Radha Krishna | ఇంట్లో రాధాకృష్ణుల ఫోటో ఈ దిశలో ఉంటే..మీ వైవాహిక జీవితం ఇక మధురం
Radhakrishna Picture - Vastu Tips: నిన్నమొన్నటి వరకు చిలకాగోరింకల్లా కలిసి ఉన్నవారు ఇప్పుడు విడిపోతున్నారు. భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడటానికి వాస్తుదోషాలు కూడా ఒక కారణం అని నిపుణులు అంటున్నారు. అయితే బంధం నిలిచి ఉండాలంటే వాస్తుపరంగా కొన్ని సూచనలు చేశారు. అవేంటో తెలుసుకోండి.
ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా సాగాలని, ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతిని ఉండాలని కోరుకుంటారు. అయితే కొందరి ఇళ్లల్లో తరిగిపోని సంపద, సమృద్ధిగా ధాన్యం, సకల సౌకర్యాలు ఇలా అన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు చూసినా గొడవలు, తగాదాలతో రణగొణంగా అంతా గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడితే ఆ తగాదాలు ఎన్నటికీ తెగవు. ఈ కారణంగా విలువలు చెడిపోతాయి, బంధాలు తెగిపోతాయి, పిల్లలు ఉంటే వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఈ సమస్యలన్నింటికీ ఆ ఇంట్లో వాస్తు దోషాలు కూడా ఒక కారణం అని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకోకపోతే కొన్ని సార్లు రేయింబవళ్లు కష్టపడినా ఫలితం ఉండదు, నగదు నిలకడ (బర్కత్) ఉండదు, బంధాల మధ్య అనుబంధం ఉండదు, మొత్తంగా ఆ గృహంలో శాంతి అనేదే ఉండదు అని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో సరైన వాస్తు ఉండటం చాలా ముఖ్యం. ఏది ఏ దిశలో ఉంచాలో గుర్తుంచుకోవడం ముఖ్యం అని పేర్కొంటున్నారు.
భార్యాభర్తల మధ్య కాపురం పచ్చగా ఉండాలంటే, వారి బంధం పదికాలాల పాటు చల్లగా ఉండాలంటే అందుకు ఒక సులభమైన వాస్తు చిట్కాను సూచిస్తున్నారు.
మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమ రసాన్ని కలపాలంటే.. మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రంపటం పెట్టుకోవాలని చెబుతున్నారు. రాధా కృష్ణుల చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు. రాధా కృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి.
ఏ దిశలో పెట్టుకోవాలి?
అయితే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టే దిశపై కూడా నిబంధనలు ఉన్నాయి. వాస్తుశాస్త్రం ప్రకారం రాధా కృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్ లేదా పడకగదిలో వేలాడదీయవచ్చు. గదిలో ఈశాన్య దిశవైపు దేవతాచిత్రాలను వేలాడదీయడం ఉత్తమంగా చెప్తారు. అయితే రాధాకృష్ణుల ఫోటోను గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకం, నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఇక రాధాకృష్ణుల విగ్రహం అయితే హాలులో రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని సూచించడమైనది.
సంబంధిత కథనం
టాపిక్