గణేష్ శోభాయాత్రలో డీజేలు, బాణసంచా వాడకంపై నిషేధం - సీపీ ఆదేశాలు
- Ganesh Immersion in karimnagar:వినాయకుడి నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16న సోమవారం జరిగే గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. డీజేల వినియోగం, బాణాసంచాలు కాల్చడం నిషేధమని నగర సీపీ అభిషేక్ మోహంతి ప్రకటించారు.
Telangana News Live: Real estate fraud : ఫేస్‌బుక్‌లో చూసి భూమి కొన్నారు.. రిజిస్ట్రేషన్ అయ్యాక అసలు విషయం తెలిసింది!
- Real estate fraud : రియల్ ఎస్టేట్ మోసాలు పలు రకాలు. రియల్టర్స్‌ను నమ్మి మోసపోయిన జనాలు ఎంతోమంది. మెదక్ జిల్లాలో ఇలాంటిదే ఒక కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కనే ఉన్న భూమి అమ్మకానికి చూపించి, రోడ్డుకు చాల దూరంగా ఎందుకు పనికిరాని భూమిని అంటగట్టి మోసం చేశారు.
Telangana News Live: TG DSC TET 2024 : డీఎస్సీ అభ్యర్థులకు మరో అలర్ట్... మీ టెట్ వివరాలు ఎడిట్ కావటం లేదా..? ఈ నెంబర్లను సంప్రదించండి
- TG DSC TET Edit Option : తెలంగాణ విద్యాశాఖ టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్లు పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. వీటిని పరిష్కరించేలా విద్యాశాఖ ప్రత్యేక ఫొన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎడిట్ ఆప్షన్ ఇంకా డిస్ ప్లే అవుతుంది.
Telangana News Live: Nirmal District : ప్రేమ పేరుతో మోసం - మైనర్ బాలిక కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
- ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన కేసులో నిందితుడికి నిర్మల్ పొక్సో కోర్టు 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.1500 జరిమానా విధింఛింది. ఈ మేరకు తుది తీర్పును వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఖానాపూర్ పోలీసులు వెల్లడించారు.
Telangana News Live: Hyderabad : ఘోర ప్రమాదం - రోడ్డు దాటుతున్న యువతిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - సీసీ కెమెరాలో రికార్డు
- హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana News Live: September 17th : విలీనం, విమోచనం, విద్రోహం.. సెప్టెంబర్ 17న ఏది జరుపుకోవాలి? దీనిపై భిన్నాభిప్రాయాలు ఎందుకు?
- September 17th : సెప్టెంబర్ 17.. తెలంగాణ రాజకీయాల్లో ఈ తేదీకి ప్రాముఖ్యత ఎక్కువ. ఉన్న మూడు ప్రధాన పార్టీలు సెప్టెంబర్ 17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అసలు సెప్టెంబర్ 17పై రాజకీయ పార్టీలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి అనే చర్చ జరుగుతోంది.
Telangana News Live: Hyderabad Liberation Struggle : మట్టి మనుషుల చైత్యనం.. బైరాన్‌పల్లి పోరాటం - నెత్తుటి వీరగాథకు 76 ఏళ్లు!
- రజాకార్ల ఆగడాలకు వ్యతికేరంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటి గడ్డగా వీరబైరాన్ పల్లి నిలిచింది. నాటి దురాగాతలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో వంద మందికిపైగా పోరాటయోధులు ప్రాణాలు కోల్పోయారు. రజాకార్ల రాక్షసత్వం నుంచి తమను తాము కాపాడుకోవడానికి రక్షక దళాలుగా ఏర్పడి నాడు పోరాటం కొనసాగించారు.