Motorola Edge 40: మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ వచ్చేసింది: స్లీక్ డిజైన్, ఈ-సిమ్ సపోర్టుతో.. మిడ్ రేంజ్ ధరలోనే..
Motorola Edge 40: మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్ లాంచ్ అయింది. ఈ-సిమ్ సపోర్ట్, వైర్లెస్ చార్జింగ్, 144Hz డిస్‍ప్లే, ప్రీమియమ్ డిజైన్ హైలైట్లుగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇవే.
Motorola Edge 40: ఎడ్జ్ సిరీస్‍లో సరికొత్త స్మార్ట్ ఫోన్‍ను ప్రముఖ సంస్థ మోటోరోలా (Motorola) తీసుకొచ్చింది. మోటోరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40) మొబైల్ భారత మార్కెట్‍లో నేడు (మే 23) లాంచ్ అయింది. స్లిమ్ డిజైన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే pOLED డిస్‍ప్లే, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, వైర్లెస్ చార్జింగ్ సపోర్టును ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ-సిమ్ సపోర్ట్ ఉండడం ప్రత్యేకతగా ఉంది. మిడ్ రేంజ్‍లో ఈ ఫీచర్ ఉన్న తొలి ఫోన్‍గా నిలిచింది. 14 5జీ బ్యాండ్‍లకు మోటోరోలా ఎడ్జ్ 40 సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉండే ప్రైమరీ కెమెరా ఉంటుంది. Motorola Edge 40 ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే.
144Hz డిస్‍ప్లేతో..
Motorola Edge 40 Display: 6.55 ఇంచుల కర్వ్డ్ ఫుల్ హెచ్‍డీ+ pOLED డిస్‍ప్లేను మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ కలిగి ఉంది. 144 హెర్ట్జ్ (Hz) వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి.
ప్రాసెసర్, ఓఎస్
Motorola Edge 40: మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన తొలి మొబైల్‍గా ఇది నిలిచింది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ మొబైల్ వచ్చింది.
OIS ప్రైమరీ కెమెరా
Motorola Edge 40 Camera: మోటోరోలా ఎడ్జ్ 40 వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. అల్ట్రా వైడ్ లెన్స్ మాక్రో కెమెరాగానూ ఉయోగపడుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‍కు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ-సిమ్ సపోర్ట్
Motorola Edge 40 Features: డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లను మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్ కలిగి ఉంది. డ్యుయల్ 5జీ సిమ్ సపోర్ట్ ఉంటుంది. ఓ ఫిజికల్ సిమ్, మరో ఈ-సిమ్‍కు సపోర్ట్ చేస్తుంది. మిడ్ రేంజ్‍లో ఈ-సిమ్ సపోర్టుతో వచ్చిన తొలి ఫోన్‍గా ఇది నిలిచింది.
వైర్లెస్ చార్జింగ్, వాటర్ రెసిస్టెన్స్
Motorola Edge 40: మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్‍లో 4,400mAh బ్యాటరీ ఉంది. 68 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ ఫోన్ కలిగి ఉంది.
ప్రీమియమ్ డిజైన్
Motorola Edge 40: మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్‍కు డిజైన్ హైలైట్‍గా ఉంది. ఈ ఫోన్ కేవలం 7.58 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. స్లీక్ డిజైన్‍తో వచ్చింది. ఈ ఫోన్ బరువు కూడా 171 గ్రాములే ఉంటుంది. రసెడా గ్రీన్, ఎక్లిప్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లు వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఫినిష్‍ను కలిగి ఉన్నాయి. లునార్ బ్లూ కలర్ వేరియంట్ అక్రిలిక్ ప్యానెల్‍తో వచ్చింది. దీంతో మోటోరోలా ఎడ్జ్ 40 అన్ని కలర్ ఆప్షన్లు ప్రీమియమ్ లుక్‍ను కలిగి ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 40 ధర, సేల్
Motorola Edge 40 Price: మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ఒకే వేరియంట్‍లో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర రూ.29,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ మొబైల్ ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. మే 30వ తేదీన ఫ్లిప్‍కార్ట్ సహా కంపెనీ వెబ్‍సైట్, ఆఫ్‍లైన్ స్టోర్లలో ఓపెన్ సేల్‍కు వస్తుంది. ఎక్లిప్స్ బ్లాక్, నెబ్యూలా గ్రీన్, లునార్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ లభిస్తుంది.
పాత ఫోన్‍ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.2,000 వరకు అదనపు డిస్కౌంట్ లభించేలా ప్రీ-ఆర్డర్ ఆఫర్ ఉంది. అలాగే మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్‍ను ఎస్‍బీఐ, హెచ్‍డీఎఫ్‍సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డులతో నో-కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు.