తెలుగు న్యూస్  /  National International  /  Live News Today 30th May 2023 Check National International Business Updates
తొలిసారిగా పౌరుడిని అంతరిక్షంలోకి పంపిన చైనా..
తొలిసారిగా పౌరుడిని అంతరిక్షంలోకి పంపిన చైనా.. (AFP)

Live news today : తొలిసారిగా పౌరుడిని అంతరిక్షంలోకి పంపిన చైనా..

30 May 2023, 21:01 IST

  • Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్​, వినోదం వార్తల వివరాలు తెలుసుకునేందుకు ఈ హెచ్​టీ తెలుగు లైవ్​ పేజ్​ని ఫాలో అవ్వండి.

30 May 2023, 21:01 IST

షేర్ హోల్డర్లకు 1000 కోట్ల రూపాయల డివిడెండ్ ఇస్తున్న ఆదానీ కంపెనీ

FY23 లో ఆదానీ పోర్ట్స్ ఆదాయం రూ. 20,851.91 కోట్లుగా ఉంది. ఇది FY22 లో రూ. 17,118.79 కోట్లు. Q4FY23 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ ను కూడా ఆదానీ పోర్ట్స్ యాజమాన్యం ప్రకటించింది. రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 5 (250%) డివిడెండ్ గా అందించాలని నిర్ణయించింది. అంటే, షేర్ హోల్డర్లకు సంస్థ చెల్లిస్తున్న ఈ డివిడెండ్ విలువ సుమారు రూ. 1,080 కోట్లుగా ఉండనుంది. బీఎస్ఈ లో ఆదానీ పోర్ట్స్ షేర్ విలువ మంగళవారం 0.43% తగ్గి రూ. 734.30 వద్ద ముగిసింది. ఆదానీ గ్రూప్ కంపెనీల్లో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ తరువాత ఆదానీ పోర్ట్స్ అత్యంత విలువైన కంపెనీ. మే 30 నాటికి ఆదానీ పోర్ట్స్ మార్కెట్ క్యాప్ రూ. 1.58 లక్షల కోట్లు.

30 May 2023, 20:31 IST

ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బందిపై ప్రయాణికుడి దౌర్జన్యం

సోమవారం గోవా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బందిపై ఒక ప్రయాణికుడు దౌర్జన్యం చేశాడు. బూతులు తిడుతూ ఒక ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, ఆ తరువాత విమానం ల్యాండ్ అయిన తరువాత కూడా దురుసు ప్రవర్తన కొనసాగించాడు. దాంతో, అతడిని విమాన సిబ్బంది ఢిల్లీ విమానాశ్రయంలోని సెక్యూరిటీకి అప్పగించారు.

30 May 2023, 18:31 IST

Samsung Galaxy F54 5G: జూన్ 6 న మార్కెట్లోకి సామ్సంగ్ 5జీ ఫోన్ గెలాక్సీ ఎఫ్ 54; 999 రూపాయలతో ప్రి బుకింగ్ ఫెసిలిటీ

ఈ సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 54 ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ (Flipkart), సామ్సంగ్. కామ్ (Samsung.com) లలో ముందే బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రి బుకింగ్స్ మే 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఫ్లిప్ కార్ట్ (Flipkart), సామ్సంగ్. కామ్ (Samsung.com) లలో రూ. 999 లను చెల్లించి ముందే రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా ముందే రిజర్వ్ చేసుకున్న వారికి రూ. 2 వేల విలువైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు సామ్సంగ్ వెల్లడించింది.

30 May 2023, 17:23 IST

Apollo Hospitals results: అపోలో హాస్పిటల్స్ నికర లాభాల్లో 50 శాతం వృద్ధి; 180 శాతం డివిడెండ్

భారత్ లోని ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) ఫలితాలను ప్రకటించింది. ఈ Q4లో అపోలో హాస్పిటల్స్ రూ. 146 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22)లో అపోలో హాస్పిటల్స్ ఆర్జించిన రూ. 97 కోట్లతో పోలిస్తే, Q4FY23 లో సంస్థ లాభాలు 50% పెరిగాయి.

30 May 2023, 15:55 IST

Most data hungry mobile: మీ డేటా ప్రైవసీని దొంగిలించే డేంజరస్ గేమింగ్ యాప్స్ ఇవే

మొబైల్ గేమింగ్ యాప్స్ లో.. వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఎక్కువగా సేకరించే యాప్స్ గురించి వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్ సర్ఫ్ షార్క్ (SurfShark) సంస్థ ఒక అధ్యయనం చేసింది. ఆ అధ్యయనం ప్రకారం.. కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ (Call of Duty Mobile), క్యాండీ క్రష్ సాగా(Candy Crush Saga), క్యారమ్ పూల్ డిస్క్ గేమ్ (Carrom Pool Disc Game).. గేమింగ్ యాప్స్ వినియోగదారుల డేటాను ఎక్కువగా తీసుకుంటున్నాయి. ఫోన్ లోని మొత్తం 32 డేటా పాయింట్లలో నుంచి ఈ యాప్స్ గరిష్టంగా 17 పాయింట్స్ నుంచి డేటా ను తీసుకుంటున్నాయి. ఆ డేటా పాయింట్స్ లో కాంటాక్ట్స్, లొకేషన్, ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్.. మొదలైనవి ఉన్నాయి.

