Medak Gamblers: లారీలో పేకాడుతూ పట్టుబడ్డారు.. సిద్దిపేటలో పేకాటరాయుళ్ల ఆటకట్టు
Medak Gamblers: పేకాట ఆడడానికి అనువైన స్థలం ఎక్కడ అంటే? లారీ లోనే అంటున్నారు కొంతమంది పేకాటరాయుళ్ళు. ఎక్కడ పెట్టాక ఆడిన పట్టుకుంటున్నారని. సిద్దిపేట దగ్గర లో రాజీవ్ రహదారి పక్కనే అపి ఉన్న లారీలో హాయిగా పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది పేకాటరాయుళ్లు.
Medak Gamblers: మిట్ట మధ్యాహ్నం లారీ వెనుక భాగంలో మందు తాగుతూ పేకాడుతూ కొందరు పోలీసులకు దొరికిపోయారు. లారీలో గుట్టు చప్పుడు కాకుండా పేకాడుతున్న విషయాన్ని కొంతమంది పోలీసులకు ఉప్పందించడంతో, పోలీసులు బరిలోకి దిగి వారి అటకట్టించారు.
8,365 రూపాయలు స్వాధీనం....
మంగళవారం సాయంత్రం సమయమున సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగీలా దాబా చౌరస్తా సమీపంలో లారీ అసోసియేషన్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో లారీ వెనక క్యాబిన్లో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, సిద్దిపేట టూ టౌన్ పోలీసులు కలిసి వెళ్లి రైడ్ చేయగా 10 మంది వ్యక్తులను వ్యక్తులు కలసి పేకాడుతుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 8,365/- వేల రూపాయలు, 11మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు, సిద్దిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
పేకాట ఆడిన వారి వివరాలు, ఓరం పద్మారెడ్డి, దేశెట్టి శ్రీనివాస్, చెప్యాల అమరేందర్ రెడ్డి, గోవిందారం కనకయ్య, కానుగుల కనకయ్య, పిండి అంజయ్య, కావటి నరసయ్య, పిండి శ్రీనివాస్, రాజబోయిన యాదగిరి, మహ్మద్ ఖలీల్. వీరందరిది కూడా నివాసం సిద్దిపేట పట్టణం. వీరందరూ లారీ డ్రైవర్లుగా, ఓనర్లుగా, ట్రాన్స్పోర్టేషన్ లో పనిచేస్తున్నారని విచారణలో తేలింది.
ఎవరైనా పేకాట ఆడితే పోలీసులకు ఫోన్ చేయండి....
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10 మందికి రూ 14,500 వేల రూపాయల జరిమానా
సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 10, మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా ఈరోజు సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి గారి ముందు హాజరుపరచగా విచారణ చేసి 10 మందికి ₹ 14,500/-వేల రూపాయల జరిమాన విధించారు.
Ht ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడవదని, మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.