LIVE UPDATES
Siddipet District : అప్పాలయచెరువులో 'వీరగల్లు' లభ్యం - రాష్ట్రకూటుల కాలం నాటిదిగా గుర్తింపు..!
Telangana News Live August 23, 2024: Siddipet District : అప్పాలయచెరువులో 'వీరగల్లు' లభ్యం - రాష్ట్రకూటుల కాలం నాటిదిగా గుర్తింపు..!
23 August 2024, 22:10 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Telangana News Live: Siddipet District : అప్పాలయచెరువులో 'వీరగల్లు' లభ్యం - రాష్ట్రకూటుల కాలం నాటిదిగా గుర్తింపు..!
- సిద్ధిపేట జిల్లాలోని అప్పాలయచెరువు గ్రామంలో రాష్ట్రకూటుల కాలం నాటి వీరగల్లు లభ్యమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ వివరించారు.
Telangana News Live: T-Fiber Project : రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ..! కేంద్ర టెలికాం శాఖ మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. రాష్ట్రంలోని 93 లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు వివరించారు. ఇందుకోసం ఉద్దేశించిన టీ-ఫైబర్ ప్రాజెక్టుకు వడ్డీ రహిత రుణం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Telangana News Live: CPS Employees Protest : పాత పింఛన్ విధానం అమలు చేయాలి - రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళన
- తెలంగాణలోని ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నిర్ణయం తీసుకోవాలని యూనియన్ సభ్యులు కోరారు. ఈ మేరకు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందించారు.
Telangana News Live: Vemulawada Temple : రాజన్న సన్నిధిలో అపచారం..! తప్పతాగి విధినిర్వహణ మరిచిన అయ్యగారు, నివేదన ఆలస్యం
- వేములవాడ ఆలయంలో ఓ అయ్యగారి బాగోతం బయటపడింది. తప్పతాగి ప్రసాదాలు తయారు చేయటం మరిచిపోవటంతో స్వామి వారికి నివేదన ఆలస్యమైంది. ఆలస్యంగా మేల్కొన్న అయ్యగారు ఆగమేఘాల మీద స్వామివారికి నైవేద్య ప్రసాదం తయారు చేశారు. ఉడికి ఉడకని నైవేద్యంతోనే పూర్తి చేశారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
Telangana News Live: Minister Ponguleti Challenge: హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నా! నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి - మంత్రి పొంగులేటి
- కేటీఆర్ వ్యాఖ్యలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో తన ఇళ్లు ఉంటే కూల్చేయవచ్చని స్పష్టం చేశారు. ఇదే విషయంపై హైడ్రా కమిషనర్ ను కూడా ఆదేశిస్తున్నానని చెప్పారు.
Telangana News Live: Warangal Rains: వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
- Warangal Rains: మొన్నటిదాకా హైదరాబాద్‌పై ప్రతాపం చూపిన వర్షాలు.. ఇప్పుడు వరంగల్ జిల్లాపై పంజా విసురుతున్నాయి. శుక్రవారం సాయంత్రం వరంగల్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Telangana News Live: Vargal Navodaya: వర్గల్ నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్
- Vargal Navodaya: వర్గల్ జవహార్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు.. సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Telangana News Live: Kalyana Lakshmi Funds : 'కల్యాణ లక్ష్మీ' స్కీమ్ కు నిధులు విడుదల - అప్లికేషన్ ఇలా చేసుకోవచ్చు..!
- కల్యాణలక్ష్మీ పథకానికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1225.43 కోట్లను విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులతో పాటు కొత్తగా అప్లై చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి నిధులను జమ చేయనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలను తెలిపారు.
Telangana News Live: Mpox: గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ వార్డు.. అన్ని జిల్లాలను అలర్ట్ చేసిన ఆరోగ్య శాఖ
- Mpox: ఢిల్లీ, కేరళలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. గాంధీ అస్పత్రిలో ప్రత్యేకంగా మంకీపాక్స్ వార్డును ఏర్పాటు చేసింది. అటు అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Telangana News Live: YouTuber Harsha: యూట్యూబర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. హర్ష వెర్షన్ వేరేలా ఉంది!
- YouTuber Harsha: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఏరియాలో గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్ హర్షపై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫింగ్ ఉల్లంఘనల ఆరోపణలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. ఈ వ్యవహారంపై హర్ష కూడా స్పందించారు. తాను ఎంతో మందికి సాయం చేశానని చెప్పాడు.
Telangana News Live: Hyderabad Hotels: కుళ్లిపోయిన మాంసం.. సింథటిక్ ఫుడ్ కలర్స్.. ప్రముఖ హోటళ్లలో ఇదీ పరిస్థితి!
- Hyderabad Hotels: హైదరాబాద్ మహా నగరంలోని పలు హోటళ్లపై ఇటీవల విమర్శలు పెరుగుతున్నాయి. కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్ ఇవ్వడం లేదు. ఇలాంటి ఆరోపణలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా ఆరాంఘర్ ఏరియా నిర్వహించిన తనిఖీల్లో హోటళ్లలోని డొల్లతనం బయటపడింది.
Telangana News Live: Balapur Murder Case: బీటెక్ స్టూడెంట్ ప్రశాంత్ మర్డర్ కేసులో ట్విస్ట్.. హత్యకు కారణం ఇదే!
- Balapur Murder Case: హైదరాబాద్ నగరంలోని బాలాపూర్‌లో బీటెక్ విద్యార్థి హత్య ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ప్రశాంత్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది.
Telangana News Live: Sangareddy Pollution: కాలుష్య జలాలు తాగి మూగజీవాలు మృత్యువాత, కళేబరాలతో పీసీబీ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
- Sangareddy Pollution: సంగారెడ్డి జిల్లాలో చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయి. పటాన్‌చెరు , జిన్నారం మండలంలోని ఖాజిపల్లి , కిష్టాయిపల్లి, గడ్డపోతారం, ప్రాంతాలల్లో కాలుష్య పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.పరిశ్రమలలో వెలువడే హానికరమైన వ్యర్ధాలను నిర్వాహకులు సమీపంలోని చెరువులు, కుంటలకు వదలుతున్నారు.
Telangana News Live: Nominated Posts: నామినేటెడ్ పదవుల కోసం నేతల ఎదురుచూపులు.. పార్టీ పదవులపై మరికొందరు గంపెడాశలు
- Nominated Posts: కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చాయి. పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. దశాబ్దకాలంగా పార్టీ కోసం పని చేసిన నాయకులు పదవులు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Telangana News Live: Warangal Crime: వరంగల్ నగరంలో ‘నార్త్’ దొంగలు! అలర్ట్ గా ఉండాలని పోలీసుల ప్రచారం
- Warangal Crime: వరంగల్ కమిషనరేట్ లో అంతర్రాష్ట్ర దొంగలు చొరబడ్డారు. పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో వరంగల్ మహా నగరంలోని తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి గుట్టుగా ఎంటరై దొంగతనాలు చేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి.
Telangana News Live: Cheating Couple: షేర్ మార్కెట్లో పెట్టుబడులు, ఉద్యోగాల పేరున 5 కోట్ల వరకు టోకరా, దంపతుల అరెస్ట్
- Cheating Couple: జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ జంట మోసాలకు తెరలేపింది. వివిధ భాషల్లో నైపుణ్యం సంపాదించి, పుణె, వైజాగ్, హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో జనాలను షేర్ మార్కెట్ లో పెట్టుబడులు, మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ మోసాలకు పాల్పడింది. చివరకు కటకటాల పాలయ్యారు.