Tulasi Plant Vastu Shastra Tips : తులసికోట దగ్గర శివలింగాన్ని ఉంచకూడదట.. కారణం ఇదే..-tulasi plant vastu shastra tips don t keep these 5 things with tulasi plant here is the reasons ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Tulasi Plant Vastu Shastra Tips Don't Keep These 5 Things With Tulasi Plant Here Is The Reasons

Tulasi Plant Vastu Shastra Tips : తులసికోట దగ్గర శివలింగాన్ని ఉంచకూడదట.. కారణం ఇదే..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 13, 2022 08:45 AM IST

Vastu for Tulasi : తులసిని చాలా పవిత్రమైనదిగా చూస్తాము. పురణాలు కూడా పూజలో తులసికి ప్రత్యేక పాత్రనిచ్చాయి. అయితే ఈ తులసి కోట దగ్గర్లో కొన్ని వస్తువులు ఉంచకూడదని.. అలా చేస్తే.. ఆర్థిక, ఇతర సమస్యలు వస్తాయని వాస్తుశాస్త్రం చెప్తుంది.

తులసి దగ్గర వీటిని ఉంచకండి
తులసి దగ్గర వీటిని ఉంచకండి

Vastu Tips : హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని.. అందుకే ఉపవాసాలు, పండుగలు, శుభకార్యాల్లో తులసిని పూజించి.. తులసి గుత్తిని దేవతలకు సమర్పిస్తారని చెబుతారు. అంతేకాదు తులసి ఆరాధన చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. అయితే తులసి మొక్క దగ్గర కొన్ని వస్తువులు పెడితే.. సుఖసంతోషాలు ఉండవని.. ఆర్థికంగా నష్టపోతారని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇంతకీ తులసి కోట దగ్గర ఏమి పెట్టాలి.. ఏమి ఉంచకూడదో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఉంచకూడదు.

శివలింగం

తులసి దగ్గర పొరపాటున కూడా శివలింగాన్ని ఉంచకూడదంటారు. ఎందుకంటే పురాణాల ప్రకారం.. తులసికి పూర్వ జన్మలో ఉన్న పేరు వృందా. ఆమె శక్తివంతమైన అసుర జలంధరుని భార్య. జలంధరుడు తన శక్తుల గురించి చాలా గర్వపడేవాడు. అతను చేసే కార్యాలకు ఫలంగా శివుడు.. జలంధరుని చంపాల్సి వస్తుంది. ఈ కారణంగా శివలింగాన్ని తులసికి దూరంగా ఉంచాలని చెప్తారు.

బూట్లు, చెప్పులు

వాస్తు ప్రకారం.. తులసి మొక్క దగ్గర బూట్లు లేదా చెప్పులు ఎప్పుడూ ఉంచకూడదు. ఇది తులసితో పాటు తల్లి లక్ష్మిని కూడా అవమానించినట్లేనని వాస్తు చెప్తుంది. మీరు చేసే ఈ ఒక్క తప్పుతో ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మి దేవికి కోపం వస్తుందని చెప్తారు. అందుకే తులసి మొక్క దగ్గర ఎప్పుడూ శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అంటారు.

చీపురు

తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే తులసికి నిత్య పూజలు చాలా ఫలప్రదం. అందుకే తులసి దగ్గర చీపురు పెట్టుకోకూడదని అంటారు. ఇది లక్ష్మీదేవిని, విష్ణువును అవమానిస్తుంది. తులసి దగ్గర చీపురు పెట్టుడం వల్ల పేదరికం కూడా వస్తుందని చెప్తారు. మీరు తులసి దగ్గర చీపురు పెడితే.. ఆ తప్పును ఈరోజే సరిదిద్దుకోండి.

ముళ్ల మొక్కలు

తులసి మొక్కను ఎప్పుడూ ముళ్ల మొక్కలతో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి. అందుకే గులాబీ, కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను తులసికి దూరంగా ఉంచడం మంచిది. లేదంటే ఇంటి సభ్యుల మధ్య విభేదాలు, తగాదాలు, టెన్షన్‌లు పెరిగే అవకాశం ఉంది.

డస్ట్‌బిన్

తులసి మొక్క చాలా పవిత్రమైనది. కాబట్టి దాని చుట్టూ పరిశుభ్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తులసి కుండి దగ్గర ఎప్పుడూ డస్ట్‌బిన్‌ను ఉంచకూడదు. దీని వల్ల ఇంట్లో ప్రతికూలత, పేదరికం వ్యాపిస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్