తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 11, 2024: Kakatiya University Lands : కేయూ భూఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్, ఫిజికల్ సర్వే చేస్తున్న అధికారులు
Kakatiya University Lands : కేయూ భూఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్, ఫిజికల్ సర్వే చేస్తున్న అధికారులు
Kakatiya University Lands : కేయూ భూఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్, ఫిజికల్ సర్వే చేస్తున్న అధికారులు (HT_PRINT)

Telangana News Live September 11, 2024: Kakatiya University Lands : కేయూ భూఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్, ఫిజికల్ సర్వే చేస్తున్న అధికారులు

11 September 2024, 22:41 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

11 September 2024, 22:41 IST

Telangana News Live: Kakatiya University Lands : కేయూ భూఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్, ఫిజికల్ సర్వే చేస్తున్న అధికారులు

  • Kakatiya University Lands : కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు రెండు రోజులుగా వర్సిటీ చుట్టూ ఉన్న ఆక్రమణలను తేల్చేందుకు సర్వే చేస్తుంది. ముఖ్యంగా సర్వే నెంబర్ 229 భూములలో సర్వే చేసి సరిహద్దు గుర్తించింది. ఇక్కడ ఆక్రమణలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారించింది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 22:02 IST

Telangana News Live: TG DSC Edit Option : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, టెట్ వివరాల ఎడిట్ కు అవకాశం

  • TG DSC Edit Option : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 12, 13 తేదీల్లో దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. టెట్ వివరాలను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 19:50 IST

Telangana News Live: Gandhi Hospital Jr Doctor : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు

  • Gandhi Hospital Jr Doctor : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై రోగి సహాయకుడు దాడి చేశాడు. వైద్యురాలి అప్రాన్ లాగి, ఆమెను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆసుపత్రి సిబ్బంది, ఇతర వైద్యులు అతడిని అడ్డుకున్నారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 18:49 IST

Telangana News Live: TG Govt On Sept 17 : సెప్టెంబర్ 17పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ఆదేశాలు

  • TG Govt On Sept 17 : సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 18:17 IST

Telangana News Live: TG KGBV Recruitment : కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, సుమారు 1000కి పైగా ఖాళీలు!

  • TG KGBV Recruitment : తెలంగాణలోని కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్ష ఆధారంగా ఖాళీలను భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000కి పైగా ఖాళీలున్నట్లు తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 17:29 IST

Telangana News Live: Warangal : యథేచ్చగా రేషన్ బియ్యం దందా...! కొరఢా ఝుళిపించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

  • పీడీఎస్ రైస్ దందాపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు  చేపట్టారు. పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.13.41 లక్షల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే దందా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  పోలీసులు హెచ్చరించారు.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 16:36 IST

Telangana News Live: Medak Road Accident : ఆసుపత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు...! రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి

  • మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో తండ్రికొడుకు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 16:19 IST

Telangana News Live: HYDRA Demolitions : 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత - వివరాలను వెల్లడించిన 'హైడ్రా'

  • Hydra Demolitions in Hyderabad : అక్రమ నిర్మాణల కూల్చివేతపై ‘హైడ్రా’ వివరాలు వెల్లడించింది. 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జూన్‌ 27 నుంచి 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 14:30 IST

Telangana News Live: Medak Gamblers: లారీలో పేకాడుతూ పట్టుబడ్డారు.. సిద్దిపేటలో పేకాటరాయుళ్ల ఆటకట్టు

  • Medak Gamblers: పేకాట ఆడడానికి అనువైన స్థలం ఎక్కడ అంటే? లారీ లోనే అంటున్నారు కొంతమంది పేకాటరాయుళ్ళు. ఎక్కడ పెట్టాక ఆడిన పట్టుకుంటున్నారని. సిద్దిపేట దగ్గర లో రాజీవ్ రహదారి పక్కనే అపి ఉన్న లారీలో హాయిగా పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది పేకాటరాయుళ్లు.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 14:04 IST

