Pushpa 2 Most Awaited Film: బాలీవుడ్ సినిమాలను అధిగమించిన పుష్ప-2.. మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూపులు-bollywood audience mostly awaited for allu arjun pushpa 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bollywood Audience Mostly Awaited For Allu Arjun Pushpa 2

Pushpa 2 Most Awaited Film: బాలీవుడ్ సినిమాలను అధిగమించిన పుష్ప-2.. మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూపులు

Maragani Govardhan HT Telugu
Apr 20, 2023 01:25 PM IST

Pushpa 2 Most Awaited Film: పుష్ప-2 సినిమా బాలీవుడ్ చిత్రాలను సైతం అధిగమించి అత్యధిక మంది ఎదురుచూస్తున్న హిందీ సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది. అక్షయ్, షారుఖ్, సల్మాన్ లాంటి హీరోల సినిమాలు ఈ మూవీ తర్వాతనే ఉన్నాయి.

పుష్ప2 లో అల్లు అర్జున్
పుష్ప2 లో అల్లు అర్జున్

Pushpa 2 Most Awaited Film: ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ లాంటి సనిమాలు సరిహద్దులను దాటి మరి వసూళ్ల వర్షాన్ని కురిపించాయి. ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాల పరిస్థితి బాగా దిగజారింది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మినహా మిగిలిన ఏ సినిమాలు కూడా పెద్దగా రాణించలేదు. అజయ్ దేవగణ్ భోళా, కార్తిక్ ఆర్యన్ షెహజాదా, రణ్ బీర్ కపూర్ తూ జూథీ మెయిన్ మక్కర్ లాంటి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ ప్రేక్షకులు ఏయే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.

ప్రముఖ బాలీవుడ్ సర్వే సంస్థ ఆర్నామ్యాక్స్ సినిమాటిక్స్ ప్రకారం ప్రేక్షకులు అత్యధికంగా ఎదురుచూస్తున్న హిందీ సినిమా ఏంటి? అని అడుగ్గా.. టాప్‌లో ఏ చిత్రముందో తెలిస్తే షాకవుతారు. ఈ సర్వేలో అగ్రస్థానంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 అన్నింటికంటే అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. బీటౌన్ బడా హీరోల సినిమాల సైతం పుష్ప-2 తర్వాత స్థానాల్లోనే ఉన్నాయి. ఈ ఏడాది విడుదల కానున్న అక్షయ్ కుమార్ హెరా ఫేరీ 4, షారుఖ్ ఖాన్ జవాన్, సల్మాన్ ఖాన్ టైగర్ 3 చిత్రాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 చిత్రం మాత్రం ఈ ఏడాది విడదలయ్యే అవకాశాలు కనిపించట్లేదు. 2024లోనే రిలీజ్ అవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం మాత్రం ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే పుష్ప-2 నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విపరీతంగా స్పందన లభించింది. ముఖ్యంగా కాళీ మాత అవతారంలో అల్లు అర్జున్ గెటప్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేనీ, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

IPL_Entry_Point