Vastu Tips for Married Life । పడకగదిలో ఈ వాస్తు నియమాలు పాటిస్తే.. వైవాహిక జీవితం మధురం!-follow these simple vastu tips for a happy married life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips For Married Life । పడకగదిలో ఈ వాస్తు నియమాలు పాటిస్తే.. వైవాహిక జీవితం మధురం!

Vastu Tips for Married Life । పడకగదిలో ఈ వాస్తు నియమాలు పాటిస్తే.. వైవాహిక జీవితం మధురం!

HT Telugu Desk HT Telugu
Dec 20, 2022 07:39 PM IST

Vastu Tips for Happy Married Life: వైవాహిక జీవితం గందరగోళంగా ఉంటే కొన్ని వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా మళ్లీ ఆనందం నింపవచ్చు. ఆ చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.

Vastu Tips for Happy Married Life:
Vastu Tips for Happy Married Life: (Unsplash)

ప్రతీ వ్యక్తి తన జీవితంలో తనను బాగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి రావాలని కోరుకుంటారు. తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని భార్యాభర్తలు ఇరువురు కోరుకుంటారు. అయితే భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా, అప్పుడప్పుడు చిన్నచిన్న వారి మధ్య గొడవలు జరగటం సహజమే. ఎంత గొడవపడినా మళ్లీ కలిసిపోతే ఆ ఇల్లు ప్రశాంతంగా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది. అలాకాకుండా భార్యభర్తలు ఇద్దరూ తరచూ గొడవపడుతుంటం, ప్రతీ చిన్న విషయానికి వారి మధ్య మనస్ఫర్ధలు రావడం మొదలైతే అంతకుమించిన నరకం మరొకటి ఉండదు. ఈ గొడవలు ప్రతిరోజూ జరుగుతాయి, కుటుంబంలో అసమ్మతికి కారణం అవుతాయి. జీవితంలో ప్రశాంతత అనేది కరువవుతుంది. ఇంట్లో ఉండాలనిపించదు, ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఉండటం కష్టంగా ఉంటుంది.

అయితే వాస్తు శాస్త్రంలో ఇందుకు కొన్ని పరిహారాలు ఉన్నాయి. కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో ఒత్తిడి లేని, సామరస్య వాతావరణాన్ని సృష్టించడం సాధ్యపడవచ్చు. ఎన్ని గొడవలు ఉన్నా భార్యాభర్తలను కలిపేది పడకగది. ఈ పడక గదిని, అందులోని వస్తువులను వాస్తు ప్రకారం అమర్చుకుంటే భార్యభర్తల మధ్య గొడవలు తగ్గి, పరస్పరం ప్రేమను పొందడానికి అవకాశం లభించవచ్చు.

Vastu Tips for Happy Married Life - ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం వాస్తు చిట్కాలు

  1. వైవాహిక జీవితం ఆనందంగా సాగటానికి వాస్తు నిపుణులు అందించిన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
  2. పడకగదిలో కిటికీని ఉంచడం చాలా ముఖ్యం, దీని ద్వారా ఇంటి లోపల కొత్త శక్తి ప్రవేశిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో కిటికీ ఉంటే భార్యాభర్తల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో, పరస్పర వివాదాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
  3. పడకగదిలో పూలజాడీ ఉంచవచ్చు, అయితే అందులో ముళ్ల పూలను ఎప్పుడూ నాటకూడదు. ముళ్ళ పువ్వులు సంబంధాలలో ఉద్రిక్తతను సృష్టిస్తాయి.
  4. వాస్తు ప్రకారం, పడకగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచడం వల్ల గదిలో ఉండే సానుకూల శక్తిని తగ్గిస్తుంది, ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను మీ పడకగదిలో ఉంచుకోకండి. వీలైతే మీరు నిద్రపోయేటపుడు మీ మొబైల్ ఫోన్లను కూడా దూరంగా వేరే గదిలో ఉంచండి.
  5. రాధాకృష్ణులు ప్రేమకు చిహ్నం వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో రాధాకృష్ణుల చిత్రపటాన్ని అమర్చుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది, ప్రేమ వికసిస్తుంది. ఈశాన్య దిశలో రాధా-కృష్ణుల చిత్రాన్ని ఉంచడం మంచిది. బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే, ఆ బాత్రూమ్ గోడపై చిత్రం ఉండకూడదు. మీరు పడకగదిలో రాధా-కృష్ణుల ఫోటోను ఉంచినట్లయితే, వాటిని ఇక్కడ పూజించకూడదు. అలాగే పొరపాటున కూడా పడకగదిలో ఏ దేవతా చిత్రపటాన్ని పెట్టకండి.
  6. మాస్టర్ బెడ్‌రూమ్‌లో మంచం యొక్క ఖచ్చితమైన స్థానం దక్షిణ ప్రాంతంలో లేదా నైరుతిలో ఉండాలి, కానీ రెండింటి మధ్య ఎప్పుడూ ఉండకూడదు, ఎందుకంటే అది వైవాహిక సమస్యలకు దారి తీస్తుంది.
  7. బెడ్ రూమ్ చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి. పదునైన మూలలతో ఇబ్బందికరమైన లేఅవుట్ను కలిగి ఉండకూడదు.
  8. అలాగే మెటల్ బెడ్‌ను నివారించండి ఎందుకంటే అవి నిద్రకు భంగం కలిగిస్తాయి, భార్యాభర్తల మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తాయి. సింగిల్ లేదా క్వీన్ సైజ్ బెడ్‌ని ఎంచుకోండి. ఒకదానితో ఒకటి రెండు పడకలు లేదా పరుపులను కచ్చితంగా నివారించాలి.
  9. పడకగదిలో అద్దం ఉంచుకోకూడదు లేదా మంచానికి నేరుగా ఎదురుగా ఉండే అద్దాన్ని నివారించాలి. అద్దం ఎంత పెద్దదైతే, వైవాహిక బంధంలో అంత ఒత్తిడికి అవకాశం ఎక్కువ.
  10. పడుకునేటప్పుడు మీ తలను దక్షిణ దిశలో ఉంచండి. ఉత్తర దిశలో తలను పెట్టి నిద్రించడం చేయకండి.
  11. పడకగదిలో ఒకే సీతాకోక చిలుక, ఒక్కటే పావురం ఇలా ఒకటే ఉన్న అలంకరణలు నివారించండి. ఏదైనా జంటగా ఉండటం ముఖ్యం అని నిర్ధారించుకోండి.
  12. బెడ్ రూమ్ రంగు లేత గులాబీ లేదా ఆకుపచ్చ రంగులో ఉండాలి. పొరపాటున కూడా పడకగదిలో ముదురు రంగులను ఉపయోగించవద్దు. గదిలో ముదురు రంగు పెయింట్‌లు ఉన్నప్పుడు గది ఎప్పుడూ చీకటిగా ఉంటుంది.
  13. గదిలో నైరుతి దిశలో ఫ్యామిలీ ఫోటో, పశ్చిమ దిశలో కపుల్ ఫోటో ఉంచుకోవాలని సిఫార్సు చేయడమైనది.

ఈ చిట్కాలు పాటించడం ద్వారా గందరగోళంగా మారిన మీ వైవాహిక జీవితంలో మళ్లీ ఆనందం నింపవచ్చు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని సమాచారం పూర్తిగా నిజం అని చెప్పలేం, అందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు కూడా లేవు.

Whats_app_banner

సంబంధిత కథనం