Live News Today: భారత్ - ఆస్ట్రేలియా బంధంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు: సిడ్నీలో హర్షధ్వానాల మధ్య ఈవెంట్-live news breaking news today 23rd may 2023 check latest updates modi australia tour and more news ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Live News Today: భారత్ - ఆస్ట్రేలియా బంధంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు: సిడ్నీలో హర్షధ్వానాల మధ్య ఈవెంట్

సిడ్నీలో జరిగిన ఈవెంట్‍లో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ(PTI)

Live News Today: భారత్ - ఆస్ట్రేలియా బంధంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు: సిడ్నీలో హర్షధ్వానాల మధ్య ఈవెంట్

11:41 PM ISTMay 23, 2023 10:20 PM HT Telugu Desk
  • Share on Facebook
11:41 PM IST

  • Live News, Latest Updates Today: నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ సహా అనేక అంశాలపై తాజా వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి. లేటెస్ట్ అప్‍డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి.

Tue, 23 May 202304:50 PM IST

Amara Raja Batteries results: భారీగా పెరిగిన ‘అమరరాజా’ లాభాలు; డివిడెండ్ ఎంతంటే..?

Amara Raja Batteries results: 2022 -23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY23) లో అమర రాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) నికర ఆదాయం గణనీయంగా పెరిగింది. Q4FY23 లో సంస్థ రూ. 2,429.4 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది.

Tue, 23 May 202304:09 PM IST

Google Pay: ఇక ‘గూగుల్ పే’ లో రూపే క్రెడిట్ కార్డ్ తో చెల్లింపులకు అవకాశం

Google Pay: ఇక గూగుల్ పే (Google Pay) యూజర్లు తమ గూగుల్ పే యాప్ లో రూపే క్రెడిట్ కార్డ్ (RuPay credit card) ను లింక్ చేసుకోవచ్చు. తద్వారా తమ గూగుల్ పే ద్వారా చేసే ఆన్ లైన్, ఆఫ్ లైన్ చెల్లింపులకు ఆ రూపే క్రెడిట్ కార్డ్ ను వాడుకోవచ్చు.

Tue, 23 May 202302:06 PM IST

Devotee offers 2000 rupees notes: హుండీలో 8 లక్షల విలువైన 2 వేల రూపాయల నోట్లు

2 వేల రూపాయల నోటును మార్కెట్లో నుంచి ఉపసంహరించబోతున్నట్లు, ప్రజలు తమ వద్ద న్న 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ శనివారం ప్రకటించింది. అదే రోజు ఒక అజ్ఞాత భక్తుడు మొత్తం 8 లక్షల రూపాయల విలువైన రూ. 2 వేల నోట్లను హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ఆలయంలోని హుండీలో వేశారు.

Tue, 23 May 202311:39 AM IST

భారత్ - ఆస్ట్రేలియా బంధంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Prime Minister Narendra Modi: ‘ఆస్ట్రేలియా’ సిడ్నీలోని క్యుడోస్ బ్యాంక్ ఏరీనా వేదికగా నేడు జరిగిన మెగా ఈవెంట్‍లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా-ఆస్ట్రేలియా బంధంపై మోదీ ఆసక్తికర కామెంట్లు చేశారు. “ఒకప్పుడు ఇండియా - ఆస్టేలియా సంబంధాన్ని 3C - కామన్వెల్త్, క్రికెట్, కర్రీగా కొందరు అభివర్ణించే వారు. దాని తర్వాత 3D - డెమక్రసీ (ప్రజాస్వామ్యం), డియాస్పొరా (ప్రవాసం), దోస్తీ (స్నేహం) అని కొందరు అంటున్నారు. ఇప్పుడు  రెండు దేశాల మధ్య బంధాన్ని కొందరు 3E - ఎనర్జీ (శక్తి), ఎకానమీ (ఆర్థిక వ్యవస్థ), ఎడ్యుకేషన్ (విద్య)గా అభివర్ణిస్తున్నారు” అని భారత ప్రధాని మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న ప్రవాస భారతీయులు వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆయన మాటలకు హర్షధ్వానాలు చేశారు. 

Tue, 23 May 202310:53 AM IST

SUVs to launch in June: మారుతి జిమ్ని, హోండా ఎలివేట్.. ఈ జూన్ నెలలో లాంచ్ కాబోతున్న ఎస్ యూ వీ లు..

SUVs to launch in June: కొత్తగా ఎస్ యూ వీని కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు మరో రెండు వారాలు ఎదురు చూడడం మంచిది. తద్వారా వారు జూన్ నెలలో లాంచ్ కాబోతున్న ఎస్ యూవీలను కూడా పరిశీలించి, ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. జూన్ నెలలో మారుతి జిమ్ని (Jimny), హోండా ఎలివేట్ (Elevate), హ్యుండై ఎక్స్టర్ (Exter) వంటి ఎస్యూవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ మూడు వాహనాల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా, లగ్జరీ కార్ల విభాగంలో మెర్సెడెజ్ బెంజ్ నుంచి కూడా రెండు కొత్త మోడల్స్ వస్తున్నాయి.

Tue, 23 May 202308:54 AM IST

UPSC Civils 2022 results: యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల వెల్లడి; తొలి నాలుగు ర్యాంకులు మహిళలకే..

UPSC Civils 2022 results: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫైనల్ ఫలితాలు వెలువడ్డాయి. సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. తొలి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం ఈ యూపీపఎస్సీ సివిల్స్ 2022 ప్రత్యేకత. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

Tue, 23 May 202308:32 AM IST

సిడ్నీ ఈవెంట్‍కు చేరుకున్న ప్రధాని మోదీ

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మెగా ఈవెంట్‍ వద్దకు చేరుకున్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా నలుమూలల నుంచి ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో ఈ ఈవెంట్‍కు వచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనెస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 

Tue, 23 May 202308:25 AM IST

కేదార్‌నాథ్ ఆలయానికి అక్షయ్ కుమార్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. నేడు ఉత్తరాఖండ్‍లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. 

