Vastu Tips For Home । కొత్త సంవత్సరంలో ఇంటికి ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే, మీ అంతా శుభకరం!
29 December 2022, 23:15 IST
- New Year 2023 Vastu Tips For Home: ఈ కొత్త సంవత్సరంలో మీ ఇంటికి లక్ష్మీ దేవికి ఆహ్వానం పలకండి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ వాస్తు నియమాలను పాటిస్తే మీకు అంతా శుభం
Vastu Tips For Home:
కొత్త సంవత్సరం 2023 ప్రారంభంలో ఉంది. గడిచిన కాలం గురించి చింతించకుండా ఈ కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని ఆశతో జీవిద్దాం. అయితే మీ ఇంటికి ఏవైనా వాస్తు దోషాలు ఉంటే ఈ కొత్త ఏడాదిలో సరిచేసుకోండి. వాస్తు ఫలితాలు ఇంట్లో ఉండే సానుకూల, ప్రతికూల శక్తిపై ఆధారపడి ఉంటుంది. సానుకూల శక్తి ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది, ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే అది మీ జీవితంలో అనేక సమస్యలను తెస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారంగా ఇంటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేని, సంతోషకరమైన జీవితానికి ఆహ్వానం పలకాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద వాస్తు దోషాలను సరిచేసి, సానుకూల శక్తి ప్రవాహానికి అవకాశం ఇవ్వాలి. అందుకోసం ఏమేమి చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
New Year 2023 Vastu Tips For Home- కొత్త సంవత్సరంలో ఇంటికి వాస్తు చిట్కాలు
ఈ కొత్త సంవత్సరంలో మీ ఇంటికి లక్ష్మీ దేవికి ఆహ్వానం పలకండి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ వస్తువులను ఉంచండి.
స్వస్తిక్ గుర్తు
మీ ఇంటి మెయిన్ డోర్ పై స్వస్తిక్ గుర్తు ఏర్పాటు చేయండి. లేదా ప్రధాన ద్వారం గడప మీదా కూడా ఈ చిహ్నం ఉంచవచ్చు, గడప పచ్చగా ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున శుభం గుర్తు పెట్టుకోవడం వల్ల ఆ ఇంటి సభ్యులు లాభాలను పొందుతారు. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తగ్గి ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఇంటి ముందు ప్రతిరోజూ శుభ్రం చేసి, అందమైన ముగ్గులు వేయడం మరుచిపోవద్దు.
తులసి కోట
సనాతన ధర్మంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. తులసి మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. తులసిని లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం ముందు తులసి మొక్కను నాటడం వల్ల ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
పచ్చని తోరణం
ఇంట్లో శుభకార్యం జరిగేటపుడు మామిడి ఆకులతో పచ్చని తోరణాలు కట్టడం మీకు తెలిసిందే. అయితే మామిడి తోరణాలు కొద్దికాలం వరకు నిలిచి ఉంటాయి, ఎప్పుడూ నిలిచి ఉండేలా ఇంటి మెయిన్ డోర్ కు బంధన్ తోరణం కట్టుకోవచ్చు. తోరణాలు ఇంటికి అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. తోరణం ఉండటం శుభ సూచకం.
ఆదిత్య యంత్రం
సూర్య యంత్రాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచినట్లయితే, అది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ ఇల్లు ఎల్లప్పుడూ ధనధాన్యాలతో వర్ధిల్లుతుంది.
ద్వారం చుట్టూ పచ్చదనం
ఇంటి ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి, శుక్ర భగవానుని ప్రసన్నం చేసుకోవడం అవసరం. ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా పచ్చని ఆకులు, సువాసన పూల కుండీలను నాటండి. వాటికి ప్రతిరోజూ నీరు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదలకు కొదువే ఉండదు.
టాపిక్