తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ రాశుల వారికి ధన యోగం.. ఆర్థిక కష్టాలు దూరం- కుటుంబంలో సంతోషం..
- గ్రహాల కదలికలు మనషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక ఇప్పుడు.. శుక్రుని వల్ల కొన్ని రాశుల వారికి ధన లాభం చేకూరనుంది. జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆ రాశుల వివరాలు..
- గ్రహాల కదలికలు మనషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక ఇప్పుడు.. శుక్రుని వల్ల కొన్ని రాశుల వారికి ధన లాభం చేకూరనుంది. జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆ రాశుల వివరాలు..
(1 / 6)
శుక్రుడు తొమ్మిది గ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం. ఆనందం, విలాసం, అందం, సంతోషం కారకుడు శుక్రుడు. కాగా.. శుక్రుడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. శుక్రుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.
(2 / 6)
శుక్రుడు ఏప్రిల్ 24న మీనం నుంచి మేష రాశికి మారాడు.మే 19 వరకు ఒకే రాశిలో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు.శుక్రుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపినప్పటికీ., కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. ఆ రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
(3 / 6)
మీన రాశి : శుక్రుడు మీ రాశిచక్రం రెండొవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు ధన యోగాన్ని ఇస్తుంది. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి,
(4 / 6)
కుంభం : శుక్రుడు మీ రాశిచక్రంలోని మూడొవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. ఇతరులకు సాయం చేయడానికి మీరు ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపుతారు.
(5 / 6)
మకరం : శుక్రుడు మీ రాశిచక్రంలోని నాల్గొవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఆహ్లాదకరమైన జీవితం పొందుతారు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త ఇల్లు, భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు