Hyderabad : గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన పోలీసుల డ్యాన్సులు.. డీజే పాటలకు అదిరేటి స్టెప్పులు-hyderabad police viral dance during ganesh visarjan procession ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad : గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన పోలీసుల డ్యాన్సులు.. డీజే పాటలకు అదిరేటి స్టెప్పులు

Hyderabad : గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన పోలీసుల డ్యాన్సులు.. డీజే పాటలకు అదిరేటి స్టెప్పులు

Sep 28, 2023 10:05 PM IST Maheshwaram Mahendra Chary
Sep 28, 2023 10:05 PM IST

  • Hyderabad Police Viral Dance : హైదరాబాద్ నగరంలో గణేశుడి నిమజ్జనాలు ఘనంగా సాగాయి. మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరగా… సాయంత్రం సమయానికి బాలాపూర్ గణేశుడి నిమజ్జనం ముగిసింది. ఆయా శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఉత్సాహంగా డాన్సులు చేస్తూ ముందుకు సాగారు. ఇదిలా ఉంటే… సంబరాల్లో భాగంగా ఒక పోలీసు డాన్స్‌తో దుమ్ము రేపారు. ప్రొఫెషనల్ డాన్సర్‌ మాదిరిగా ఆయన వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఈసారి వేడుకల్లో చాలా మంది కానిస్టేబుళ్లు అదిరిపోయే స్టెప్పులతో హుషారెత్తించారు. పోలీసుల ఆనందంతో డ్యాన్సుల చేయటం చూసి.. జనాలు కూడా వాళ్లతో కలిసి కాలు కదిపారు. ప్రతి రోజూ శాంతిభద్రతా చర్యల్లో పాల్గొంటూ సీరియస్‌గా ఉండే పోలీసులు.. ఇలా ఆనందంగా భక్తులతో కలిసి స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

More