Tulasi Puja Rituals : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తులసి మొక్క వాడిపోతుందా? అయితే కారణం అదే..
Tulasi Puja Benefits : హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే మొక్కలలో తులసి ఒక్కటి. చాలా మంది తమ ఇంటి ముందు తులసిని పెట్టి పూజిస్తారు. శుభానికి ప్రతీకగా భావించే దీనిని పలు పూజల్లో ఉపయోగిస్తారు. అయితే ఒక్కోసారి ఎంత శ్రద్ధ తీసుకున్నా.. ఈ మొక్క వాడిపోతూ ఉంటుంది. అలా వాడిపోవడం వెనుక ఓ పెద్ద కారణం ఉంది అంటున్నారు.
Tulasi Puja Benefits : మతపరంగా తులసి మొక్కకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. పేదరికం, అశాంతి, అసమ్మతి వాతావరణం ఉన్న ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ నివసించదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. బుధ గ్రహం కారణంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే మెర్క్యురీ రంగు ఆకుపచ్చగా ఉంటుంది. ఇది చెట్లు మరియు మొక్కలకు కారకంగా కూడా పరిగణిస్తారు. ఎక్కడ మంచి ప్రభావం ఉంటుందో అక్కడ చెట్లు, మొక్కలు బాగా పెరుగుతాయి అంటారు. అలాగే చెడు ప్రభావం ఉన్న చోట్ల అవి ఎండిపోతాయని చెప్తారు. తులసి ఎదుగుదలను లేదా వాడిపోవడాన్ని కూడా అలాగే పరిగణిస్తారు.
ఇంట్లో పచ్చని తులసి మొక్కలను శుభానికి ప్రతీకగా చెప్తారు. అంతేకాకుండా తులసి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ చాలా సార్లు తులసి ఎటువంటి కారణం లేకుండా వాడిపోతూ ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం దాని వెనుక పెద్ద సంకేతం ఉందని చెప్తున్నారు. అయితే ఇంట్లో తులసి ఉండడం వల్ల, తులసి పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
తులసి పూజ ప్రయోజనాలు
* తులసి పూజ చేయడం వల్ల చెడు ఆలోచనలు నశిస్తాయి.
* తులసి మొక్క దగ్గర ఏదైనా మంత్ర-స్తోత్రం చదవడం వల్ల అనంతమైన ఫలాలు లభిస్తాయని నమ్ముతారు.
* దయ్యాలు, భూతాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసులు, రాక్షసులు మొదలైనవన్నీ తులసి మొక్కకు దూరంగా ఉంటాయని నమ్ముతారు.
* తులసి పూజ చేయడం వల్ల చెడు ఆలోచనలు నశిస్తాయి. పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందని భావిస్తారు.
* పద్మపురాణం ప్రకారం.. ఒక వ్యక్తి తన తలపై తులసి ఆకుల నుంచి కారుతున్న నీటిని పోస్తే.. ఆ వ్యక్తికి గంగాస్నానం, 10 గోదాన ఫలం లభిస్తుంది.
* తులసిని పూజించడం వల్ల రోగాలు నశించి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
* తులసి పూజ, తులసి మొక్క, తులసి ధరించడం వల్ల పాపాలు నశిస్తాయి.
* తులసి పూజ స్వర్గానికి, మోక్షానికి తలుపులు తెరుస్తుంది.
* తులసి ఆకు కూడా శ్రాద్ధం, యాగం మొదలైన వాటిలో గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది.
* తులసి నామాన్ని జపించినా పుణ్యాలు లభిస్తాయి అంటారు. మనిషి చేసి పాపాలన్నీ నశిస్తాయని చెప్తారు.
అయితే ఒక్కోసారి ఏ కారణం లేకుండా తులసి వాడిపోతూ ఉంటుంది. ఎంత నీరు పోసినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మొక్కసారిగా వాడిపోతూ ఉంటుంది. అయితే ఇలా తులసి మొక్క వాడిపోతే.. కుటుంబంలో ఒక రకమైన సంక్షోభం వస్తుందని అంటారు. కుటుంబంలో ఏదైనా సంక్షోభం ఏర్పడితే.. ముందుగా లక్ష్మి అంటే.. తులసి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుందని చెప్తారు. తద్వారా అక్కడ పేదరికం వస్తుందని పలు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్