30 May 2023, 14:23 IST

Wrestlers ‘to throw medals in Ganga’: పతకాలను గంగానదిలో వేసేయనున్న రెజ్లర్లు; ఆ తరువాత ఆమరణ నిరాహార దీక్ష

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Wrestling Federation of India) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ గత కొంత కాలంగా భారత టాప్ రెజ్లర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ నిరసనను మరింత తీవ్రం చేయాలని రెజ్లర్లు నిర్ణయించారు. వివిధ పోటీల్లో తాము సాధించిన పతకాలను గంగానదిలో వేసేయాలని నిర్ణయించారు. తమ ఆందోళనను ఏమాత్రం సానుభూతితో అర్థం చేసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తాము సాధించిన పతకాలను హరిద్వార్ లో గంగానదిలో కలిపేయనున్నామని ఒక ప్రకటన విడుదల చేశారు.

30 May 2023, 13:47 IST

నేడు గంగా దసరా..

గంగా దసరా రోజున ధనయోగం, రవియోగం, సిద్ధి యోగం వంటి శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. గంగానదిలో స్నానం చేస్తే 10 రకాల పాపాలు తొలగిపోతాయని హిందూమత విశ్వాసం. దీనితో పాటు కొన్ని పరిహారాలు చేసుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం.

30 May 2023, 13:19 IST

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. భక్తులు స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఎస్‌ఎస్‌డి టోకెన్లు లేని వారికి క్యూ లైన్లలో గరిష్టంగా 30గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. సోమవారం శ్రీవారిని 78,126 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,597 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు లభించింది.

30 May 2023, 12:42 IST

అంబానీ ప్లాన్​ మళ్లీ సక్సెస్…

ఐపీఎల్​ 2023తో జియో సినిమా పంట పండింది! మరీ ముఖ్యంగా ఐపీఎల్​ ఫైనల్​తో దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ ప్లాన్​ మరోమారు సక్సెస్​ అయ్యింది! చెన్నై సూపర్​ కింగ్స్​, గుజరాత్​ టైటాన్స్​ మధ్య సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్​ ఫైనల్​ను జియో సినిమాలో.. ఏకకాలంలో దాదాపు 32మిలియన్​ (3.2కోట్లు) మంది వీక్షించారు. ఫలితంగా యాప్​నకు రానున్న రోజుల్లో భారీగా డిమాండ్​ పెరుగుతుందని అంచనాలు మొదలయ్యాయి.

30 May 2023, 12:13 IST

 ఆదిపురుష్ తెలుగు రైట్స్

ప్ర‌భాస్ (Prabhas)హీరోగా న‌టించిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఆదిపురుష్ జూన్ 16న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ (Omraut) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు థియేట్రిక‌ల్ రైట్స్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ దాదాపు 185 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

30 May 2023, 11:56 IST

రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్​ బృందం..

కాంగ్రెస్​ బృందం.. మంగళవారం ఉదయం దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసింది. మణిపూర్​లోని తాజా పరిస్థితులపై ముర్ముకు మెమొరాండమ్​ను అందించింది. కాంగ్రెస్​ తరఫు నుంచి 12 డిమాండ్లను అందులో పేర్కొంది. 

30 May 2023, 11:47 IST

బిర్యానీ.. బిర్యానీ..

ఐపీఎల్​ 2023 షెడ్యూల్​ మొత్తంలో ఎక్కువ ఆర్డర్లు వచ్చిన ఫుడ్​గా నిలిచింది 'బిర్యానీ'. ఓవైపు తమ ఆటతో ప్లేయర్లు దుమ్మురేపుతుంటే.. మరోవైపు నిమిషానికి 212 ఆర్డర్లతో బిర్యానీ బౌండరీల మీద బౌండరీలు కొట్టేసింది! ఆర్డర్ల విషయంలో వార్​ వన్​ సైడ్​ అయిపోయిందని ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ చెప్పింది.

30 May 2023, 11:03 IST

మనీశ్​ సిసోడియా బెయిల్​ పిటిషన్​ రద్దు..

దిల్లీ మాజీ మంత్రి మనీశ్​ సిసోడియా బెయిల్​ పిటిషన్​ను దిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. లిక్కర్​ స్కామ్​లో భాగంగా ఆయన అరెస్టయ్యారు.

