తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Don't Use These Colour In Kitchen Here's Some Kitchen Vastu Tips

Kitchen Vastu Tips : వంటగదికి ఈ కలర్ వేయోద్దు.. వస్తువులు ఎక్కడ పెడితే మంచిది

HT Telugu Desk HT Telugu

03 February 2023, 11:11 IST

    • Kitchen Vastu Tips : చాలామంది వంటగదిని పెద్దగా పట్టించుకోరు.. ఓకే ఉంది కదా.. అంటే ఉంది అనుకుంటారు. కానీ ఇంటికి వంట గదే.. ముఖ్యం. వంటగదిని వాస్తు ప్రకారం.. చూసుకోవాలి. వాస్తు నియమాలను కూడా పాటించాలి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

ఇంటికి వంటగది(Kitche Room) చాలా ముఖ్యం. చాలా తక్కువ ప్లేసును మాత్రమే కేటాయిస్తారు కొంతమంది. కానీ కొన్ని వాస్తు నియమాలు(Vastu Tips) పాటించాలి. లేకపోతే మంచి జరగదని చెబుతుంటారు. వంటగదికి స్థలం కేటాయించడం కూడా చాలా ఇంపార్టెంట్. వంటగదిలోనే ఆహార పదార్థాలు ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల ఎక్కడ ఉండాలి. వంటగదికి వేసే కలర్(Colour) ఏంటి అని కూడా ఆలోచించి వేయాలి.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారికి ధన యోగం.. ఆర్థిక కష్టాలు దూరం- కుటుంబంలో సంతోషం..

Apr 29, 2024, 09:45 AM

డబ్బంతా ఈ రాశుల వారిదే! ఉద్యోగంలో ప్రమోషన్​, వ్యాపారంలో లాభాలు..

Apr 28, 2024, 10:47 AM

ఏప్రిల్ 28, రేపటి రాశి ఫలాలు.. ఐటీ రంగంలో పని చేసే వాళ్ళు రేపు జాగ్రత్తగా ఉండాలి

Apr 27, 2024, 08:38 PM

Lord Venus : శుక్రుడి సంచారంతో ఈ రాశులవారికి ఇబ్బందులు

Apr 27, 2024, 03:03 PM

Lord Surya : సూర్యభగవానుడి సంచారంతో సమస్యల్లో పడే రాశులు వీరే

Apr 27, 2024, 11:23 AM

Jupiter Venus conjunction: గురు శుక్ర సంయోగం.. గజలక్ష్మీ రాజయోగంతో వీళ్ళు విజయ శిఖరాలు చేరుకుంటారు

Apr 26, 2024, 03:28 PM

ఆగ్నేయంలో వంటగదిని నిర్మించుకుంటాం. వంట గదిలో గ్యాస్ స్టవ్(Gas Stove) కూడా ఆగ్నేయ కోణంలో ఉండాలి. వంట చేసేప్పుడు ముఖం.. తూర్పు వైపుగా ఉండేలా చూసుకోవడం మంచిదని చెబుతున్నారు పండితులు. ఈ కారణంగా సంపద కూడా పెరుగుతుందట. అంతేకాదు.. ఆరోగ్యం కూడా కలుగుతుంది. వంట గదిలో తాగునీటిని నిలువచేసుకునే.., చేతులు కడుక్కోవడానికి ఏర్పాటు చేసుకొనే కుళాయిని ఈశాన్యం దిశలో ఉండేలా చూసుకుంటే మంచిది.

ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువులు లాంటివి.. మైక్రోవేవ్ ఓవెన్, టోస్టర్, మిక్సర్ గ్రైండర్, జ్యూసర్ వంటి వస్తువులను ఆగ్నేయ కోణానికి సమీపంలో దక్షిణం వైపు ఉంటే.. శుభంగా అంటుంటారు. ఇక వంటగదిలో ఫ్రిడ్జ్ కచ్చితంగా పెట్టుకుంటారు. అయితే దీనిని దక్షిణా లేదా పశ్చిమ దిశలో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్.. ఈశాన్యం లేదా నైరుతి కోణంలో పెడదామనే ఆలోచనే చేయకుండా ఉంటే మంచిది. ఇక వంటకు సంబంధించిన సామగ్రి.. దక్షిణం, నైరుతి దిశలో పెట్టుకోవాలి. సిలిండర్(Cylinder) ఖాళీ అయితే.. నైరుతి దిశలో పెట్టుకోవాలి.

వంటగది ప్రధాన ద్వారం కూడా చాలా ముఖ్యం. వాస్తు దోషాలకు అవకాశం కూడా ఉంటుంది. మెయిన్ డోర్ కు.. వంట గదికి నడుమ కర్టెన్ ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం వంట గదిని మెయింటెన్ చేసుకుంటే చాలా మంచిది. అన్ని విషయాల్లో కలిసి వస్తాయని పండితులు చెబుతున్నారు.

ఇక వంటగదికి అట్రాక్టివ్ గా ఉండాలని కొంతమంది ఇష్టం వచ్చిన కలర్స్ వేస్తుంటారు. కానీ రంగుల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదికి లేత నారింజరంగు, క్రీం కలర్ వేయడం మంచిదట. ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందట. నలుపు(Black), నీలం రంగును అస్సలు ఉపయోగించకూడదు. నలుపు రంగును ఉపయోగిస్తే.. ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పే మాట.