Telangana News Live: Kakatiya University Admissions 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు

  • Kakatiya University Distance 2024 : దూర విద్య అడ్మిషన్లకు(డిగ్రీ, పీజీ) సంబంధించి కాకతీయ యూనివర్శిటీ కీలక అప్డేట్ ఇచ్చింది.  దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు http://sdlceku.co.in/  వెబ్ సైట్ లోకి అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 11:54 IST

Telangana News Live: CM Revanth Reddy : ‘కబ్జా చేస్తే మీరే ఖాళీ చేసి వెళ్లిపోండి - లేకపోతే హైడ్రా నేలమట్టం చేస్తుంది’ - సీఎం రేవంత్ వార్నింగ్

  • చెరువులు, నాలాలు, కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలి పెట్టమని పునరుద్ఘాటించారు. కబ్జా చేసిన వాళ్లు వారికి వారిగానే  ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు. లేకపోతే హైడ్రా రంగంలోకి దిగి నేలమట్టం చేస్తుందని హెచ్చరించారు.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 11:37 IST

Telangana News Live: Hyderabad : గచ్చిబౌలిలో రేవ్ పార్టీపై రైడ్ - అదుపులో యువతి, యువకులు!

  • హైదరాబాద్ SOT పోలీసులు గచ్చిబౌలిలో రేవ్​ పార్టీని భగ్నం చేశారు. గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. 20 మందికిపైగా యువతి, యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 10:49 IST

Telangana News Live: Adilabad Tourism : కట్టిపడేసే జలపాతాల సోయగాలు..! ఆదిలాబాద్ అడవి అందాలను చూసొద్దామా

  • పచ్చని ప్రకృతి అందాలకు కేరాఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అందులోనూ వానకాలం వస్తే జిల్లాలోని జలపాతాలు పొంగిపోర్లుతుంటాయి. ఓవైపు అరణ్యం, మరోవైపు జలసవ్వడులు.. ఇలాంటి దృశ్యాలను ఒక్కమాటలో వర్ణించలేం. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో జిల్లావ్యాప్తంగా ఉన్న జలపాతాలకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 10:09 IST

Telangana News Live: కరీంనగర్ - హసన్పర్తి కొత్త రైల్వే లైన్ కు అనుమతి ఇవ్వండి - రైల్వే మంత్రికి బండి సంజయ్ విజ్ఞప్తి

  • కరీంనగర్– హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు అనుమతి ఇవ్వాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖను అందజేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పెండింగ్ పనుల అంశాలను కూడా కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా ఆదేశాలివ్వాలన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 10:08 IST

Telangana News Live: Bandi Sanjay: రైల్వే మంత్రితో బండి సంజయ్ భేటీ, కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ కు అనుమతించాలని విజ్ఞప్తి

  • Bandi Sanjay: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు.  కరీంనగర్‌ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఉన్న  పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. కొత్త లైన్ల నిర్మాణం, ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల హాల్టింగ్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అంశాలపై చర్చించారు. 
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 7:11 IST

Telangana News Live: Ganja Smuggling: అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్, 12 కిలోల గంజాయి స్వాధీనం.. హైదరాబాద్‌కు రవాణా

  • Ganja Smuggling: అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు.‌ ఆరుగురు సభ్యులు గల ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 12 కిలోల గంజాయి, రెండు బైక్‌లు, 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  నిందితులు హైదరాబాద్ కు సప్లై చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

11 September 2024, 5:42 IST

Telangana News Live: Medak Murder: మెదక్ జిల్లాలో దారుణం: తాగిన మత్తులో బిక్షగాడిని కొట్టి చంపిన ఇద్దరు యువకులు

  • Medak Murder: మెదక్ జిల్లాలో అత్యంత దారుణ సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం కోల్పోయి, బిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దొంగగా అనుమానించారు. అతనిని విచక్షణ రహితంగా కొట్టి, అనంతరం  బైక్ కు కట్టి కొంతదూరం ఈడ్చుకెళ్ళి హతమార్చారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి