IPL 2023 Final : ఐపీఎల్​ ఫైనల్​కు రికార్డ్​ స్థాయి వ్యూస్​.. అంబానీ ప్లాన్​ మళ్లీ సక్సెస్​..?-ambanis big cricket bet captures record viewers for ipl final in jiocinema ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Ambanis Big Cricket Bet Captures Record Viewers For Ipl Final In Jiocinema

IPL 2023 Final : ఐపీఎల్​ ఫైనల్​కు రికార్డ్​ స్థాయి వ్యూస్​.. అంబానీ ప్లాన్​ మళ్లీ సక్సెస్​..?

Sharath Chitturi HT Telugu
May 30, 2023 12:41 PM IST

IPL 2023 Final JioCinema : ఐపీఎల్​ 2023తో ముకేశ్​ అంబానీ ప్లాన్​ సక్సెస్​ అయ్యింది! జియో సినిమా హిట్​ కొట్టింది! వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్​ ఫైనల్​కు రికార్డ్​ స్థాయి వ్యూస్​.. అంబానీ ప్లాన్​ మళ్లీ సక్సెస్​..?
ఐపీఎల్​ ఫైనల్​కు రికార్డ్​ స్థాయి వ్యూస్​.. అంబానీ ప్లాన్​ మళ్లీ సక్సెస్​..? (REUTERS)

IPL 2023 Final JioCinema : ఐపీఎల్​ 2023తో జియో సినిమా పంట పండింది! మరీ ముఖ్యంగా ఐపీఎల్​ ఫైనల్​తో దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ ప్లాన్​ మరోమారు సక్సెస్​ అయ్యింది! చెన్నై సూపర్​ కింగ్స్​, గుజరాత్​ టైటాన్స్​ మధ్య సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్​ ఫైనల్​ను జియో సినిమాలో.. ఏకకాలంలో దాదాపు 32మిలియన్​ (3.2కోట్లు) మంది వీక్షించారు. ఫలితంగా యాప్​నకు రానున్న రోజుల్లో భారీగా డిమాండ్​ పెరుగుతుందని అంచనాలు మొదలయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

రికార్డులే.. రికార్డులు..

జియో సినిమా.. ఐపీఎల్ డిజిటల్​​ రైట్స్​ను గతేడాది దక్కించుకుంది. అనంతరం ఫ్రీ స్ట్రీమింగ్​ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఫైనల్​ విషయానికొస్తే.. దిగ్గజ క్రికెటర్​​ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్​ మ్యాచ్​ అన్న ఊహాగానాలు జోరుగా సాగడంతో.. అస్సలు మిస్స్​ అవ్వకూడదని అభిమానులు భావించినట్టు కనిపిస్తోంది. ఫలితంగా జియో సినిమాకు రికార్డు స్థాయి వ్యూస్​ లభించాయి. వర్షం ఆటంకం కలిగించినా.. వ్యూవర్​షిప్​లో మాత్రం మార్పు లేదని వాయ్​కామ్​18 ప్రతినిథి తెలిపారు. ముకేశ్​ అంబానీ, పారామౌంట్​ గ్లోబల్​ భాగస్వామ్యంతో జియో సినిమాను రూపొందించారు.

ఇదీ చూడండి:- Most ordered dish during IPL 2023 : ఐపీఎల్​ 2023 టైమ్​లో ఏ ఫుడ్​కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయో తెలుసా?

అసలు సవాలు అదే..!

జియో సిమ్​ను లాంచ్​ చేసి.. టెలికాం రంగంలో పెను ప్రకంపనలు సృష్టించారు ముకేశ్​ అంబానీ. ఫ్రీ డేటా, అన్​లిమిటెడ్​ కాల్స్​తో జియోకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలకు అలవాటైన తర్వాత.. కొద్దికొద్దిగా డబ్బులు పెంచడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు జియోసినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఇదే జరిగితే.. ఐపీఎల్​ ఫ్రీ స్ట్రీమింగ్​ సక్సెస్​ను జియోసినిమా.. పెయిడ్​ సబ్​స్క్రిప్షన్​గా మార్చుకోగలదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఐపీఎల్​కు మరో ఏడాది సమయం ఉంది. ప్రస్తుత సక్సెస్​తో జియో సినిమా వృద్ధి చెందుతుందా? అన్నది వేచిచూడాలి.

CSK vs GT ipl 2023 final : అంతర్జాతీయ మీడియాపై పట్టు సాధించాలన్న ఆకాంక్షతో అడుగులు వేస్తున్న రిలయన్స్​ ఇండస్ట్రీస్​.. హెచ్​బీఓ, వార్నర్​ బ్రదర్స్​తో ఒప్పందాలు చేసుకుంది. అందులో భాగంగా.. వాటి కంటెట్​కు ఛార్జీలు వసూలు చేస్తోంది.

తాజా పరిణామాలు డిస్నీకి బాధ కలిగించేవే! ఐపీఎల్​ డిజిటల్​ రైట్స్​ కోల్పోవడంతో డిస్నీ హాట్​స్టార్​ పెయిడ్​ సబ్​స్క్రిప్షన్స్​ పడిపోయాయి. ఇక ఇప్పుడు జియోసినిమాకు రికార్డు స్థాయి వ్యూస్​ లభించిందన్న ప్రచారంతో ఎలాంటి ఫలితాలు ఉంటాయో వేచిచూడాలి.

WhatsApp channel

సంబంధిత కథనం