Hyderabad Metro : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం- ఈ నెల 17న అర్ధరాత్రి 2 వరకు మెట్రో సేవలు-hyderabad ganesh nimajjanam on september 17th metro rail services extended upto midnight 2 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం- ఈ నెల 17న అర్ధరాత్రి 2 వరకు మెట్రో సేవలు

Hyderabad Metro : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం- ఈ నెల 17న అర్ధరాత్రి 2 వరకు మెట్రో సేవలు

Bandaru Satyaprasad HT Telugu
Sep 15, 2024 06:28 PM IST

Hyderabad Metro : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం దృష్ట్యా మెట్రో సేవలు పొడిగించింది. సెప్టెంబర్ 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది.

హైదరాబాద్ గణేష్ నిమజ్జనం- ఈ నెల 17న అర్ధరాత్రి 2 వరకు మెట్రో సేవలు
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం- ఈ నెల 17న అర్ధరాత్రి 2 వరకు మెట్రో సేవలు

Hyderabad Metro : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. చివరి స్టేషన్ నుంచి రాత్రి 1 గంటకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని పేర్కొంది. అలాగే నిమజ్జనానికి అవసరమైన అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది. ప్రయాణికులు మెట్రో సేవలు వినియోగించుకోవాలని సూచించింది.

నిరంతరాయంగా ఎంఎంటీఎస్ సేవలు

గణేష్ నిమజ్జనం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో కన్నుల పండువగా జరుగుతుంది. డప్పు చప్పుళ్లు, యువత కేరింతలు, రంగురంగుల లైట్లను చూడటానికి రెండుకళ్లు చాలవు. నగర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వారి సౌకర్యం కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 నుండి 18 మధ్య రాత్రి వరకు జంట నగరాల్లోని వివిధ గమ్యస్థానాల మధ్య కొన్ని ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపాలని నిర్ణయించింది. 8 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. గణపతి భక్తులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.

  • రైలు నెం- GHL-5 (హైదరాబాద్- లింగంపల్లి) సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి.. అదే రోజు రాత్రి 11:55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
  • రైలు నెం- GHS-1 (సికింద్రాబాద్- హైదరాబాద్) సెప్టెంబర్ 17 రాత్రి 11:50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 12:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
  • రైలు నెం- GHS-6 (లింగంపల్లి- ఫలక్‌నుమా) సెప్టెంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 12:10 గంటలకు లింగంపల్లి నుండి బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 1:50 గంటలకు ఫలక్‌నుమా చేరుకుంటుంది.
  • రైలు నెం- GHS-7 (ఫలక్‌నుమా- సికింద్రాబాద్) సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 2:20 గంటలకు ఫలక్ నుమా నుండి బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఫలకున్మా చేరుకుంటుంది.

ఈ రైళ్లనే తిరిగి మళ్లీ స్టార్ట్ అయిన స్టేషన్లకు పంపిస్తారు. ఆఖరి సర్వీస్ సికింద్రాబాద్- హైదారాబాద్ మధ్య నడుస్తుంది. 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై.. 4 గంటల 40 నిమిషాలకు ఎంఎంటీఎస్ ఆఖరి సర్వీస్ ముగియనుంది. నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, బేగంపేట్ స్టేషన్లలో ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం