IMF world economic outlook : ‘భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుంది.. కానీ’-imf upgrades its outlook for the global economy growth in 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Imf Upgrades Its Outlook For The Global Economy Growth In 2023

IMF world economic outlook : ‘భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుంది.. కానీ’

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 31, 2023 08:50 AM IST

IMF world economic outlook : వరల్డ్​ ఎకనామిక్​ ఔట్​లుక్​ జనవరి ఎడిషన్​ను విడుదల చేసింది ఐఎంఎఫ్​. ఇండియా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఇండియా వాటా ఎక్కువే!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఇండియా వాటా ఎక్కువే! (AFP)

IMF world economic outlook : వచ్చే ఆర్థిక ఏడాదిలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కాస్త నెమ్మదిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) అంచనా వేసింది. ఈ మార్చ్​తో ముగిసే ఆర్థిక ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ 6.8శాతంగా ఉంటుందని పేర్కొన్న ఐఎంఎఫ్​.. ఆ తర్వాతి ఏడాది 6.1శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది.

ట్రెండింగ్ వార్తలు

వరల్డ్​ ఎకనామిక్​ ఔట్​లుక్​కు సంబంధించిన జనవరి ఎడిషన్​ను మంగళవారం విడుదల చేసింది ఐఎంఎఫ్​. ప్రపంచ ఆర్థిక వృద్ధి.. ప్రస్తుతం 3.4 శాతంగా ఉంటుందని, 2023లో 2.9శాతానికి పడుతుందని వివరించింది. 2024 మళ్లీ పుంజుకుని.. 3.1శాతానికి చేరుతుందని అభిప్రాయపడింది.

'భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుంది..'

Indian economy IMF : అయితే.. అంతర్జాతీయ పరిణామాల కారణంగానే భారత దేశ వృద్ధి నెమ్మదిస్తుందని ఐఎంఎఫ్​ పేర్కొంది.

"భారత దేశ వృద్ధికి సంబంధించి.. అక్టోబర్​ ఔట్​లుక్​లో చెప్పిందే.. ఇప్పుడూ చెబుతున్నాము. ఈ ఆర్థిక ఏడాదిలో భారత దేశ వృద్ధి 6.8శాతంగా ఉంటుంది. ఆ వచ్చే ఆర్థిక ఏడాదిలో 6.1శాతానికి పడుతుంది. ఇందుకు అంతర్జాతీయ పరిస్థితులే కారణం. 2024లో 6.8శాతానికి మళ్లీ చేరుతుంగి," అని ఐఎంఎఫ్​ స్పష్టం చేసింది.

‘అత్యంత ఆకర్షణీయంగా.. భారత్​’

IMF Economy outlook India : ఈ క్రమంలో.. అభివృద్ధి విషయంలో భారత దేశం అత్యంత ఆకర్షణీయంగా ఉందని ఐఎంఎఫ్​​ రీసెర్చ్​ డెవల్​పమెంట్​ విభాగానికి చెందిన గౌరిన్​చాస్​ తెలిపారు.

"ఇండియా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. 2023 ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగ భాగం ఇండియా, చైనాలదే ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయం. అమెరికా, యూరోప్​ ప్రాంతాలకు అది 10శాతంగానే ఉంటుంది." అని గౌరిన్​చాస్​ స్పష్టం చేశారు.

India economy 2023 : ఐఎంఎఫ్​ నివేదిక ప్రకారం.. ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధి.. 2023లో 5.2శాతంగా ఉంటుందని, 2024లో 5.2శాతానికి చేరుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణించడం కారణంగా.. 2022లో అది 4.3శాతానికి పడింది.

అభివృద్ధి చెందిన దేశాలకు కష్టమే..!

అయితే.. అభివద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వృద్ధి చాలా నెమ్మదిస్తుందని ఐఎంఎఫ్​ పేర్కొంది. గతేడాది 2.7శాతానికి పడిన వృద్ధి.. ఈ ఏడాదిలో 1.2శాతానికి చేరుతుందని, వచ్చే ఏడాది 1.4శాతానికి పెరుగుతుందని వివరించింది. అభివృద్ధి చెందిన 10 దేశాల్లోని 9 చోట్ల.. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందని అంచనా వేసింది.

World economy outlook : ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు కారణంగా.. అమెరికా ఆర్థిక వృద్ధి.. 2023లో 1.4శాతానికి నెమ్మదిస్తుందని ఐఎంఎఫ్​ తెలిపింది. యూరోప్​ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని అభిప్రాయపడింది.

WhatsApp channel

సంబంధిత కథనం