Vastu Tips | ఇంట్లో, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయా.. ఈ వాస్తు పరిహారం పాటించండి!
Water Fountain for Home Vastu: ఇంట్లో కలహాలు, వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు, పురోగతి లేకపోవడం, ధన నష్టం వంటివి ఉంటే ఇంట్లో వాటర్ ఫౌంటెన్ అమర్చుకోవాలని వాస్తు నిపుణులు పేర్కొన్నారు, అయితే కొన్ని జాగ్రత్తలు అవసరం.
Water Fountain for Home Vastu: ప్రతి వ్యక్తి ఆనందం, శాంతి, ప్రశాంతతతో జీవించాలని కోరుకుంటాడు. డబ్బుంటే సంతోషం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఎంత ధనవంతులైనా, వారికి కూడా ఎప్పుడూ ఏదో ఒక లోటు ఉంటుంది. ఇక మధ్య తరగతి వారికి, ఆ కింద ఉన్నవారికి కూడా వారి వారి స్థాయిలలో కష్టాలు అనేవి ఉంటాయి. ఏదేమైనా డబ్బుతో విలాసవంతంగా బ్రతకవచ్చు, కానీ ఆనందాన్ని కొనలేరనేది కాదనలేని వాస్తవం. సంబంధ బాంధవ్యాలలో చీలికలు రావడం, జీవితంలో శాంతి లేకపోవడం వంటివి డబ్బు పరిష్కరించలేదు.
అయితే ఈ కష్టాలన్నింటికీ కారణం, కొన్ని సార్లు ఇంటికి వాస్తు లేకపోవడం వల్ల జరుగుతుండవచ్చునని చాలామంది బలంగా నమ్ముతారు. మీరూ ఈ జాబితాలో ఉంటే కొన్ని వాస్తు పరిహారాలు ఇక్కడ అందజేసస్తున్నాం, ఒకసారి ఈ పరిహారాలు ప్రయత్నించి చూడండి.
మనం ఇంట్లో అనేక రకాల అలకంకరణ వస్తువులను తెచ్చుకుంటాం. ఇందులో కృత్రిమ ఫౌంటెన్ కూడా ఒకటి. ఇది ఉండటం వలన ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ వాస్తుపరంగా, ఫౌంటెన్‌ను ఇంటికి నిర్దిష్ట దిశలో ఉంచకపోతే జీవితంలో ధన నష్టం, అశాంతి ఉండవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు.
ఇంట్లో వాటర్ ఫౌంటెన్ ఏ దిశలో ఉంచుకోవాలి?
కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతినడం లేదా మీరు వృత్తి, ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఇంట్లో నీటి ఫౌంటెన్‌ను ఏర్పాటు చేసుకోవడం వాస్తు పరంగా సరైనదే. కానీ దానిని సరైన స్థానంలో ఉంచడం వలన మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
వాటర్ నీటి ఫౌంటెన్‌ను ఇంటి కారిడార్ లేదా బాల్కనీలో ఉంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీంతో సంపద కూడా పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగ సమస్యలు తీరే అవకాశం ఉంది.
ఇంట్లో గార్డెన్ ఉంటే అక్కడ కూడా ఫౌంటెన్ నిర్మించడం మంచిది. కానీ నీటి ప్రవాహం ఎప్పుడూ ఇంటి వైపు ఉండాలి. ఇల్లు వెలుపల వైపు దిశలో నీరు ప్రవహిస్తే, అది మీ డబ్బు, సంపదలను కోల్పోయే అవకాశాన్ని పెంచుతుందని చెబుతారు. ఇంట్లో ఫౌంటెన్‌ని ఇంటికి ఉత్తరం లేదా ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఈ దిశలో వాటర్ ఫౌంటెన్ ఉంచడం వల్ల కెరీర్ లో పురోగతి, కుటుంబంలో ఆనందం లభిస్తుందని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఏదైనా పనిలో విజయం సాధించకపోతే లేదా పనిభారం పెరుగుతున్నట్లయితే లేదా మీరు పనులలో విఫలమవుతున్నట్లయితే, ఇంట్లో కృత్రిమ నీటి ఫౌంటెన్‌ను ఏర్పాటు చేసుకోవడం గొప్ప పరిష్కారం. చిన్నదైనా పర్వాలేదు. ఈశాన్య దిశలో ఒక మట్టి పాత్ర లేదా కూజాలో నీటి ఫౌంటెన్ ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దురదృష్టాలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే అన్ని పనుల్లో విజయం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా మత విశ్వాసాల ప్రకారం జాబితా చేసినది. ఈ పరిహారాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
సంబంధిత కథనం
టాపిక్