Economic Survey: ఎలక్ట్రిక్ వాహన రంగంపై ఎకానమిక్ సర్వేలో కీలక విషయాలు.. ‘కోట్లలో అమ్మకాలు, ఉద్యోగాలు’-indian electric vehicle market expect to grow 1 crore annual sales create 5 crore jobs by 2030 economic survey ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Economic Survey: ఎలక్ట్రిక్ వాహన రంగంపై ఎకానమిక్ సర్వేలో కీలక విషయాలు.. ‘కోట్లలో అమ్మకాలు, ఉద్యోగాలు’

Economic Survey: ఎలక్ట్రిక్ వాహన రంగంపై ఎకానమిక్ సర్వేలో కీలక విషయాలు.. ‘కోట్లలో అమ్మకాలు, ఉద్యోగాలు’

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 31, 2023 07:27 PM IST

Economic Survey - Electric Vehicles: భారత్‍లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‍ వేగంగా వృద్ధి చెందుతుందని ఎకానమిక్ సర్వే పేర్కొంది. అమ్మకాలు, ఉద్యోగాలు, వృద్ధి గురించి కీలక విషయాలను వెల్లడించింది.

Economic Survey: ఎలక్ట్రిక్ వాహన రంగంపై ఎకానమిక్ సర్వేలో కీలక విషయాలు
Economic Survey: ఎలక్ట్రిక్ వాహన రంగంపై ఎకానమిక్ సర్వేలో కీలక విషయాలు (HT Photo)

Economic Survey - Electric Vehicles: భారత్‍లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ (Electric Vehicles Market) వృద్ధి గణనీయంగా అధికమవుతోంది. రానున్న సంవత్సరాల్లో ఈ వృద్ధి మరింత వేగవంతంగా ఉంటుందని ఎకానమిక్ సర్వే (Economic Survey) వెల్లడించింది. 2022-23 ఎకానమిక్ సర్వేను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల (Budget Sessions) తొలి రోజున ఈ ఆర్థిక సర్వే వివరాలను వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‍ (EV Market)పై కీలక విషయాలు, అంచనాలు ఈ సర్వేలో ఉన్నాయి.

అప్పటికల్లా ఏడాదికి కోటి యూనిట్ల సేల్స్

Economic Survey - Electric Vehicles: 2030 కల్లా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వార్షిక అమ్మకాలు కోటి యూనిట్లకు చేరతాయని ఎకానమిక్ సర్వే అంచనా వేసింది. అంటే 2030 కల్లా దేశంలో వార్షికంగా కోటి ఎలక్ట్రిక్ వాహనాలు సేల్ అవుతాయని పేర్కొంది. “2022 నుంచి 2030 మధ్య దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వార్షిక వృద్ధి రేటు (CAGR) 49 శాతంగా ఉంటుందని అంచనా” అని ఎకానమిక్ సర్వే పేర్కొంది.

5 కోట్ల మందికి ఉపాధి

Economic Survey on Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 2030 నాటికి 5 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఎకానమిక్ సర్వే పేర్కొంది. అంటే మరో ఏడేళ్లలో ఈవీ రంగంలో 5 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా వేసింది. ఈ రంగం అభివృద్ధికి, మద్దతు కోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా చర్యలు చేపట్టిందని వెల్లడించింది.

డిసెంబర్ 2022 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‍గా భారత్ అవతరించిందని ఎకానమిక్ సర్వే పేర్కొంది. వాహనాల అమ్మకాల్లో జపాన్, జర్మనీలను భారత్ అధిగమించిందని తెలిపింది.

Economic Survey on Electric Vehicles: ఫాస్టర్ అడాప్షన్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ II (FAME II) స్కీమ్ కింద ఆటో మొబైల్ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తోడ్పాటును అందిస్తోంది. సబ్సిడీలను ఇస్తోంది. ఫేమ్-2 కింద ఇప్పటి వరకు 7.1 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం ఇన్‍న్సెంటివ్‍లు ఇచ్చిందని ఎకానమిక్ సర్వే పేర్కొంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని ఎకానమిక్ సర్వే అంచనా వేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇది 7 శాతంగా ఉండగా.. వచ్చే ఏడాది అంచనాను 0.5 శాతం తగ్గించింది. రాజ్యసభలో ఎకానమిక్ సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టారు. రేపు (ఫిబ్రవరి 1) 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‍ను ఆమె పార్లమెంటులో ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం చేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం