TG DSC Edit Option : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, టెట్ వివరాల ఎడిట్ కు అవకాశం
TG DSC Edit Option : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 12, 13 తేదీల్లో దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. టెట్ వివరాలను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
TG DSC Edit Option : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థులు టెట్ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. డీఎస్సీ దరఖాస్తుల్లో టెట్ వివరాలు ఎడిట్ చేయడానికి వెసులుబాటు ఇచ్చింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. 13వ తేదీ తర్వాత టెట్ వివరాల్లో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల డీఎస్సీ ఫైనల్ కీ విడుదల చేశారు. త్వరలోనే డీఎస్సీ ఫలితాలు విడుదల కానున్నాయి.
ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను జూన్ 12వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ ఫలితాల్లో పేపర్-1లో 57,725 మంది, పేపర్-2లో 51,443 మంది క్వాలిఫై అయ్యారు. ఇటీవలె డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫైనల్ కీ వెలువడిన విషయం తెలిసిందే. తుది ఫలితాలు ప్రకటించేందుకు టెట్ మార్కుల ఎడిట్ చివరి అవకాశం కల్పించింది విద్యాశాఖ. రెండు, మూడు రోజుల్లో డీఎస్సీ తుది ఫలితాలు విడుదల కానున్నాయి. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. టెట్ మార్కులను కలిపి డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో టెట్ వివరాల ఎడిట్ కు పాఠశాఖ విద్యాశాఖ అవకాశం కల్పించింది.
త్వరలో డీఎస్సీ ఫలితాలు
ఫైనల్ కీ కూడా రావటంతో మెరిట్ లిస్ట్ పై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ఆ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. డీఎస్సీ పరీక్షలో వచ్చిన మార్కులతో పాటు టెట్ వెయిటేజీని కలుపుతారు. రెండింటిని కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటిస్తారు. జిల్లాల వారీగా జనరల్ ర్యాంకులను ప్రకటించిన తర్వాత…. ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది. ఇందుకోసం ఒక్క పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి తర్వాత…పోస్టుకు ఒకరికి ఎంపిక చేస్తారు. వారికి నియామక ఉత్తర్వులను అందజేస్తారు. అయితే మొత్తం ప్రక్రియల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కీలకంగా ఉంటుంది. ఇందులోని ర్యాంకులను బట్టి అభ్యర్థులు ఓ అంచనాకు రావొచ్చు. ఈ జాబితాను ఈ వారం రోజుల వ్యవధిలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey లింక్ పై క్లిక్ చేసి ఫైనల్ కీని పొందవచ్చు. డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లపై భారీగా అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా… ఈసారి జరిగిన పరీక్షపై అత్యధిక స్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిశీలించిన విద్యాశాఖ ఫైనల్ కీని ప్రకటించింది.
సంబంధిత కథనం