30 May 2023, 10:53 IST

అంతరిక్షంలోకి చైనా పౌరుడు..

షెంజౌ 16తో మరో మైలురాయిని అదిగమంచింది చైనా. తొలిసారిగా ఓ పౌరుడిని అంతరిక్షంలోకి పంపింది. జియుక్వాన్​ కేంద్రం నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన రాకెట్​ మంగళవారం ఉదయం నింగికెగిసింది. వీరిలో బీజింగ్​కు చెందిన ప్రొఫెసర్​ గుయ్​ హైచావో అన్ పౌరుడు కూడా ఉన్నారు.

30 May 2023, 10:48 IST

మాస్కోలో డ్రోన్ల కలకలం

రష్యాలోని మాస్కోలో కొన్ని డ్రోన్లు భవనాలను ఢీకొట్టాయి. ఈ ఘటనల్లో స్వల్ప డ్యామేజ్ జరిగిందని మాస్కో మేయర్ పేర్కొన్నారు. డ్రోన్లు వచ్చిన కొన్ని ప్రాంతాల్లో ప్రజలను వేరే ప్రాంతాలకు అక్కడి అధికారులు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. 

30 May 2023, 10:28 IST

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు

ఆంధ్రా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరంలో మార్పు వచ్చింది. మరో మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

30 May 2023, 10:06 IST

మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ఓపెన్ సేల్ నేడే..

మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ నేడు (మే 30) తొలిసారి సేల్‍కు రానుంది. మిడ్ రేంజ్‍లో కొన్ని ప్రీమియమ్ స్పెసిఫికేషన్లను ఈ మొబైల్ కలిగి ఉంది.

30 May 2023, 9:49 IST

మోదీ 9ఏళ్ల పాలన..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఎన్​డీఏ పాలన 9ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీ ట్వీట్​ చేశారు.

“జాతీ సేవలో 9ఏళ్ల పాలనను ఈరోజు పూర్తి చేసుకున్నాము. నేను చాలా కృతజ్ఞతాభావంలో ఉన్నాను. తీసుకున్న ప్రతి నిర్ణయం, అమలు చేసిన ప్రతి చర్య, ప్రజల ఆకాంక్షలనుద్దేశించి తీసుకున్నదే. దేశాభివృద్ధికి మరింత కష్టపడతాము,” అని మోదీ అన్నారు.

30 May 2023, 9:17 IST

లాభాలు.. నష్టాలు..

టైటాన్​, ఎం అండ్​ ఎం, పవర్​గ్రిడ్​, మారుతీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, టాటా స్టీల్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టెక్​ఎం, టాటా మోటార్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, సన్​ఫార్మా, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

30 May 2023, 9:16 IST

స్టాక్​ మార్కెట్​లు..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 24పాయింట్లు కోల్పోయి 62,822 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 20 పాయింట్ల నష్టంతో 18,580 వద్ద కొనసాగుతోంది.

30 May 2023, 8:29 IST

రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ధర పెంపు.!

రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ధర పెరిగింది. ఈ బైక్​పై 2023లో తొలిసారిగా ప్రైజ్​ హైక్​ తీసుకుంది రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ.

30 May 2023, 8:17 IST

విశాఖలో గిరిజన యువతి దారుణ హత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానంతో అంత మొదించాడు. విశాఖపట్నంలో గిరిజన యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని ఆపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు.

30 May 2023, 8:05 IST

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీగా లాభపడ్డాయి! డౌ జోన్స్​ 1శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.3శాతం, నాస్​డాక్​ 2.19శాతం మేర వృద్ధిచెందాయి.

30 May 2023, 7:54 IST

చ‌రిత్ర సృష్టించిన చెన్నై 

ఐపీఎల్ విజేత‌గా చెన్నై నిలిచింది. సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్ల‌తో అద్భుత విజ‌యాన్ని సాధించి ఐదో టైటిల్ సొంతం చేసుకున్న‌ది.

30 May 2023, 7:54 IST

లోయలో పడిన బస్సు..

జమ్ముకశ్మీర్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైష్ణో దేవీ యాత్రలో భాగంగా.. అమృత్​సర్​ నుంచి కాట్రా వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. 20కిపైగా మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

30 May 2023, 7:53 IST

భారత సంతతి విద్యార్థి హత్య..

అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా.. ఇద్దరు దుండగులు అతడిపై కాల్పులకు తెగబడ్డారు.

30 May 2023, 7:52 IST

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను పాజిటివ్​గా ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ స్వల్ప లాభాల్లో ఉండటం ఇందుకు కారణం.

30 May 2023, 7:54 IST

పసిడి, వెండి ధరలు..

దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 55,550గా కొనసాగుతోంది. వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 73,000గా కొనసాగుతోంది.

    ఆర్టికల్ షేర్ చేయండి