Indian origin shot dead : అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్య!-21 year old indian origin student shot dead in us says report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  21 Year Old Indian Origin Student Shot Dead In Us: Says Report

Indian origin shot dead : అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్య!

Sharath Chitturi HT Telugu
May 30, 2023 07:17 AM IST

Indian origin shot dead in US : అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా.. ఇద్దరు దుండగులు అతడిపై కాల్పులకు తెగబడ్డారు.

అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్య
అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్య

Indian origin shot dead in US : అమెరికాలో గన్​ కల్చర్​ తీవ్రస్థాయిలో ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా.. ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భారత సంతతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఫిలడెల్ఫియాలో చోటుచేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

మృతుడి పేరు జూడ్​ చాకో. అతని వయస్సు 21ఏళ్లు. అతని తల్లిదండ్రులు.. కేరళ కొల్లమ్​ జిల్లా నుంచి 30ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. ఓ వర్సిటీలో చదువుకుంటున్న జూడ్​ చాకో.. పార్ట్​ టైమ్​ ఉద్యోగం కూడా చేసేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గం మధ్యలో ఇద్దరు దుండగులు జూడ్​ను అడ్డగించారు. తన వద్ద ఉన్న వస్తువులను ఇవ్వాలని తుపాకీతో బెదిరించారు. అనంతరం జూడ్​ చాకోపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జూడ్​ చాకో ప్రాణాలు కోల్పోయాడు.

రెండో ఘటన..

అమెరికాలో భారత సంతతి, భారతీయ విద్యార్థులపై దాడులు ఇటీవలి కాలంలో ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నాయి. ఏప్రిల్​ 21న.. ఒహాయోలోని ఓ ఫ్యూయెల్​ స్టేషన్​లో పని చేస్తున్న సయేష్​ వీర్​ అన 24ఏళ్ల విద్యార్థిని ఓ దుండగుడు తుపాకీత కాల్చి చంపేశాడు. సయేష్​ వీర్​ ఆంధ్రప్రదేశ్​కు చెందిన యువకుడు. అతడి హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

9మందికి గాయాలు..

US shooting latest news : ఫ్లోరిడాలో.. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం కాల్పుల మోతమోగింది. ఈ ఘటనలో 9మంది గాయపడ్డారు. కాల్పుల శబ్దానికి బయపడిన స్థానికులు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.

రెండు వర్గాల మధ్య వివాదం నెలకొన్నట్టు.. ఫలితంగా వారు కాల్పులకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై స్పందించిన అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో భద్రతను పెంచారు.

IPL_Entry_Point