Motorola Edge 40 Sale: మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ఓపెన్ సేల్ నేడే.. వైర్లెస్ చార్జింగ్, వాటర్ రిసిస్టెన్స్‌తో..-motorola edge 40 first open sale today check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Motorola Edge 40 First Open Sale Today Check Details

Motorola Edge 40 Sale: మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ఓపెన్ సేల్ నేడే.. వైర్లెస్ చార్జింగ్, వాటర్ రిసిస్టెన్స్‌తో..

Chatakonda Krishna Prakash HT Telugu
May 30, 2023 09:41 AM IST

Motorola Edge 40 Sale: మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ నేడు (మే 30) తొలిసారి సేల్‍కు రానుంది. మిడ్ రేంజ్‍లో కొన్ని ప్రీమియమ్ స్పెసిఫికేషన్లను ఈ మొబైల్ కలిగి ఉంది.

Motorola Edge 40 Sale: మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ఓపెన్ సేల్ నేడే.. (Photo: Motorola)
Motorola Edge 40 Sale: మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ఓపెన్ సేల్ నేడే.. (Photo: Motorola)

Motorola Edge 40 Sale: మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్ తొలి ఓపెన్ సేల్‍కు రెడీ అయింది. గత వారం లాంచ్ అయిన ఈ మొబైల్ సేల్.. నేడు (మే 30) ప్రారంభం కానుంది. మిడ్ రేంజ్‍లో అడుగుపెట్టిన ఈ మొబైల్‍ కొన్ని ప్రీమియమ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ-సిమ్ సపోర్ట్, వాటర్ రెసిస్టెన్స్, వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 40 వచ్చింది. స్లీక్ డిజైన్ ఉంది. వివరాలివే..

మోటోరోలా ఎడ్జ్ 40 ధర, సేల్

8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ధర రూ.29,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, మోటోరోలా వెబ్‍సైట్‍లో నేటి (మే 30) మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ఓపెన్ సేల్ ప్రారంభం కానుంది. కొన్ని రోజులు ప్రీ-బుకింగ్ నడవగా.. ఇప్పుడు తొలిసారి ఓపెన్ సేల్‍కు ఈ ఫోన్ వస్తోంది. నెబ్యులా గ్రీన్, లునాల్ బ్లూ, ఎక్లిప్స్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో ఈ ఎడ్జ్ 40 ఫోన్ అందుబాటులోకి వచ్చింది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.2,000 అదనపు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. బ్యాంక్ కార్డులతో నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 40 స్పెసిఫికేషన్లు

మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్‍కు డిస్‍ప్లే కూడా హైలైట్‍గా ఉంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.55 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ pOLED డిస్‍ప్లేతో ఈ మొబైల్ వచ్చింది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 8020 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‍తో అందుబాటులోకి వస్తోంది. 14 5జీ బ్యాండ్‍లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్‍లో 4,400mAh బ్యాటరీ ఉంది. 68 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍ సపోర్టును ఈ ఫోన్ కలిగి ఉంది. 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ సిమ్ 5జీ సపోర్టుతో ఈ ఫోన్ వచ్చింది. ఓ ఫిజికల్ సిమ్, మరో ఈ-సిమ్‍ ఉంటుంది. ఇక వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‍తో ఎడ్జ్ 40 వచ్చింది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

రెండు వెనుక కెమెరాల సెటప్‍తో మోటోరోలా ఎడ్జ్ 40 వెనుక వచ్చింది. 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఎక్లిప్స్ బ్లాక్, నెబ్యూలా గ్రీన్ కలర్ ఆప్షన్‍కు వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, లునార్ బ్లూ కలర్ ఆప్షన్ కు అక్రిలిక్ బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. ఈ ఫోన్ మందం 8mmలోపే ఉండడంతో స్లిమ్ గా ఉంది.

WhatsApp channel