Tue, 23 May 202307:44 AM IST

పార్లమెంటు నూతన భవనం ప్రారంభానికి సమయం ఖరారు

New Parliament Building: పార్లమెంటు నూతన భవనం ప్రారంభానికి సమయం ఖరారైంది. మే 28న ఆరంభమవుతుందని ఇటీవలే సమాచారం వెల్లడవగా.. తాజా సమయం కూడా ఖరారైంది. మే 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పార్లమెంటు నూతన  భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు మోదీకి ఇన్విటేషన్ పంపారు లోక్‍సభ సెక్రటరీ జనరల్. 

Tue, 23 May 202306:54 AM IST

కాసేపట్లో ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ మెగా ఈవెంట్

ఆస్ట్రేలియా సిడ్నీలోని కుదోస్ బ్యాంక్ ఎరీనాలో మెగా ఈవెంట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈవెంట్‍లో ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమానికి భారీగా హజరుకానున్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. కాగా, నేటి ఉదయం సిడ్నీలో పలు కంపెనీలకు చెందిన సీఈవోలతో మోదీ చర్చలు జరిపారు. భారత్‍తో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. 

Tue, 23 May 202306:26 AM IST

జూన్ 1 వరకు మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూన్ 1 వరకు పొడిగించింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు. 

Tue, 23 May 202305:53 AM IST

శరత్ బాబుకు రజినీ కాంత్ తుది నివాళి

నటుడు శరత్ బాబుకు ప్రముఖ సినీ హీరో రజినీ కాంత్ తుది నివాళులు అర్పించారు. చెన్నైలో శరత్ బాబు పార్థివ దేహాన్ని ఆయన సందర్శించారు. అనారోగ్యం కారణంగా శరత్ బాబు సోమవారం కన్నుమూశారు. 

Tue, 23 May 202305:25 AM IST

ఫామ్, ఐడీ అవసరం లేదు: పీఎన్‍బీ

తమ బ్యాంకు బ్రాంచ్‍ల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ఆధార్ కార్డు సహా ఎలాంటి డాక్యుమెంట్ చూపించాల్సిన అవసరం లేదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వెల్లడించింది. ఫామ్ కూడా నింపాల్సిన అవసరం లేదని చెప్పిందని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. 

Tue, 23 May 202305:07 AM IST

నేడు మమతా బెనర్జీని కలవనున్న కేజ్రీవాల్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు కలవనున్నారు. కేంద్రం తీసుకురానున్న ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని మమతను ఆయన కోరనున్నారు. 

Tue, 23 May 202304:48 AM IST

ముంబైను పేల్చేస్తా అంటూ బెదిరింపు

త్వరలో తాను ముంబైను పేల్చేస్తా అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఈ విషయంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేశారు. ట్వీట్ చేసిన వ్యక్తిని గుర్తించి, అరెస్టు చేశారు. 

Tue, 23 May 202304:11 AM IST

అదానీ షేర్ల జోరు

నేటి సెషన్‍లోనూ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర 15 శాతం పెరిగింది. ప్రస్తుతం రూ.2,675కు చేరింది. నేడు అదానీ పోర్ట్స్ స్టాక్ 6 శాతం పెరిగి 773.90 వద్ద ట్రేడ్ అవుతోంది.

Tue, 23 May 202304:03 AM IST

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

నాగ్‍పూర్ - పుణె హైవేపై బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 13 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని బుల్ధానా వద్ద ఈ ప్రమాదం జరిగింది. 

Tue, 23 May 202303:54 AM IST

లాభాలతో స్టాక్ మార్కెట్లు షురూ

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ఓపెన్ అయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 47.95 పాయింట్లు పెరిగి 18,362.35 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 111.43 పాయింట్లు ఎగబాకి 62,075.11 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.  

Tue, 23 May 202303:38 AM IST

వ్యాన్‍లో యువకుడి మృతదేహం

ఢిల్లీలోని యమున విహార్ రోడ్డు సమీపంలోని ఓ వ్యాన్‍లో అర్జున్ (32) అనే యువకుడి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడి మెడ చూట్టూ కత్తిపోట్లు ఉన్నాయి. 

Tue, 23 May 202302:58 AM IST

స్టాక్ మార్కెట్లు  ఫ్లాట్‍గా ఓపెన్ అయ్యే ఛాన్స్

భారత స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‍గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ఉంది. 

Tue, 23 May 202302:57 AM IST

నేటి నుంచి బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల ఎక్స్చేంజ్

నేటి నుంచి ప్రజలు రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది ఆర్బీఐ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Tue, 23 May 202302:54 AM IST

ఆస్ట్రేలియాలో సీఈవోలతో మోదీ భేటీ

ఆస్ట్రేలియా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా ఉన్నారు. ఆ దేశానికి చెందిన కొందరు సీఈవోలతో మోదీ.. మంగళవారం సమావేశమయ్యారు. పౌల్ స్క్రోడర్, జార్జినా హోప్ సహా మరికొందరు సీఈవోలతో మాట్లాడారు. భారత్‍తో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనెస్‍తో నేడు సమావేశం కానున్నారు భారత ప్రధాని మోదీ. 

Tue, 23 May 202302:55 AM IST

స్వల్పంగా తగ్గిన బంగారం రేటు

దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.56,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ.61,410కిగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.