Stocks to buy today : స్టాక్స్ టు బై.. రిలయన్స్ షేర్లు ఇప్పుడు కొంటే భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్స్ నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629 పాయింట్లు పెరిగి 62,502 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 178 పాయింట్లు బలపడి 18,499 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది.
"గతవారం దాదాపుగా కన్సాలిడేషన్ దశలో ఉన్న నిఫ్టీ.. చివరి సెషన్లో బలంగా పుంజుకుంది. కీలకమైన 18,450 మార్కును దాటింది. ఇక ఇక్కడి నుంచి నిఫ్టీ మరింత పెరగవచ్చు. రానున్న వారాల్లో గత లైఫ్ టైమ్ హైని (ఇంకో 2శాతం) తాకవచ్చు," అని మోతీలాల్ ఒస్వాల్లోని రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్త ఖేంక తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 350.15కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1840.98కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇదీ చూడండి:- Q4 Results this week: ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ముఖ్యమైన కంపెనీలు ఇవే.. అదానీ పోర్ట్స్, ఐఆర్‌సీటీసీ సహా మరిన్ని..
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1శాతం, ఎస్ అండ్ పీ 500 1.3శాతం, నాస్డాక్ ఏకంగా 2.19శాతం మేర వృద్ధి చెందాయి.
స్టాక్స్ టు బై..
పిడిలైట్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2520, టార్గెట్ రూ. 2720
Reliance share price target : రిలయన్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2450, టార్గెట్ రూ. 2610
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 558, టార్గెట్ రూ. 630
TVS motors share price target : టీవీఎస్ మోటార్స్:- బై రూ. 1240- రూ. 1250, స్టాప్ లాస్ రూ. 1195, టార్గెట్ రూ. 1350
ఐజీఎల్:- బై రూ. 480, స్టాప్ లాస్ రూ. 470, టార్గెట్ రూ. 495
సన్ ఫార్మా:- బై రూ. 970, స్టాప్ లాస్ రూ. 950, టార్గెట్ రూ. 990
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం