Indian economy : మాంద్యం భయాలు వెంటాడుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ ‘తగ్గేదే లే!’
Indian economy : ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత దేశం నిలుస్తుందని ఆర్బీఐ చెబుతోంది. మాంద్యం భయాలు ఉన్నా.. వాటిని తట్టుకునే శక్తి ఆర్థిక వ్యవస్థకు ఉందని స్పష్టం చేసింది.
Indian economy : మాంద్యం భయాలు ఉన్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కుంటుందని ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే.. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని పేర్కొంది.
ఆర్బీఐ నెలవారీ బులిటెన్ ప్రకారం.. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ పోరాడుతోంది. ఈశాన్య రుతుపవనాల జోరుతో వ్యవసాయ రంగం సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టణ వ్యయాన్ని గ్రామీణ డిమాండ్ త్వరలోనే అందుకునే అవకాశం ఉంది. ఫలితంగ రికవరీ మరింత మెరుగుపడుతుంది. దేశీయంగా ద్రవ్యోల్బణం దిగొస్తుండటం కూడా మంచి పరిణామం.
జులై 12న.. ఎన్ఎస్ఓ విడుదల చేసిన డేటా ప్రకారం.. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01శాతంగా నిలిచింది. కాగా.. ఇటీవలే ద్రవ్యోల్బణం పీక్ స్టేజ్‌ను అందుకుని, అక్కడి నుంచి దిగొస్తున్నట్టు ఆర్బీఐ భావిస్తోంది. ధరలు తగ్గుతుండటం ఇందుకు ఉదాహరణ అని అంటోంది. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్యోల్బణం నుంచి భారత దేశం తప్పించుకోగలుగుతోందని చెబుతోంది.
సంబంధిత కథనం