Kakatiya University Admissions 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు-kakatiya university distance education admissions last date extended up to 30 september 2024 key dates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kakatiya University Admissions 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు

Kakatiya University Admissions 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 11, 2024 02:05 PM IST

Kakatiya University Distance 2024 : దూర విద్య అడ్మిషన్లకు(డిగ్రీ, పీజీ) సంబంధించి కాకతీయ యూనివర్శిటీ కీలక అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు http://sdlceku.co.in/ వెబ్ సైట్ లోకి అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

కాకతీయ వర్శటీ దూర విద్యలో ప్రవేశాలు
కాకతీయ వర్శటీ దూర విద్యలో ప్రవేశాలు

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ దూర విద్యలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం దరఖాస్తుల గడువు ముగియటంతో అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30, 2024 తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించారు. మొత్తం 33 కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యూకేషన్, కాకతీయ వర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఐసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీలో చూస్తే తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషయాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జువాలజీతో పాటు మరికొన్ని కోర్సులు ఉన్నాయి.

కేయూ దూర విద్యలో ప్రవేశాలు - ముఖ్య వివరాలు:

  • ప్రవేశాల ప్రకటన - స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, కాకతీయ వర్శిటీ, వరంగల్.
  • యూజీ కోర్సులు: బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ BLIsc (వ్యవధి: మూడేళ్లు.)
  • పీజీ కోర్సులు - ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్). (వ్యవధి: )రెండేళ్లు.
  • డిప్లొమా కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్‌ సి స్కిల్స్ (వ్యవధి: ఒక ఏడాది)
  • దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2024.
  • దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ లింక్ - http://sdlceku.co.in/UG-PG-Notification.php
  • యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంచుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ - http://sdlceku.co.in/index.php
  • మెయిల్ - info@sdlceku.co.in
  • సంప్రదించాల్సిన ఫొన్ నెంబర్లు - 0870 - 2461480, 0870 -2461490
  • డిగ్రీ అప్లికేషన్ ఫామ్ PDF డౌన్లోడ్ లింక్ - http://sdlceku.co.in/pdf/UG-2024.pdf
  • పీజీ అప్లికేషన్ ఫామ్ PDF డౌన్లోడ్ లింక్ -http://sdlceku.co.in/pdf/PG-2024.pdf

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ప్రవేశాలు:

మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే తుది గడువును కూడా పొడిగించారు. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అభ్యర్థులు డిగ్రీ, పీజీతో పాటు డిప్లోమా కోర్సుల్లో చేరవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులు https://online.braou.ac.in / వెబ్ సైట్ లోకి వెళ్లి నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలు కూడా వెబ్ సైట్ లో పొందుపరిచారు. మీ విద్యా అర్హతలు బట్టి కోర్సులను ఎంచుకోవచ్చు.

ముఖ్యమైన డైరెక్ట్ లింక్స్: