Economic survey 2023 : 'వచ్చే ఆర్థిక ఏడాదిలో భారత్ జీడీపీ​ వృద్ధి 6.5శాతం'-economic survey 2023 pegs india s fy23 24 gdp growth at 6 6 8 percent ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Economic Survey 2023 : 'వచ్చే ఆర్థిక ఏడాదిలో భారత్ జీడీపీ​ వృద్ధి 6.5శాతం'

Economic survey 2023 : 'వచ్చే ఆర్థిక ఏడాదిలో భారత్ జీడీపీ​ వృద్ధి 6.5శాతం'

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 31, 2023 02:07 PM IST

Economic survey 2023 : రాజ్యసభలో ఎకనామిక్​ సర్వేను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. 2024 ఆర్థిక ఏడాదిలో భారత్​ జీడీపీ వృద్ధి 6.5శాతంగా ఉంటుందని ఎకనామిక్​ సర్వే అంచనా వేసింది.

పార్లమెంట్​లో ఎకనామిక్​ సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్​
పార్లమెంట్​లో ఎకనామిక్​ సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్​

Economic survey 2023 : 2023-24 ఆర్థిక ఏడాదిలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ 6.5శాతం వృద్ధి చెందుతుందని ఎకనామిక్​ సర్వే అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఉన్న అనిశ్చితుల కారణంగా.. వాస్తవ జీడీపీ లిమిట్​ని 6- 6.8శాతం మధ్యలో ఉంచుతున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కన్నా వచ్చే ఆర్థిక ఏడాదిలో జీడీపీ వృద్ధి నెమ్మదించినప్పటికీ.. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలోనే ఉందని పేర్కొంది.

ఎకనామిక్​ సర్వే..

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా.. ఎకనామిక్​ సర్వే 2023ని మంగళవారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఫిబ్రవరి 1న బడ్జెట్​ ఉండనున్న నేపథ్యంలో ఎకనామిక్​ సర్వేకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్​ ఎదుగుతోందని ప్రపంచంలోని వివిధ సంస్థలు చెబుతున్న మాటలను ఎకనామిక్​ సర్వే పునరుద్ఘాటించింది. కొవిడ్​-19, రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, వడ్డి రేట్ల పెంపు వంటి ప్రమాదకరమైన అంశాలు.. ఏడాది కాలంగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ.. భారత దేశం వృద్ధి చెందుతోందని స్పష్టం చేసింది.

"భారత్​ జీడీపీ వృద్ధి అంచనాలు.. వరల్డ్​ బ్యాంక్​, ఐఎంఎఫ్​, ఓడీబీ, ఆర్​బీఐ అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల బట్టి.. వాస్తవ జీడీపీ.. 6-6.8శాతం మధ్యలో ఉంటొచ్చు," అని ఎకనామిక్​ సర్వే స్పష్టం చేసింది.

భారత దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్​ ముందు స్థాయికి చేరుకుందని ఎకనామిక్​ సర్వే 2023 స్పష్టం చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్​ తన స్థానాన్ని పదిలం చేసుకుందని వివరించింది.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యంపై భయాలు నెలకొనడంతో.. ఇండియాలోకి నిధుల ప్రవాహం కొనసాగుతుందని ఎకనామిక్​ సర్వే అంచనా వేసింది. దేశంలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 6శాతం కన్నా తక్కువే ఉందని, అంతకన్నా ఎక్కువ ఉన్న సందర్భాల్లోనూ అది పెట్టుబడలు ప్రవాహాన్ని, ప్రైవేటు వినియోగాన్ని అడ్డుకోలేకపోయిందని పేర్కొంది.

దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి ప్రధాన కారణం.. ప్రభుత్వం మద్దతుతో పెరుగుతున్న పెట్టుబడులు, ప్రైవేటు కన్జమ్షన్​ అని ఎకనామిక్​ సర్వే 2023 వెల్లడించింది. అదే సమయంలో.. ప్రైవేటు రంగాల్లోను పెట్టుబడుల ప్రవాహం పెరగాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది. ఉద్యోగాలను సృష్టించే ప్రక్రియ మరింత వేగవంతం అవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది.

'ఆ నాలుగు ఉంటే.. మరింత వృద్ధి..!'

భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు నాలుగు అంశాలు కీలకంగా ఉన్నట్టు ఎకనామిక్​ సర్వే 2023 పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థపై కొవిడ్​ ప్రభావం తగ్గడం, ద్రవ్యోల్బణం కట్టడి, మాంద్యం పరిస్థితులు. ఈ మూడు మెరుగ్గా ఉంటే.. ప్రైవేటు రంగాల పెట్టుబడులు పెరగడం అనేది నాలుగో అంశంగా ఉంటుందని వివరించింది.

ఇండియా ఆర్థిక వ్యవస్థలో 'కే' షేప్​ రికవరీ కనిపిస్తోందని వస్తున్న నివేదికలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎకనామిక్​ సర్వే పేర్కొంది. "భారత దేశ వృద్ధి ప్రదర్శన.. పీఎల్​ఎఫ్​ఎస్​ (పీరియాడిక్​ లేబర్​ ఫోర్స్​ సర్వే)కు తగ్గట్టుగానే ఉంది. నిరుద్యోగం తగ్గుతోంది, లేబర్​ ఫోర్స్​ పెరుగుతోంది. ఈసీఎల్​జీఎస్​, ఎమ్​జీఎన్​ఆర్​ఈజీఎస్​ వంటి పథకాలు.. పేద కుటంబాలు, చిన్న సంస్థలకు ప్రయోజనం చేకూర్చాయి," అని ఎకనామిక్​ సర్వే 2023 వెల్లడించింది.

Whats_app_banner

సంబంధిత కథనం