Q4 Results this week: ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ముఖ్యమైన కంపెనీలు ఇవే.. అదానీ పోర్ట్స్, ఐఆర్‌సీటీసీ సహా మరిన్ని..-q4 results this week from may 29 to june 2 adani ports irctc apollo hospitals and more companies to declare earnings ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Q4 Results This Week From May 29 To June 2 Adani Ports Irctc Apollo Hospitals And More Companies To Declare Earnings

Q4 Results this week: ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ముఖ్యమైన కంపెనీలు ఇవే.. అదానీ పోర్ట్స్, ఐఆర్‌సీటీసీ సహా మరిన్ని..

Chatakonda Krishna Prakash HT Telugu
May 28, 2023 10:29 PM IST

Q4 Results this week: ఈ వారం (మే 29 - జూన్ 2) నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్న కంపెనీలు ఏవో ఇక్కడ చూడండి. ఏ రోజు ఏ సంస్థల ఫలితాలు వస్తాయో తెలుసుకోండి.

Q4 Results this week: ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ముఖ్యమైన కంపెనీలు ఇవే (Photo: Mint)
Q4 Results this week: ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ముఖ్యమైన కంపెనీలు ఇవే (Photo: Mint)

Q4 Results this week: నాలుగో త్రైమాసిక ఫలితాల సందడి ముగింపు దశకు వచ్చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో క్వార్టర్ (Q4) ఫలితాలను ఇప్పటికే చాలా కీలక కంపెనీలు వెల్లడించాయి. నెల రోజులుగా స్టాక్ మార్కెట్లపై ఈ ఫలితాల ప్రభావం కనిపిస్తోంది. కాగా, ఇక ఈ వారంలోనూ కొన్ని ముఖ్యమైన సంస్థలు క్యూ4 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ వారంతో దాదాపు నాలుగో త్రైమాసిక ఫలితాల తంతు ముగియనుంది. కాగా, ఈ వారంలో నాలుగో క్వార్టర్ ఫలితాలను వెల్లడించే కంపెనీలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

మే 29

అదానీ ట్రాన్స్‌మిషన్, ఐఆర్‌సీటీసీ, టోరెంట్ పవర్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ది న్యూఇండియా అసురెన్స్ కంపెనీ, ఇప్కా ల్యాబోరేటరీస్, నాట్కో పార్మా, ఐటీఐ, క్యాంపస్ యాక్టివ్‍వేర్ కంపెనీలు మే 29న సోమవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. అలాగే యురోకా ఫోర్బ్స్, ఎన్‍బీసీసీ, ఆల్‍కార్గో లాజిస్టిక్స్, కేఎన్ఆర్ కన్‍స్ట్రక్షన్స్, జుబిలియంట్ ఫార్మోవా, టెక్నో ఎలక్ట్రిక్ & ఇంజినీరింగ్, సుప్రాజిత్ ఇంజినీరింగ్, రతన్ ఇండియా సహా మరిన్ని కంపెనీలు కూడా రిజిల్ట్స్ విడుదల చేస్తాయి.

మే 30

మే 30వ తేదీన అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనమిక్ జోన్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్, మ్యాన్‍కైండ్ ఫార్మా, పతంజలి ఫుడ్స్, 3ఎం ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, రాజేశ్ ఎక్స్ పోర్ట్స్, మాగజోన్ డాక్ షిప్‍బిల్డర్స్, కేఆర్బీఎల్, లెమన్ ట్రీ హోటల్స్, అర్వింద్ ఫ్యాషన్స్, వీ గార్డ్ ఇండస్ట్రీస్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, సుజ్లోన్ ఎనర్జీ సహా మరిన్ని కంపెనీలు Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ వెల్లడిస్తాయి.

మే 31

బీఎన్ హోల్డింగ్స్, ఉష్‍దేవ్ ఇంటర్నేషనల్, మిప్కో సీమ్‍లెస్ రింగ్స్, రాజేంద్ర క్యాటరెర్స్ & కాన్ఫెక్షనర్స్ మే 31న క్యూ4 ఫలితాలను ప్రకటిస్తాయి.

జూన్ 2

కల్యాణి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, సెట్కో ఆటోమోటివ్ కంపెనీలు జూన్ 2న నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి.

అమెరికాకు తప్పిన గండం

అమెరికా ప్రభుత్వ గరిష్ట రుణ పరిమితిని పెంచడంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో దివాళ గండం నుంచి అమెరికా తప్పించుకుంది. వారాల సమాలోచనల తర్వాత అధ్యక్షుడు జో బైడెన్, హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‍కార్తీ మధ్య చర్చలు ఎట్టకేలకు సఫలం అయ్యాయి. ఒకవేళ ఈ డీల్ జరగకపోతే జూన్ 5న అమెరికా ప్రభుత్వ ఖజానా పూర్తిగా అయిపోతుందని ట్రెజరీ ఇటీవలే హెచ్చరించింది. ఈ రుణ గరిష్ట పరిమితి పెంపుతో ప్రభుత్వం మరింత ధనం సమకూర్చుకోవచ్చు.

WhatsApp channel