Vastu Tips : ఈ చిన్న విషయాలు పట్టించుకుంటే.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుందట..-vastu tips these 5 mistakes in the house can cause heavy loss here is the remedies in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Vastu Tips These 5 Mistakes In The House Can Cause Heavy Loss Here Is The Remedies In Telugu

Vastu Tips : ఈ చిన్న విషయాలు పట్టించుకుంటే.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుందట..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 09, 2022 09:00 AM IST

Vastu Tips : ఇంట్లోని కొన్ని చిన్న చిన్న సమస్యలే.. పెద్ద నష్టాలు కలిగిస్తాయి అంటుంది వాస్తు శాస్త్రం. ఈరోజే వాటిని క్లియర్ చేసుకోవడం వల్ల పలు ఆర్థిక నష్టాలు.. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.

వాస్తు టిప్స్
వాస్తు టిప్స్

Vaastu Tips : మనకి తెలియకుండానే ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. చిన్నవే కదా అని వాటిని మనం పట్టించుకోము. దీనివల్ల జీవితంలో పెద్ద సమస్యలు వచ్చే అవకాశమున్నాయని.. కొన్ని వస్తువులు వాస్తుకు విరుద్ధంగా ఉంటే అవి చాలా అశుభమని చెప్తారు. వాస్తు విషయాలు కొందరు పట్టించుకోరు కానీ.. వాటి ప్రభావం చాలా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అయితే కొన్ని విషయాల పట్ల శ్రద్ధ తీసుకుంటే.. ఇంట్లోని సమస్యలు క్రమంగా తగ్గుతాయి అంటున్నారు. అయితే ఇంట్లో ఉండే వాస్తు సమస్యలు ఏమిటో.. వాటి పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

ఇంటి ప్రధాన ద్వారం

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన తలుపును చీకటిగా ఉంచడం అశుభం. అంటే ప్రధాన ద్వారం రంగు సరిగ్గా లేకుంటే అది చాలా చెడ్డదిగా పరిగణిస్తారు. ప్రధాన ద్వారం ఆకర్షణీయంగా లేకుంటే అది కూడా తప్పుగా పరిగణిస్తారు. ఇంటి మెయిన్ డోర్‌లో అపసవ్యం ఏర్పడితే ఆ ఇంట్లోని వారి జీవితంలో విజయావకాశాలు తగ్గుతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది.

నివారణ - ప్రధాన తలుపును ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. లైట్లు వేసి ఉంచండి. ఇంటి తలుపునకు మంచి రంగు వేయండి.

ఇంట్లోని చిత్రాలు

చాలామంది ఇంట్లో చిత్రాలు అమర్చుకుంటారు. అయితే అవి విరిగిన లేదా మురికిగా ఉంటే.. వాస్తు ప్రకారం అది చాలా అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఇంటి చిత్రాలపై దుమ్ము పేరుకుపోవడం కూడా సరైనది కాదు. దీనివల్ల సంబంధాలు చెడిపోతాయి అంటారు.

నివారణ- ఇంట్లోని చిత్రాలను ఎల్లప్పుడూ చక్కగా, శుభ్రంగా ఉంచండి. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.

గందరగోళంగా వస్తువులు

కొందరు ఇంట్లో బట్టలు, బూట్లు ఎక్కడపడితే అక్కడ విసిరేస్తూ ఉంటారు. బూట్లు, బట్టలు చిందరవందరగా ఉంచడం వల్ల డబ్బు వృథా అవుతుంది. ఇది కెరీర్‌లో ఎత్తుపల్లాలు కలిగిస్తుందని చెప్తుంది వాస్తు శాస్త్రం.

పరిహారం- ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే.. కెరీర్ అంత క్రమబద్ధంగా సాగుతుంది.

నీటి వృథా..

ఇంట్లో నీరు వృథా కావడం, ఇంటి కుళాయిల నుంచి అనవసరంగా నీరు రావడం, అవసరానికి మించి నీరు వాడడం తప్పుగా పరిగణిస్తారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కొనసాగుతాయని, మానసిక బలహీనత ఉంటుందని అంటున్నారు.

పరిహారం- ఇంట్లో నీటిని సక్రమంగా ఉపయోగించడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఉపయోగించని వస్తువులు

ఇంట్లో పాత బట్టలు, ఉపయోగించని బూట్లు ఉంటే.. అది అంత మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తుంది. పాత, పనికిరాని వస్తువులను ఇంట్లో నిల్వ ఉంచితే.. పరిస్థితి మరింత దిగజారుతుంది.

నివారణ - ఇంట్లో అనవసరమైన వస్తువులను తీసేయండి. అప్పుడు ఇంటి వాస్తు సరిగ్గా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్