Tulsi Tea Benefits: తులసి టీ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా!-drink tulsi tea every day for these amazing health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tulsi Tea Benefits: తులసి టీ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

Tulsi Tea Benefits: తులసి టీ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

HT Telugu Desk HT Telugu
Jun 17, 2022 09:51 PM IST

ప్రతి రోజు తులసి టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు వారి దినచర్యలో భాగంగా తులసి టీని తీసుకుంటే, ఒత్తిడి తగ్గడంతో శరీరం ఫిట్‌గా మారుతుంది

<p>Tulsi Tea Benefits</p>
Tulsi Tea Benefits

Tulsi Tea Benefits: తులసి ఆధ్యాత్మికంగానే కాకుండా, ఔషధీ పరంగానూ చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసి మెుక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సాధరణంగా తులసి అకులను తినడం అరోగ్యానికి మంచిదని చాలా మంది భావిస్తుంటారు. కానీ అకుల ద్వారానే కాకుండా తులసి టీ తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ టీ తాగడం వల్ల యాంటీవైరస్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు వాటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. కావున రోజు తులసి టీ తాగడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

జీర్ణవ్యవస్థను బలోపేతం చెస్తోంది

జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో తులసి టీ ఎంతో మేలు చేస్తుంది. నేటి కాలంలో అదుపు తప్పిన జీవనశైలి కారణంగా చాలా మంది జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తులసి టీ తీసుకోవడం వల్ల విసర్జన ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా గ్యాస్ సమస్య, విరేచనాలు, కడుపులో తిమ్మిర్లు, మలబద్ధకం వంటిసమస్యల నుంచి బయటపడవచ్చు. .

మంచి నిద్ర కోసం తులసి టీ తాగండి

మంచి నిద్ర కోసం తులసి టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సమయ పాలన లేని దినచర్య కారణంగా చాలా మంది ఒత్తిడితో నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో, మంచి నిద్ర కోసం తులసి టీ తాగవచ్చు. ఓవరాల్‌గా మిగతా టీల కంటే తులసి టీ తాగితే కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.

 

Whats_app_banner

సంబంధిత కథనం