Jio Cinema IPL Viewership : జియో సినిమాలో కొత్త రికార్డు.. ధోని బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు 2.5 కోట్ల వీక్షణలు-ipl 2023 jio cinema viewership touches 2 5 crore when ms dhoni batting during csk vs gt ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Jio Cinema Viewership Touches 2.5 Crore When Ms Dhoni Batting During Csk Vs Gt

Jio Cinema IPL Viewership : జియో సినిమాలో కొత్త రికార్డు.. ధోని బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు 2.5 కోట్ల వీక్షణలు

HT Telugu Desk HT Telugu
May 25, 2023 09:31 AM IST

Jio Cinema IPL : ఐపీఎల్ ప్రస్తుత ఎడిషన్‌లో 3వ సారి తన సొంత వీక్షకుల రికార్డును బద్దలు కొట్టింది జియో సినిమా. అత్యధక వీక్షకులను సొంతం చేసుకుంది.

జియో సినిమా
జియో సినిమా

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 16వ ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్(GT Vs CSK) మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ కొత్త మైలురాయిని నెలకొల్పింది. జియోసినిమా(Jio Cinema)లో రికార్డు స్థాయిలో 2.5 కోట్ల మంది వీక్షించారు. అంబటి రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ 1 పరుగు చేసి ఔటయ్యాడు. కానీ ధోనీ క్రీజులోకి బ్యాటింగ్ కు వచ్చేసరికి 2.5 కోట్ల వీక్షకులు రావడం విశేషం. ధోని ఔట్ కావడంతో అది 55 లక్షలకు తగ్గడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

దీంతో ప్రస్తుత ఐపీఎల్(IPL) ఎడిషన్‌లో జియోసినిమా తన వ్యూయర్‌షిప్ రికార్డును 3వ సారి బద్దలు కొట్టింది. ఇది 2019 ICC ODI ప్రపంచ కప్ సందర్భంగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నెలకొల్పబడిన ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది.

ఏప్రిల్ 17న బెంగళూరు ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(RCB Vs CSK) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా, MS ధోని ఆటను చూడటానికి 2.4 కోట్ల మంది ప్రేక్షకులు జియోసినిమాకు వచ్చారు. ఇది మునుపటి రికార్డు. అంతకుముందు ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని బ్యాటింగ్(Dhoni Batting) ప్రదర్శన వచ్చినప్పుడు 2.2 కోట్ల మంది వీక్షకులను సాధించి రికార్డు సృష్టించింది. క్వాలిఫైయర్ 1లో ఈ రికార్డులను బద్దలు కొట్టింది జియో సినిమా.

IPL 2023 మొదటి ఐదు వారాల్లో జియో సినిమా 1,300 కోట్లకు పైగా వీడియో వీక్షణలతో రికార్డు సృష్టించింది. జియో సినిమా ఫ్యాన్-సెంట్రిక్ ప్రెజెంటేషన్‌తో వీక్షకులను ఆకట్టుకుంటోంది. కొంతమంది ప్రేక్షకులు మ్యాచ్ మెుదటి నుంచి పూర్తయ్యేవరకూ చూస్తున్నారు. మరికొంతమంది మంది మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తున్నారు. ఒక్కో మ్యాచ్‌కి ఒక్కో వీక్షకుడికి సగటు 60 నిమిషాలుగా ఉంది.

టాటా IPL 2023 మ్యాచ్‌లను చూడటానికి క్రికెట్ అభిమానులు(Cricket Lovers) జియోసినిమాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ రికార్డులు రుజువు చేస్తున్నాయి. జియోసినిమా ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను అందిస్తూనే.. అనేక ఫ్యాన్-సెంట్రిక్ ఆఫర్‌లను కూడా ఇస్తోంది.

WhatsApp channel