Tulasi Puja in Karthika Masam : క్షీరాబ్ధి ద్వాదశి రోజు తులసి పూజ ఎందుకు చేయాలి?-karthika masam tulasi puja significance and history in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tulasi Puja In Karthika Masam : క్షీరాబ్ధి ద్వాదశి రోజు తులసి పూజ ఎందుకు చేయాలి?

Tulasi Puja in Karthika Masam : క్షీరాబ్ధి ద్వాదశి రోజు తులసి పూజ ఎందుకు చేయాలి?

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 05, 2022 11:46 AM IST

Tulasi Puja in Karthika Masam : కార్తీకమాసంలో క్షీరాబ్ధి ద్వాదశికి ఓ ప్రత్యేకత ఉంది. అయితే ఈరోజు కచ్చితంగా తులసికి పూజల చేయాలని అంటున్నారు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. తులిసి పూజ ఈరోజు ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి పూజా
తులసి పూజా

Tulasi Puja in Karthika Masam : తులసి పూజ మనము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్ష నాడు జరుపుకుంటారని పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ రోజున తులసికి వివాహం జరిపిస్తారు. ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు? ఎవరితో వివాహం జరిపిస్తారు? ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారో ఈ కథలో తెలుసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం..

హిందూ పురాణాలలో తులసి దేవిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు. ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. శివుడి మూడో కన్ను నుంచి వచ్చిన అగ్నిలో నుంచి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. జలంధరునికి దేవుళ్లంటే అసహ్యం. కానీ దేవుళ్లను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె మహావిష్ణువుకు మహాభక్తురాలు. ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి, పవిత్రత వల్ల జలంధరుడికి మరింత శక్తి పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వంతో శివుడినే ఓడించి ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని జలంధరుడు కలలు కంటాడు.

ఈ సమయంలో దేవుళ్లందరూ విష్ణుమూర్తి సహాయం కోరతారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధరుడి వల్ల జరిగే నష్టం గుర్తించిన విష్ణువు ఓ మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు. పరమ శివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా.. జలంధరుని రూపంలో విష్ణువు.. వృంద వద్దకు వెళ్తాడు. ఆమె విష్ణువుని గుర్తు పట్టలేక అతడే జలంధర్ అని భావిస్తుంది. జలంధరుని రూపంలో ఉన్న విష్ణువు ఆమెను తాకగానే.. అతను తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రత నిష్ట భగ్నం అవుతుంది. వెంటనే జలంధరుడు బలహీనుడు అవుతాడు. అంతలోనే నిజం తెలుసుకున్న ఆమె.. మహావిష్ణువు నిజ రూపాన్ని కోరుతుంది.

మహావిష్ణువుకు వృంద శాపం

ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలుసుకుని బాధపడుతుంది. శ్రీ మహావిష్ణువు మారు రూపం తెలుసుకుని.. తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువుని రాయిలా మారిపోమని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. దీంతో ఆమె బాధపడుతూ, తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది.

లక్ష్మీదేవి విజ్ఞప్తి

మహా విష్ణువు భార్య లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో తన మాటలను వెనక్కి తీసుకొని శాపం ప్రభావాన్ని ఆపమని కోరుతుంది. అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే విష్ణువు సాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ శాపం అంతమవుతుందని చెబుతుంది. దీని తర్వాత ఆమె సతిగా మారుతుంది. (ప్రాచీన కాలంలో హిందూ వితంతువులు చేసిన స్వీయ - ప్రేరణ చర్య). ఆమె దేహం పూర్తిగా కాలిపోయిన తర్వాత.. ఆమె బూడిద నుంచి తులసి మొక్క పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి.

తులసి పూజా విధానం

తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకుని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోండి. మండపం చుట్టూ ఎర్రటి చీరను కట్టండి. లేదంటే తులసి మొక్కను నేరుగా ఎర్రటి వస్త్రంతో చుట్టవచ్చు. ఆ తర్వాత తులసి కొమ్మలకు ఎర్రటి గాజులు వేసి అలంకరించండి. విఘ్నేశ్వరుడు, ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయండి. అప్పుడు సాలిగ్రాముని కూడా ఆరాధించండి. తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ, చక్కెర బొమ్మలు, ఐదు రకాల పండ్లను ఉంచండి. అనంతరం హారతి ఇచ్చి తులసి, సాలిగ్రామని జపిస్తూ ప్రార్థించండి.

పండుగ ప్రాముఖ్యత

తులసికి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ వివాహ సంబంధిత సమ్యలను తొలగిస్తుందని చెబుతారు.

ద్వాదశ దీపాలు

క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో తులసి మొక్క దగ్గర ధాత్రి (ఉసిరి మొక్కను) ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. అలాగే 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇంటా దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతాయి. తులసి మొక్కను గౌరీదేవిగా.. ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజించి గౌరీ పూజ చేస్తారు. ఇలా చేస్తే ఆర్థిక బాధలు తొలగి.. సర్వ సంపదలు కలుగుతాయి అంటారు. కార్తీక మాసంలో ఉసిరి, తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం