Jammu Kashmir bus accident : లోయలో పడిన బస్సు.. 8మంది దుర్మరణం!-several dead after bus travelling from amritsar to katra falls into jammu gorge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Several Dead After Bus Travelling From Amritsar To Katra Falls Into Jammu Gorge

Jammu Kashmir bus accident : లోయలో పడిన బస్సు.. 8మంది దుర్మరణం!

Sharath Chitturi HT Telugu
May 30, 2023 07:46 AM IST

Jammu Kashmir bus accident : జమ్ముకశ్మీర్​లో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8మంది మరణించారు.

జమ్ముకశ్మీర్​లో లోయలో పడిన బస్సు..
జమ్ముకశ్మీర్​లో లోయలో పడిన బస్సు.. (ANI)

Jammu Kashmir bus accident : జమ్ముకశ్మీర్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైష్ణో దేవీ యాత్రలో భాగంగా.. అమృత్​సర్​ నుంచి కాట్రా వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. 20కిపైగా మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

జమ్ముకశ్మీర్​లోని జాజర్​ కొట్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వంతెనపై నుంచి బస్సు వెళుతుండగా.. ఒక్కసారిగా పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఘటనతో బస్సు నుజ్జునుజ్జు అయ్యింది.

"8మంది మరణించారు. 20మంది గాయపడ్డారు. సహాయక చర్యలు చేపట్టాము. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది," అని జమ్ముకశ్మీర్​ ఎస్​పీ చందన్​ కోహ్లీ తెలిపారు.

ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

నెత్తురోడుతున్న రహదారులు..

దేశంలో రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళకనరంగా మారాయి.  కర్ణాటకలోని మైసూరు సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది చనిపోయారు. ఓ కారు, ప్రైవేటు బస్సు బలంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమకుడలు - నరసిపుర మధ్య కుర్బూర్ గ్రామం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 

కుర్బూర్ సమీపంలో 766వ జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు.. ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. బస్సు ముందు భాగం కూడా తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులోని ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. మృతులది కర్ణాటకలోని బళ్లారి అని తెలుస్తోంది. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం